అన్వేషించండి

Nissan Magnite Vs Renault Kiger: డిజైన్, ఫీచర్లు, రేటులో ఏది బెస్ట్‌ - ఎవరు ఏది ఎంచుకోవాలి?

Best budget SUV 2025 in India: నిస్సాన్ మాగ్నైట్ & రెనాల్ట్ కిగర్ భారతదేశంలో పాపులర్‌ సబ్-4 మీటర్ SUVలు. ఏది మంచి డిజైన్ & ఫీచర్లను కలిగి ఉందో, ఎవరు ఏది కొనడం మంచిదో తెలుసుకుందాం.

Nissan Magnite vs Renault Kiger Comparison: పండుగ సీజన్‌లో కొత్త SUV కొనాలని ఆలోచిస్తున్న వాళ్లకు ఈ వార్త కచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, కాంపాక్ట్ SUVలను భారతీయులు ఎక్కువగా కొంటున్నారు, ఇది ట్రెండింగ్‌గా మారింది.  ఈ విభాగంలో రెండు వాహనాలు కస్టమర్ల ప్రశంసలు పొందుతున్నాయి, అవి - కొత్తగా లాంచ్‌ అయిన రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ & ఇప్పటికే జనం ఇష్టపడిన నిస్సాన్ మాగ్నైట్. ఈ రెండు SUVలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై (CMF-A +) తయారయ్యాయి. కానీ.. వాటి డిజైన్, స్పేస్‌ & లక్షణాలలో కొన్ని ప్రత్యేక తేడాలు ఉన్నాయి, ఇదే వాటిని విభిన్నంగా & ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఆంధ్ర, తెలంగాణలో ధర ఎంత?

  • హైదరాబాద్‌లో, రెనాల్ట్ కిగర్ ధర దాదాపు రూ. 6.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది & దాని టాప్ మోడల్ రేటు రూ. 11.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 
  • నిస్సాన్ మాగ్నైట్ ధర కిగర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో, నిస్సాన్ మాగ్నైట్ బేస్ మోడల్ రేటు రూ. 6.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది, టాప్ వేరియంట్ రూ. 11.92 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 
  • బేస్ మోడల్‌ను చూస్తే, మాగ్నైట్ మరింత సరసమైనది & టాప్ వేరియంట్‌లో కిగర్ కొంచెం చౌకగా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలో ఈ రెండూ బలమైన పోటీ కార్లు.

డిజైన్ ఎలా ఉంది?

  • రెనాల్ట్ కిగర్ డిజైన్ స్టైలిష్ & స్పోర్టీగా ఉంది. ఇందులో స్లీక్‌ లైన్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త 2D లోగోతో కూడిన గ్రిల్ & 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 
  • నిస్సాన్ మాగ్నైట్ మరింత ఆకర్షణీయమైన & శక్తిమంతమైన SUV లాంటి లుక్‌ అందిస్తుంది. విశాలమైన క్రోమ్ గ్రిల్, బూమరాంగ్ ఆకారపు DRLs & డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను ఇది కలిగి ఉంది. 
  • కిగర్, సిటీలో తిరగడానికి స్మార్ట్ & మోడ్రన్‌ అప్పీల్‌ ఇస్తుంది. 
  • మాగ్నైట్ డిజైన్ మరింత మస్క్యులర్‌గా & బోల్డ్‌గా ఉంటుంది.

ఇంటీరియర్ & ఫీచర్లలో తేడాలు

  • కిగర్ ఇంటీరియర్ డ్యూయల్-టోన్ వైట్-బ్లాక్ థీమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు & 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో ప్రీమియంగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 
  • నిస్సాన్ మాగ్నైట్‌లో టాన్-బ్లాక్ ఇంటీరియర్, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ & లెథరెట్ సీట్లతో వస్తుంది. దీని 360-డిగ్రీ కెమెరా వల్ల కిగర్ కంటే భిన్నంగా ఉంటుంది. 
  • ఈ రెండు SUVలు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నాయి. 
  • అయితే, కిగర్ బూట్ స్పేస్ పరంగా ముందుంది. దీనికి 405 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది, మాగ్నైట్ 336 లీటర్ల స్పేస్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌
ఈ రెండు కార్లు ఒకే CMF-A+ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యాయి & 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తాయి. ఈ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్ 72 PS శక్తిని & 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే టర్బో-పెట్రోల్ ఇంజిన్ 100 PS శక్తిని & 160 Nm టార్క్‌ను ఇస్తుంది. గేర్‌బాక్స్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, AMT (నేచురల్లీ ఆస్పిరేటెడ్‌) & CVT (టర్బో వేరియంట్‌లకు) ఉన్నాయి. 

ధర & బేస్ వేరియంట్‌ను పరిశీలిస్తే, నిస్సాన్ మాగ్నైట్ చవకగా ఉంటుంది. మీకు పెద్ద బూట్ స్పేస్ & ప్రీమియం ఇంటీరియర్ కావాలంటే, రెనాల్ట్ కిగర్ మెరుగ్గా ఉంటుంది. ఈ రెండు SUVలు లక్షణాలు & పనితీరులో దాదాపు సమానంగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
2026 Bajaj Pulsar 125 రివ్యూ: కేవలం కమ్యూటర్ బైక్ కాదు.. కొత్త ఇంజిన్, కొత్త ఫ్రేమ్, కొత్త టెక్నాలజీ!
బజాజ్ పల్సర్ 125 రివ్యూ.. ధరకు తగ్గ బైక్ మాత్రమే కాదు, పాత బండితో పోలిస్తే భారీ మార్పులు!
ఒకే కారు.. నాలుగు రకాల పవర్‌ట్రెయిన్‌లు! టాటా నెక్సాన్‌లో మీ అవసరానికి తగిన బెస్ట్ ఆప్షన్ ఏదంటే?
టాటా నెక్సాన్‌ పెట్రోల్‌ vs డీజిల్‌ vs సీఎన్‌జీ vs ఈవీ.. తేడాలేంటి, ఏది మీకు సరైనది?
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget