Tata Nexon CNG: మార్కెట్లోకి టాటా నెక్సాన్ సీఎన్‌జీ - ధర ఎంతో తెలుసా?
Tata New CNG Car: భారతీయ మార్కెట్లో టాటా కొత్త సీఎన్‌జీ కారును లాంచ్ చేసింది. అదే టాటా నెక్సాన్ సీఎన్‌జీ. దీని ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
Tata Nexon CNG Launched: కార్ల తయారీదారు టాటా మోటార్స్ భారతదేశంలో కొత్త నెక్సాన్ సీఎన్‌జీ కారును విడుదల చేసింది. ఇది టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగిన మొదటి సీఎన్‌జీ కారు ఇదే. ఇది నాలుగు ఫ్యూయల్ ఆప్షన్లను కలిగి ఉంది.
టాటా నెక్సాన్ సీఎన్‌జీ ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఇది 8 ట్రిమ్ వేరియంట్లను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ (వో), స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ప్లస్ ఎస్ ఉన్నాయి. దీని టాప్ స్పెక్ వేరియంట్ రూ. 14.99 లక్షల వరకు ఉంది. ఇది కూడా ఎక్స్ షోరూమ్) ధరే.
టాటా మోటార్స్ మొట్టమొదటి టర్బో ఛార్జ్డ్ సీఎన్‌జీ కారు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్‌పై రన్ చేసినప్పుడు 118 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సమయంలో సీఎన్‌జీతో ఇది 99 బీహెచ్‌పీ పవర్‌ని, 170 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ట్విన్ సిలిండర్ ఐ-సీఎన్‌జీలో, రెండు 30 లీటర్ సిలిండర్లు బూట్ ఫ్లోర్ కింద ఉంచారు. ఇది కంప్లీట్ బూట్ స్పేస్‌ను అందిస్తుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ఎలా ఉన్నాయి?
కారు డిజైన్ గురించి చెప్పాలంటే నెక్సాన్ సీఎన్‌జీ, దాని డీజిల్, పెట్రోల్ మోడల్స్ తరహాలోనే ఉంటుంది. టాటా నెక్సాన్ సీఎన్‌జీలో మీరు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఇతర ఫీచర్లను పొందుతారు.
ఈ సీఎన్‌జీ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఏబీఎస్ ఈబీడీ, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంలు, వెనుక డి ఫాగర్ వంటి ఆప్షన్లు కూడా అందించారు. దీంతో పాటు గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో టాటా నెక్సాన్ సీఎన్‌జీ 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది.
మార్కెట్‌లో టాటా సీఎన్‌జీ కారు మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీతో పోటీ పడుతుంది. ధర పరంగా చూసుకుంటే... మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్‌జీ వేరియంట్లతో పోటీపడుతుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
Get ready to be WOWed like never before! 🤩
— Tata Motors Cars (@TataMotors_Cars) September 24, 2024
The most awaited CNG of the year is here - Nexon iCNG!
Experience the thrill of India’s first Turbo CNG, combined with premium features that will WOW you on every drive.
Book Now- https://t.co/hnblvMWJTF#NexonCNGWowCNG #NexonCNG pic.twitter.com/eUdMS8dmfo