Tata Winger Plus Latest Updates: అద్భుతమైన ఫీచర్లతో టాటా వింగర్ ప్లస్ లాంఛ్.. ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా..?
ఎక్కువ మంది ప్రయాణించేందుకు అనుకూలమైన తాజా మోడల్ ను టాటా మోటార్స్ ప్రవేశ పెట్టింది. పాసింజర్ వెహికల్ రంగంలో అనేక ఫీచర్లతో ఈ మోడల్ వస్తోందని కంపెనీ పేర్కొంది.

Tata Motors Winger Plus Latest Updates: పండుగ సీజన్ దగ్గరికి వస్తుండటంతో టాటా మోటార్స్ తమ నూతన మోడల్ ను ఆవిష్కరించింది. ఎక్కువ మంది ప్రయాణానికి అనుకూలమైన టాటా వింగ్ ప్లస్ ను లాంచ్ చేసింది. టాటా మోటార్స్ తాజాగా 9 సీటర్ల కొత్త టాటా వింగర్ ప్లస్‌ను రూ. 20.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లాంచ్ చేసింది. ప్రయాణికులకు మరింత అనుకూలమైన, విశాలమైన ,కనెక్టెడ్ ట్రావెల్ అనుభవాన్ని అందించడంతో పాటు, ఫ్లీట్ ఓనర్లకు తక్కువ ఓనర్షిప్ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం , లాభాలను సాధించేలా ఇది రూపొందించబడింది. ఈ విభాగంలోనే అత్యుత్తమమైన ఫీచర్లయిన రిక్లైనింగ్ కెప్టెన్ సీట్లు (అడ్జస్టబుల్ ఆర్మ్‌రెస్టులతో), వ్యక్తిగత యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్లు, వ్యక్తిగత ఏసీ వెంట్స్ , స్పెషియస్ లెగ్ స్పేస్ లాంటి అదనపు హంగులు వింగర్ ప్లస్‌లో ఉన్నాయి. విశాలమైన కెబిన్ , పెద్ద లగేజీ స్థలం లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాల్లో మరింత సౌకర్యాన్ని కలిగిస్తాయి. మోనోకోక్ చాసిస్‌పై నిర్మితమైన ఈ వాహనం గట్టి భద్రత , స్టెబిలిటీని అందిస్తుంది. కార్లను పోలిన రైడ్ అనూభూతితోపాటు, హ్యాండ్లింగ్ డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రీమియం అనుభవాన్ని..
వింగర్ ప్లస్‌ను పరిచయం చేస్తూ, టాటా మోటార్స్ కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ ,హెడ్ ఆనంద్ ఎస్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని, ఫ్లీట్ ఆపరేటర్లకు ఉత్తమ వ్యాల్యూను అందించాలనే లక్ష్యంతో వింగర్ ప్లస్‌ను జాగ్రత్తగా రూపొందించామని తెలిపారు. దీనిలో ఫస్ట్ క్లాస్ ప్రయాణ సౌకర్యం, అత్యుత్తమ ఫీచర్లు , ఈ విభాగంలోనే అధిక సామర్థ్యం వలన ఇది లాభసాటిగా ఉండటమే కాకుండా, అత్యల్ప ఓనర్షిప్ ఖర్చుతో కూడిన వాహనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్‌లోని ప్రయాణ అవసరాలు వేగంగా మారుతున్నాయని, పట్టణ ప్రాంతాల్లో సిబ్బంది రవాణా వ్యవస్థ నుంచి దేశవ్యాప్తంగా పర్యాటనకు పెరుగుతున్న డిమాండ్ వరకు.. సేవలందించేందే విధంగా వింగర్ ప్లస్ రూపొందించబడిందని తెలిపారు. ఇది కమర్షియల్ ప్యాసింజర్ వాహన రంగంలో కొత్త ప్రమాణాలు స్థాపించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అద్భుత ఫీచర్లు..
తాజా వింగర్ ప్లస్ లో 2.2 లీటర్ల డికార్ డీజిల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 100 హెచ్‌పీ శక్తిని మరియు 200 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రీమియం వాన్ టాటా మోటార్స్ ఫ్లీట్ ఎడ్జ్ కనెక్టెడ్ వాహన ప్లాట్‌ఫారంతో డిజైన్ చేయబడింది. ఇది రియల్ టైమ్ వాహన ట్రాకింగ్, డయాగ్నొస్టిక్స్ , ఫ్లీట్ ఆప్టిమైజేషన్‌ను కలిగి ఉండి వ్యాపార నిర్వహణను మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంటోంది. టాటా మోటార్స్ కమర్షియల్ ప్యాసింజర్ వాహన శ్రేణిని సంపూర్ణ సేవ 2.0తో మరింత బలోపేతం చేయబడిందని, ఇది వార్షిక నిర్వహణ గ్యారెంటీ, బ్రేక్‌డౌన్ హెల్ప్, అసలైన విడిభాగాల లభ్యత లాంటివి కవర్ చేస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 4,500 కంటే ఎక్కువ విక్రయ , సేవా కేంద్రాల బలమైన నెట్‌వర్క్‌తో, టాటా మోటార్స్ వినియోగదారులకు సేవను అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది.




















