అన్వేషించండి

డబ్బు రెడీ చేసుకోండి, మెరుపుల్లాంటి 3 కొత్త కార్లు సెప్టెంబర్‌లో వస్తున్నాయి

Upcoming cars September 2025: ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొనే ప్లాన్‌ చేస్తున్నారా?. వచ్చే నెలలో, మారుతి నుంచి రెండు, టాటా నుంచి ఒక కారు మార్కెట్‌లోకి రాబోతోంది.

Best upcoming SUVs 2025: దసరా, దీపావళి పండుగ సీజన్‌ ఇండియన్‌ ఆటోమొబైల్ మార్కెట్‌కు మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. వచ్చే నెలలో (సెప్టెంబర్ 2025‌) మూడు మోడ్రన్‌ కార్లు రోడ్డు పైకి రాబోతున్నాయి, అవి - మారుతి సుజుకి ఎస్కుడో, మారుతి సుజుకి ఇ విటారా & టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్. ఈ కార్లన్నీ తమ కస్టమర్లకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని, ఆశ్చర్యపరిచే ఫీచర్లను & బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్స్‌ను అందించబోతున్నాయి. 

సెప్టెంబర్‌లో లాంచ్‌ కాబోతున్న కొత్త కార్లు

Maruti Suzuki Escudo
మారుతి సుజుకి, సెప్టెంబర్ 2025లో, ఎస్కుడోను విడుదల చేయబోతోంది. ఈ SUV బ్రెజ్జా & గ్రాండ్ విటారా రేంజ్‌ మధ్యలో ఉంటుంది. అరెనా (ARENA) డీలర్‌షిప్‌ ద్వారా మారుతి సుజుకి ఎస్కుడో ను కొనవచ్చు. ఎస్కుడో ను గ్లోబల్-సి ఆర్కిటెక్చర్‌ ఆధారంగా నిర్మించారు. దీనిలో పెట్రోల్, CNG & హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఇంజిన్‌ ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. దీని హైబ్రిడ్ వేరియంట్‌లో టయోటా 1.5 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది, ఇది 116 bhp పవర్‌ను & 141 Nm టార్క్‌ను ఇస్తుంది. లెవల్-2 ADAS, డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్ & 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి మోడ్రన్‌ ఫీచర్లను ఎస్కుడో లో చూడవచ్చు. ఈ కారును తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 9.80 లక్షల నుంచి రూ. 18 లక్షల ‍‌(ఎక్స్‌-షోరూమ్‌) ధరతో లాంచ్‌ చేయవచ్చు.

Tata Punch Facelift
టాటా మోటార్స్ బ్రాండ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV పంచ్. దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా సెప్టెంబర్-అక్టోబర్ 2025 మధ్య విడుదల కానుంది. కొత్తగా వచ్చే పంచ్ డిజైన్ & ఇంటీరియర్ రెండింటిలోనూ ప్రధాన మార్పులు జరిగాయి. కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్‌ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్ & కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లోనూ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే & ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన భద్రతలు ఉంటాయి. దీని ఇంజిన్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుంది, ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది, ఇది 86 bhp పవర్ & 113 Nm టార్క్‌ను ఇస్తుంది. పంచ్ ఫేస్‌లిఫ్ట్ CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దీనిని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల ‍‌మధ్య (ఎక్స్‌-షోరూమ్‌ ధర) లాంచ్ చేయవచ్చు.

Maruti e Vitara
మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ SUV e Vitara కూడా సెప్టెంబర్ 2025లోనే విడుదల కానుంది. టయోటా సహకారంతో అభివృద్ధి చేసిన e-HEARTECT ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కారును రూపొందించారు. e Vitara లో రెండు బ్యాటరీ ఎంపికలు ఉంటాయి - 49kWh & 61kWh. ఈ కారు టాప్ వేరియంట్ దాదాపు 174 bhp శక్తిని & 500 km డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తుంది. Y- ఆకారపు DRLs, LED హెడ్‌ల్యాంప్‌లు, 18-19 అంగుళాల అల్లాయ్ వీల్స్ & కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఈ కారులో కనిపిస్తాయి. ఇంటీరియర్‌లో లెవల్-2 ADAS, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా & వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం అప్పీల్‌ ఉంటుంది. e Vitara  ధర రూ. 17 లక్షల నుంచి రూ. 22.50 లక్షల వరకు ఉంటుంది. ఇ-విటారా.. హ్యుందాయ్ క్రెటా EV, టాటా కర్వ్ EV & MG ZS EV లకు పోటీగా మార్కెట్‌లోకి వస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget