అన్వేషించండి

Toll Hike: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ధరలు..! క్యాష్ పేమెంట్స్ ఇక బంద్!!

Toll Hike: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరుగుతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలపై 5 శాతం వరకు భారం పడటంతో పాటు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు కూడా పెరిగాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై టోల్ ధరలు 5% పెరుగుతాయి.
  • టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు నిలిపివేసి, ఫాస్టాగ్ తప్పనిసరి.
  • కొన్ని రాష్ట్రాల రహదారులపై కూడా టోల్ ఫీజులు పెంచారు.
  • వార్షిక ఫాస్టాగ్ పాస్ ధర రూ. 3,000 నుంచి రూ. 3,075 కు చేరనుంది.

Toll Hike: వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఖరీదు కానుంది. కేంద్ర ప్రభుత్వం టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ (Delhi NCR) పరిధిలోని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్/వెస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వారు అదనపు భారం మోయక తప్పదు. ఉదాహరణకు ఒక సింగిల్ ట్రిప్ ధర ప్రస్తుతం ఉన్న రూ. 170 నుండి రూ. 177 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో రెగ్యులర్ గా ప్ర‌యాణాలు చేసే వారి జేబుల‌కు చిల్లు ప‌డ‌టం ఖాయంగా మారింది. 

క్యాష్ పేమెంట్స్ ఇక చెల్లవు

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు (Cash) రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. వాహనదారులు కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిట‌ల్ చెల్లింపులను ప్రొత్స‌హిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పెద్ద‌మొత్తంలో న‌గ‌దు లావాదేవీల‌ను కూడా కేంద్రం నిరుత్సాహ‌ప‌రుస్తోంది. ఒక ప‌రిధికంటే ఎక్కువ దాటిన న‌గ‌దు లావాదేవీల‌పై ప‌న్నులు కూడా విధిస్తోంది. 

రాష్ట్రాల వారీగా ధరల పెంపు

కేవలం జాతీయ రహదారులే కాకుండా కొన్ని రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై 3 నుండి 5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. తమిళనాడులో కూడా ఈస్టర్ కోస్ట్ రోడ్, మదురై రింగ్ రోడ్ సహా మొత్తం 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి. దూర ప్రయాణాలు చేసే వారికి ఈ పెంపు వల్ల ట్రావెల్ బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ భారం

నిత్యం టోల్ గేట్ల గుండా ప్రయాణించే వారి కోసం ఇచ్చే ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను ప్రభుత్వం భారీగా సవరించింది. ప్రస్తుతం 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 ధర ఏప్రిల్ 1 నుండి ఏకంగా రూ. 3,075 కు చేరనుంది. అయితే ఈ వార్షిక పాస్ కేవలం నేషనల్ హైవేల మీద మాత్రమే పని చేస్తుంది. ఓవ‌రాల్ ఒక ప్ర‌యాణానికి కేవ‌లం 15 రూపాయ‌లు చెల్లించి, చౌక‌గా ప్ర‌యాణించే అవ‌కాశాన్ని ఈ పాస్ అందిస్తోంది. ఇక‌, స్టేట్ హైవేలు, కొన్ని ప్రైవేట్ ఎక్స్‌ప్రెస్‌వేల వద్ద ఇది చెల్లదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనదారులు తమ ప్రయాణ ఖర్చుల విషయంలో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం మంచిదని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

ఏప్రిల్ 1 నుండి టోల్ ధరలు ఎంత పెరగనున్నాయి?

వచ్చే ఏప్రిల్ 1 అర్ధరాత్రి నుండి దేశంలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై టోల్ ధరలను సుమారు 5 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు కొనసాగుతాయా?

లేదు, ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో డబ్బులు తీసుకోవడం పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలో ఏమైనా మార్పులు ఉన్నాయా?

అవును, 200 టోల్ క్రాసింగ్స్ కోసం ఉన్న రూ. 3,000 వార్షిక పాస్ ధర ఏప్రిల్ 1 నుండి రూ. 3,075 కు పెరగనుంది.

ఏ రాష్ట్రాలలో టోల్ ఫీజులు పెరుగుతున్నాయి?

కేవలం జాతీయ రహదారులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా టోల్ ఫీజును పెంచాయి. కర్ణాటకలో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే, తమిళనాడులో 66 టోల్ ప్లాజాల వద్ద చార్జీలు మారుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget