అన్వేషించండి

Innova Crysta: షాకింగ్, ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు నిలిపివేత - కారణాలు ఇవే!

టయోటా కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ వెర్షన్‌ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇక ఆ ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే..  డీజిల్ ఇన్నోవా క్రిస్టా అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. బుకింగ్స్ సైతం తీసుకోవడం లేదు. అంతేకాదు.. ఇప్పటికే ఆ కార్ల కోసం బుక్ చేసుకున్న కస్లమర్లనూ పెట్రోల్ క్రిస్టా తీసుకోవాలని కోరుతుందట. ప్రస్తుత పరిస్థితుల్లో డీజిల్ కారుతో పోల్చితే పెట్రోల్ క్రిస్టా కారు ధర తక్కువగా ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుందట. అయితే కస్టమర్లు మాత్రం తమకు డీజిల్ కార్లు మాత్రమే కావాలని పట్టుబడుతున్నారట. పెట్రోల్ కార్లు కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారట. వాస్తవానికి డీజిల్ క్రిస్టా ధరలు పెంచినప్పటికీ వినియోగదారులు వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ఇంత బాగా అమ్మకాలు కొనసాగుతున్నా డీజిల్ క్రిస్టా బుకింగ్స్ కంపెనీ ఎందుకు నిలిపివేసింది? అనేది కస్టమర్లకు అర్థం కావడం లేదు.    

తాత్కాలికంగా  అమ్మకాలు నిలిపివేసిన టయోటా ఇన్నోవా క్రిస్టా 147 hp, 360 Nm టార్క్‌ను విడుదల చేసే 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్,  6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంది.  మరోవైపు, పెట్రోల్ వేరియంట్‌లు 164 bhp, 245 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.7-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి.  టయోటా ఇన్నోవా క్రిస్టాతో 2.8-లీటర్ డీజిల్ ఆటోమేటిక్‌ను కూడా అందించింది. అయితే  2020లో దీని అమ్మకాలు నిలిచిపోయాయి.

అమ్మకాల నిలిపివేతకు కారణం అదేనా?

దేశీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టయోట వాహనాల్లో డీజిల్‌ ఇన్నోవా క్రిస్టానే టాప్. నెలకు 7 వేల 900 కార్లును అమ్ముతుంది. సెకెండ్ జెనరేషన్ క్రిస్టా ఇప్పటికే భారత్ లో మిలియన్ యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.  ఇంత మంచి సేల్స్ ఉన్న కార్ల అమ్మకాలను కంపెనీ తాత్కాలికంగా నిలిపివేయడం పట్ల వినియోగదారులు షాక్ అవుతున్నారు. డీజిల్ ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ఎందుకు నిలిపివేశారో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆటో నిపుణులు మాత్రం సెమీ కండక్టర్ల షార్టేజ్ కారణంగానే నిలిపివేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇన్నోవా క్రిస్టా ఇతర వేరియంట్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా ధర ₹17. 45 లక్షల నుంచి  ₹23. 83 లక్షల మధ్య కొనసాగతున్నది.  MPV ఆరు,  ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంది. ఇది ప్రీమియం MPVలో స్లాట్ చేయబడింది.  ఈ కారు హ్యుందాయ్ అల్కాజార్, కియా కారెన్స్, మారుతి సుజుకి XL6 కార్లతో పోటీ పడుతుంది.   

టయోటా నుంచి సరికొత్త కార్లు

టొయోటా కంపెనీకి చెందిన హైరైడర్ వాహనం తాజాగా దేశీయ మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఇది సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. అటు  టాయోటా కొత్తగా ఇన్నోవా పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ తో వస్తున్నది. ఈ కారులోని ఇంటీరియర్‌ చాలా లగ్జరీగా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది.  

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget