(Source: ECI/ABP News/ABP Majha)
Tata Tiago EV: రూ.75 వేల వరకు ఆఫర్ - ఆరు నెలలు ఫ్రీ ఆఫర్ - టాటా టియాగో ఈవీపై బంపర్ ఆఫర్!
Tata Tiago EV Offers: టాటా టియాగో ఈవీపై కంపెనీ భారీ ఆఫర్లను అందించింది. ఈ ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా రూ.75 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
Cars Under 8 Lakh In India: టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కారుపై దీపావళి ఆఫర్‌తో ముందుకు వచ్చింది. టాటా టియాగో ఈవీపై రూ. 75,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. దీంతో పాటు కారును కొనుగోలు చేసిన తర్వాత వచ్చే ఆరు నెలల పాటు ఏదైనా టాటా పవర్ స్టేషన్ నుంచి ఉచితంగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. టియాగో ఈవీపై ఈ ఆఫర్ అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందించనున్నారు.
టియాగో ఈవీ రేంజ్ ఎంత?
టాటా టియోగా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. టాటా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది దాని మిడ్ రేంజ్ వేరియంట్. ఈ బ్యాటరీ ప్యాక్‌తో టాటా టియాగో ఈవీ కారు సింగిల్ ఛార్జింగ్‌లో 221 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని పేర్కొంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కారు 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో లాంగ్ రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌లో 275 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. టాటా నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ వాహనాన్ని కేవలం 58 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
టాటా ఈవీ పవర్ ఎంత?
టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లు లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తాయి. ఈ ఇంజిన్‌తో మీడియం రేంజ్ వేరియంట్లు 60 బీహెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను పొందుతాయి. మరోవైపు లాంగ్ రేంజ్ వేరియంట్లు 73 బీహెచ్‌పీ పవర్, 114 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ వాహనంలో మల్టీ మోడ్ రీజెనరేషన్ బ్రేకింగ్ ఫీచర్ కూడా ఉంది.
టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్ వేరియంట్‌తో 6.2 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. లాంగ్ రేంజ్ వెర్షన్‌లో ఈ కారు కేవలం 5.7 సెకన్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.
టాటా టియాగో ఈవీ ధర
టాటా టియాగో ఈవీ... ఏడు వేరియంట్‌ల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారు ఐదు కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ కారులో టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ ప్లమ్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ టాటా కారు ఎనిమిది సంవత్సరాల వారంటీతో లభిస్తుంది. టాటా టియాగో ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Every story has a wish, silent or loud;
— TATA.ev (@Tataev) October 17, 2024
And we are here to make that wish come true!
Drive home your wish with the Tiago.ev from our Festival of Cars, with benefits of up to ₹75,000* and added savings of up to ₹75,000* on fuel costs with 6 months FREE charging* at 5600+… pic.twitter.com/ty5ksK42ac