Most Popular cars in India: దశాబ్దాల నుంచి మార్కెట్లో ఉన్నా తగ్గని మార్కెట్ - ఈ కార్ల క్రేజ్ అలా ఉంది మరి!
ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కార్లు ఇవే.
Best cars in Indian Market: ఎప్పుడు లాంచ్ అయ్యాయనే విషయంతో సంబంధం లేకుండా మనదేశంలో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వీటి బ్రాండింగ్‌ను కంపెనీలు కూడా క్యాష్ చేసుకుంటాయి. అప్‌డేటెడ్ వెర్షన్లు లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటాయి. 2000 సంవత్సరంలో లాంచ్ అయి ఇప్పటికీ మనదేశంలో టాప్ మోడల్‌గా కొనసాగుతున్న కార్లు కూడా మనదేశంలో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి కార్ల వివరాలు తెలుసుకుందాం.
హ్యుందాయ్ వెర్నా
ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో హ్యుందాయ్ వెర్నా ఉంది. ఈ కారును 2006 నుంచి హ్యుందాయ్ భారతదేశంలో విక్రయిస్తోంది. ఇటీవలే దాని నాలుగో తరం మోడల్‌ను కూడా విడుదల చేసింది.
టయోటా ఇన్నోవా
టయోటా తన ఎంపీవీ ఇన్నోవాను మొదటగా 2005లో విడుదల చేసింది. క్వాలిస్ స్థానంలో టయోటా ఇన్నోవాను తీసుకువచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన థర్డ్ జనరేషన్ ఇన్నోవా హైక్రాస్‌ను కంపెనీ విక్రయిస్తుంది.
మారుతీ సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్ ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లోకి విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో దీనికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ మోడల్ అందుబాటులో ఉంది.
టయోటా కామ్రీ
టయోటా తన సెడాన్ మోడల్ కారు క్యామ్రీని 2002లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర అప్పుడు రూ. 17.95 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. అంటే ఈ కారు మొదట లాంచ్ అయి రెండు దశాబ్దాలు దాటిపోయిందన్న మాట. ఇప్పుడు టయోటా కామ్రీ బేస్ మోడల్ ధర రూ. 45.71 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది.
మహీంద్రా బొలెరో
ఈ లిస్ట్‌లో తర్వాతి ప్లేస్‌లో ఉంది మహీంద్రా బొలెరో. ఈ కారును 2000 సంవత్సరం నుంచి భారత మార్కెట్లో మహీంద్రా విక్రయిస్తోంది. అయితే ఈ కారును కంపెనీ ఎక్కువగా అప్‌గ్రేడ్ చేయలేదు. ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడుపోతున్న మహీంద్రా వాహనాలలో ఇది కూడా ఒకటి. 2021లో మహీంద్రా బొలెరో నియో పేరుతో కంపెనీ మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియో దేశీయ మార్కెట్లో 2002 సంవత్సరంలో లాంచ్ అయింది. గత సంవత్సరం స్కార్పియో-ఎన్‌గా మరో మోడల్‌గా గత సంవత్సరం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్కార్పియో మొదటి మోడల్ స్కార్పియో క్లాసిక్‌గా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో వినియోగదారుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం మహీంద్రాలో అత్యంత డిమాండ్ ఉన్న వాహనం స్కార్పియో-ఎన్. దీని జెడ్2 పెట్రోల్‌పై ఆరు నుంచి ఏడు నెలలు, డీజిల్ వేరియంట్‌పై ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని జెడ్4, జెడ్6 వేరియంట్ విషయంలో అయితే 12 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్‌లో ఉండాల్సిదే. జెడ్8ఎల్ ఏటీ పెట్రోల్ వేరియంట్ విషయంలో మూడు నెలల వరకు, జెడ్8ఎల్ ఏటీ డీజిల్ మోడల్‌పై ఎనిమిది నెలల వరకు, అత్యధికంగా అమ్ముడవుతున్న జెడ్8 వేరియంట్‌పై 13 నెలల వరకు ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఉంది.