అన్వేషించండి

Xpulse 200 4V వారసుడిగా వచ్చిన Xpulse 210: ఆఫ్‌రోడ్‌ లవర్స్‌కు నిజంగా నచ్చుతుందా?

Hero Xpulse 210 బైక్‌ కొనాలనుకుంటున్నారా? ఇంజిన్‌, సస్పెన్షన్‌, వేరియంట్లు, కలర్‌ ఆప్షన్స్‌, ఎక్స్‌-షోరూమ్‌ ధర వంటి 5 ముఖ్యమైన విషయాలను ఇక్కడే సింపుల్‌గా తెలుసుకోండి.

Hero Xpulse 210 Full Details: భారతీయ మార్కెట్‌లో అడ్వెంచర్‌ బైక్‌లకు డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సిటీ రైడింగ్‌తో పాటు ఆఫ్‌రోడ్‌ ట్రిప్స్‌ కూడా చేయాలనుకునే వారికి Hero Xpulse సిరీస్‌ ఒక నమ్మకమైన పేరు. ఇప్పుడు Hero MotoCorp, పాపులర్‌ అయిన Xpulse 200 4V కి వారసుడిగా Xpulse 210 ను తీసుకొచ్చింది. పాత మోడల్‌తో పాటు కొత్తది కూడా ప్రస్తుతం అమ్మకాల్లో ఉంది. అయితే, Xpulse 210 కొనేముందు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు ఉన్నాయి.   

1. Xpulse 210లో ఉన్న ఇంజిన్‌ ఏమిటి?   

Hero Xpulse 210లో 210cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 24.6hp పవర్‌, 20.7Nm టార్క్‌ ఇస్తుంది. ఇదే ఇంజిన్‌ను Karizma XMRలో కూడా వాడుతున్నా, Xpulse అవసరాలకు తగ్గట్టుగా హీరో దీనిని బాగా రీ-వర్క్‌ చేసింది. కొత్త క్యామ్‌లు, షార్టర్‌ ఫైనల్‌ డ్రైవ్‌ గేరింగ్‌ ఇచ్చి, లో స్పీడ్‌లో మెరుగైన కంట్రోల్‌ వచ్చేలా ట్యూన్‌ చేశారు. ఆఫ్‌రోడ్‌లో ఇది చాలా ఉపయోగపడుతుంది.   

2. సస్పెన్షన్‌ ట్రావెల్‌ ఎంత ఉంటుంది?    

Xpulse 210లో ముందు టెలిస్కోపిక్‌ ఫోర్క్‌, వెనుక మోనోషాక్‌ సస్పెన్షన్‌ సెటప్‌ ఉంది. ముందు 210 మి.మీ, వెనుక 205 మి.మీ. ట్రావెల్‌ అందిస్తున్నారు. వెనుక సస్పెన్షన్‌కు ప్రీలోడ్‌ అడ్జస్ట్మెంట్‌ మాత్రమే ఇస్తున్నారు. గ్రావెల్‌ రోడ్లు, మట్టి దారులు, లైట్‌ ట్రయల్‌ రైడింగ్‌ చేసే వారికి ఇది చాలిపోతుంది.

3. ఎన్ని వేరియంట్లు ఉన్నాయి? 

Hero Xpulse 210ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు, అవి: 

బేస్‌ వేరియంట్‌ 

టాప్‌ వేరియంట్‌ 

బేస్‌ వేరియంట్‌లో LCD డిస్‌ప్లే, చిన్న విజర్‌ మాత్రమే ఇస్తారు. లగేజ్‌ ర్యాక్‌, నకిల్‌ గార్డ్స్‌ ఇందులో ఉండవు.   

టాప్‌ వేరియంట్‌లో మాత్రం TFT డిస్‌ప్లే, ఎత్తైన వైజర్‌, లగేజ్‌ ర్యాక్‌, నకిల్‌ గార్డ్స్‌ స్టాండర్డ్‌గా వస్తాయి. 

4. కలర్‌ ఆప్షన్స్‌ ఏమున్నాయి?    

బేస్‌ వేరియంట్‌ను వైట్‌ కలర్‌లో మాత్రమే ఇస్తున్నారు. టాప్‌ వేరియంట్‌కు మాత్రం రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి –   

సిల్వర్‌ – రెడ్‌ కలర్‌ స్కీమ్‌

రెడ్‌ – బ్లూ – వైట్‌ కలర్‌ స్కీమ్‌

5. ధర ఎంత?

Hero Xpulse 210 ధరలు ఇలా ఉన్నాయి – 

బేస్‌ వేరియంట్‌: ₹1.62 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)  

టాప్‌ వేరియంట్‌: ₹1.71 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) 

ఈ ధరకు లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, లాంగ్‌ సస్పెన్షన్‌ ట్రావెల్‌, అడ్వెంచర్‌ ఫ్రెండ్లీ సెటప్‌ రావడం పెద్ద ప్లస్‌.  

ఫైనల్‌గా...  మీరు Xpulse 200 4V నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకుంటే, లేదా మొదటిసారి అడ్వెంచర్‌ బైక్‌ కొనాలని చూస్తే, Hero Xpulse 210 ఖచ్చితంగా పరిశీలించాల్సిన బైక్‌. డైలీ రైడ్‌తో పాటు వీకెండ్‌ ఆఫ్‌రోడ్‌ ఎంజాయ్‌ చేయాలనుకునే తెలుగు రైడర్లకు ఇది ఒక ఆల్‌ రౌండర్‌ ప్యాకేజ్‌ అని చెప్పొచ్చు.       

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.  

టాప్ హెడ్ లైన్స్

Best Hybrid Cars: అత్యంత చవకైన హైబ్రిడ్ కార్లు ఇవి, కొనేముందు ఈ లిస్ట్ చూడండి
అత్యంత చవకైన Hybrid Cars, కొనేముందు ఈ లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
చూడగానే ఆకట్టుకునే Honda 0 Alpha EV.. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో రాబోతోంది!
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో హోండా ఎలక్ట్రిక్ SUV.. దీనిని కొంటే అందరి కళ్లూ మీ మీదే!
స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!
స్కోడా కారు కొనేవాళ్లకు బంపర్‌ డిస్కౌంట్లు.. రూ.90,000 వరకు మిగులుతుంది!
విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
అంత ప్రాణభయం ఉంటే దేశం వదిలి వెళ్లిపో జగన్! కౌంటర్ ఇచ్చిన షర్మిల బంధువులు
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Embed widget