Donald Trump On Tariffs: అమెరికాలో మళ్లీ స్వర్ణయుగం, సరిహద్దులు మరింత సురక్షితం: ఏడాది పాలనపై ట్రంప్
అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్ విషయంలో దురదృష్టకరమైన తీర్పు ఇచ్చిందని, ఆ దేశాలు టారిఫ్ కచ్చితంగా చెల్లిస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో ప్రసగించారు.

వాషింగ్టన్: అమెరికాలో ఎన్నడూ చూడని మార్పు వచ్చిందని, దేశ సరిహద్దులు అత్యంత సురక్షితమని, టారిఫ్ విషయంలో తగ్గేది లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, డ్రగ్స్ నియంత్రణ, అంతర్జాతీయ విధానంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి కాంగ్రెస్ ఉమ్మడి సమావేశం (స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమం)లో కీలక ప్రసంగం చేశారు.
జనవరి 2025లో ప్రారంభమైన ట్రంప్ రెండో పదవీకాలంలో ఇది మొదటి స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగం. ట్రంప్ తన మొదటి 13 నెలల విజయాలను వివరించారు. అక్రమల వలసలు నివారించాం. దేశ సరిహద్దు గతంలో కంటే మరింత సురక్షితం చేశాం. ఐదేళ్లలో అత్యల్ప స్థాయికి ద్రవ్యోల్బణాన్ని తీసుకొచ్చాం. తొలి ఏడాదిలోనే 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం’ అని పేర్కొన్నారు.
అమెరికాలో యుగాల మార్పును తీసుకువచ్చాం: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో పలు అంశాలు ప్రస్తావించారు. 'నేను సంక్షోభంలో ఉన్న సమయంలో దేశ బాధ్యతలను స్వీకరించాను. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా అరాచకం విస్తరించి ఉంది. కానీ ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నాను. ఎవరూ ముందెన్నడూ చూడని మార్పును అమెరికాలో తీసుకువచ్చాం. ఈ మార్పు యుగాల నాటి సాధ్యం కానిది. ఆర్థిక వ్యవస్థ కేవలం మూడు నెలల్లోనే పుంజుకుంది. గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గాయి. అమెరికా గతంలో కంటే సురక్షితంగా, మరింత దృఢంగా మారింది. వెనెజులా నుంచి అమెరికాకు 80 మిలియన్ బ్యారెళ్ల చమురు వస్తుందని’ చెప్పారు.
#WATCH | Addressing the 2026 State of the Union, United States President Donald Trump says, "... We're going to do better and better and better. This is the golden age of America. When I last spoke in this chamber 12 months ago, I had just inherited a nation in crisis with a… pic.twitter.com/xrob8HzGKP
— ANI (@ANI) February 25, 2026
అమెరికాకు స్వర్ణయుగం..
డొనాల్డ్ ట్రంప్ ఇంకా మాట్లాడుతూ ‘మనం రోజురోజుకూ మెరుగుపడుతూనే ఉంటాం. ఇంకా మెరుగుపడుతున్నాం. ఇది అమెరికా స్వర్ణయుగం. 12 నెలల కిందట నేను చివరిసారిగా ఈ సభలో మాట్లాడినప్పుడు, ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం లేదు. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, పూర్తిగా తెరిచి ఉన్న సరిహద్దులు ఉండేవి. సైనిక, పోలీసు నియామకాలలో లోపాలు, పెరుగుతున్న నేరాలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అరాచకాలతో సంక్షోభంలో ఉన్న సమయంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాను. కానీ సరిగ్గా ఏడాది తర్వాత, ముందెన్నడూ ఎవరూ చూడని విధంగా గొప్ప మార్పును సాధించాం. ఈ విషయాన్ని ఎంతో హుందాతనంతో, గర్వంతో చెప్పగలను. ఇది నిజంగా యుగాల నాటి నుంచి అమెరికాలో అద్భుతమైన మార్పు’ అని పేర్కొన్నారు.
‘నాలుగు రోజుల క్రితం అమెరికా సుప్రీంకోర్టు ఒక దురదృష్టకర తీర్పు ఇచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. కానీ అమెరికాకు శుభవార్త ఏమిటంటే దాదాపు అన్ని దేశాలు, కార్పొరేషన్లు వారు ఇప్పటికే చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాయి. అమెరికా టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని’ ట్రంప్ స్పష్టం చేశారు.
























