(Source: ECI/ABP News/ABP Majha)
E-బైక్ కొనే ముందు మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి
మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు గమనించాల్సిన విషయాలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాలుష్య తీవ్రత భారీగా పెరిగిపోయింది. భూమి, నీరు, గాలి కాలుష్యం మూలంగా మనుషులతో పాటు పశువులు, పక్షులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న వాహనాల మూలంగా వాయు కాలుష్యం భారీగా పెరిపోతున్నది. ఫలితంగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలుష్య రహిత వాహనాల వినియోగం పట్ల జనాల్లో అవగాన కలుగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మీద జనాలు ఫోకస్ పెట్టారు. దీని మూలంగా వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా.. ఇంధన ఖర్చు సైతం భారీగా ఆదా అవుతుంది. చాలా మంది ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఈ బైకులను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి.
అవసరాలకు సరిపడే మోడల్ ఎంచుకోండి
E బైక్ కొనేటప్పుడు సరైన మోడల్ ను ఎంచుకోవాలి. మంచి ప్రయోజనం కలిగే బైకును మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మీ అవసరాలకు అనుకూలంగా ఉండే దాన్ని తీసుకోవాలి. చక్కటి సీటింగ్ పొజిషన్, ఎత్తైన, దగ్గరగా ఉండే హ్యాండిల్ బార్ కలిగిన బైక్ తీసుకోవడం మూలంగా గంటల తరబడి రైడింగ్ చేసినా.. చేతులను రిలాక్స్ గా ఉంచుతుంది. ప్రస్తుతం హైబ్రిడ్ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి, ఇవి ఎర్గోనామిక్‌గా సౌండ్‌గా ఉంటాయి. సాధారణ టాప్-ఆఫ్-లైన్ బైక్‌తో పోలిస్తే రైడింగ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ లెవల్స్‌ను అందిస్తాయి. ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటాయి. ఏ బైక్ తీసుకున్నా.. మీ అవసరాలకు సరిపడుతుందో? లేదో? ముందుగా అంచనా వేసుకోవాలి.
బ్యాటరీ పనితీరును గమనించండి
E-బైకులు కొనుగోలు సమయంలో చూడాల్సిన కీలక అంశం బ్యాటరీ. దాని సామర్ధ్యం ఎంతో ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే E-బైక్‌లు బ్యాటరీలపై మాత్రమే నడుస్తాయి. సుదీర్ఘమైన ప్రయాణానికి అలవాటుపడి, తక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో ఉండే బైకును తీసుకుంటే మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు బ్యాటరీ, దాని పనితీరును తనిఖీ చేయండి. ఈ బ్యాటరీలను ప్రధాన సాకెట్ ద్వారా ప్రతి కొన్ని గంటలకు ఒకసారి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సగటున 3 కిలోల బరువు ఉంటుంది. ప్రాథమికంగా, మూడు విభిన్న రకాల బ్యాటరీలు ఉన్నాయి. అవి సీసం-ఆధారిత బ్యాటరీలు, నికెల్-కాడ్మియం బ్యాటరీలు,లిథియం బ్యాటరీలు. లీడ్-ఆధారిత బ్యాటరీలు మూడింటిలో చౌకైనవి. కానీ, పెద్దగా ఉంటాయి. వాతావరణ పరిస్థితులలో మార్పులకు గురవుతాయి. నికెల్-కాడ్మియం బ్యాటరీలు తేలికగా ఉంటాయి.. కానీ తరుచూ సమస్యలకు గురవుతాయి. లిథియం బ్యాటరీలు మంచి పనితీరును అందిస్తాయి, అయితే మిగిలిన రెండింటితో పోల్చినప్పుడు ఇవి చాలా ఖరీదైనవి.
గేర్లు ఉన్నాయా?
E-బైకుల కోసం వెతుకున్న వారు తమకు కావాల్సిన వేగాన్ని అందుకునేందుకు అవసరం అయిన ట్రాన్స్ మిషన్ సిస్టమ్ ఉందా? లేదా? అని చూడాలి. E-బైకులు తరచుగా డెరైల్లూర్ సిస్టమ్‌తో వస్తాయి. ఇవి గేర్‌లను సజావుగా పనిచేసేలా సహాయపడుతాయి. సిటీ అవసరాల కోసం ఉపయోగించే బైకులు గేర్ హబ్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయి. మొత్తంగా ఈ బైకులు తీసుకునే వాళ్లు పై విషయాలను గుర్తు పెట్టుకోవడం ద్వారా మంచి ఇ-బైక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
Also Read: యాక్టివా ప్రీమియం ఎడిషన్ వచ్చేసింది, అదిరిపోయే లుక్, కళ్లు చెదిరే ఫీచర్స్ - ధర ఎంతంటే..
Also Read: అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో సామాన్యుడి కారు- Alto K10 ప్రత్యేకతలు ఇవే!