అన్వేషించండి

ఇది సచిన్ టెండూల్కర్ మోడిఫై చేసిన Lamborghini Urus S - సెకన్లలో 100 km స్పీడ్‌, తుపాకీ తూటాకు కూడా అందదు!

Sachin Tendulkar Lamborghini: సచిన్ టెండూల్కర్, ఇటీవల, తన మోడిఫైడ్ లంబోర్గిని ఉరుస్ ఎస్ కారులో కనిపించాడు. ఈ లగ్జరీ SUV 3.5 సెకన్లలోనే 100 km స్పీడ్‌ ఎత్తుకుంటుంది. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

Sachin Tendulkar Lamborghini Urus S: క్రికెట్ దేవుడు సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌, క్రికెట్‌ రికార్డుల మోతతోనే కాదు లగ్జరీ కార్లపై ఇష్టంతోనూ ప్రసిద్ధుడు. బ్యాటింగ్‌ చేసినంత ఈజీగా SUVతో దూసుకెళ్లగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే, టెండూల్కర్‌ ఒక ఎక్స్‌పర్ట్స్‌ బ్యాట్స్‌మనే కాదు, డ్రైవర్‌ కూడా. క్రికెట్‌ ఆటను వదిలిపెట్టినప్పటికీ, కార్లపై ఇష్టాన్ని వదల్లేదు సచిన్‌.  ఇటీవల, ఈ క్రికెట్‌ గాడ్‌. ముంబై వీధుల్లో తన మోడిఫైడ్ లంబోర్గిని ఉరుస్ S కారును నడుపుతూ కనిపించాడు. ఈ లగ్జరీ SUV ధర దాదాపు రూ. 4.2 కోట్లు. సచిన్‌, ఈ అల్ట్రా లగ్జరీ కారులో అనేక ఆఫ్టర్ మార్కెట్ మోడిఫికేషన్లు చేయించాడు, దీనిని మరింత శక్తిమంతంగా & స్పోర్టీగా తీర్చిదిద్దాడు.

బ్లూ ఎలియోస్ షేడ్‌లో పవర్‌ఫుల్ లుక్
సచిన్ Lamborghini Urus S Blue Eleos షేడ్‌లో ఉంది, ఇది ప్రీమియం లుక్‌ను పెంచింది. టెండూల్కర్‌ ఈ SUVని 2023లో కొన్నాడు, కానీ ఇప్పుడు దానిలో చాలా పెద్ద మార్పులు చేశాడు. గతంలో దీనికి స్టాండర్డ్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉండేవి, ఇప్పుడు వాటి స్థానంలో 22-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ బిగించాడు. కార్బన్ ఫైబర్ వింగ్, ఫ్రంట్ స్ప్లిటర్, సైడ్ స్కర్ట్‌లు & రియర్ డిఫ్యూజర్‌లను ఇందులో ఇన్‌స్టాల్ చేశారు, ఇవి దీనికి మరింత స్పోర్టీ & దూకుడైన శైలిని ఇచ్చాయి. ఈ భాగాలు మాన్సోరీ లేదా 1016 ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్నాడని భావిస్తున్నారు.

సూపర్‌కార్ లాంటి పనితీరు
లంబోర్గిని ఉరుస్ S కేవలం ఒక లగ్జరీ SUV మాత్రమే కాదు, పనితీరులో సూపర్‌కార్ కంటే తక్కువ కాదు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ కలిగి ఉంది, 666 PS పవర్‌ & 850 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ & ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ SUV కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోవడానికి ఇదే కారణం.

సచిన్‌కి కారు మోడిఫికేషన్ అంటే చాలా ఇష్టం
నిజానికి, సచిన్, తన కారును మోడిఫై చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, Porsche 911 Turbo S కి టెక్ఆర్ట్ బాడీకిట్ & శాటిన్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాడు. అతని BMW i8 కూడా ఒక ప్రత్యేకమైన ఆఫ్టర్ మార్కెట్ బాడీకిట్ చేయించి వార్తల్లో నిలిచాడు. సచిన్, తన వ్యక్తిత్వానికి అనుగుణంగా తన కార్లను కస్టమైజ్‌ చేయడానికి ఇష్టపడతాడు.

సచిన్‌ గరాజ్‌లో రేంజ్ రోవర్ SV
సచిన్ టెండూల్కర్ కార్ల కలెక్షన్ చాలా విలాసవంతంగా ఉంటుంది. గత సంవత్సరం, దాదాపు రూ. 5 కోట్ల విలువైన Range Rover SV Autobiography కూడా కొనుగోలు చేశాడు. ఈ కారు సెడోనా రెడ్ షేడ్‌లో ఉంది & దాని ఇంటీరియర్‌కు ప్రత్యేక రెడ్ అల్కాంటారా ఫినిషింగ్ ఇచ్చారు. సీట్లపై సచిన్ వ్యక్తిగత లోగో కూడా ఉంది, ఇది ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇందులో 24-వే అడ్జస్టబుల్ ఎగ్జిక్యూటివ్ సీట్లు, 13.1-అంగుళాల స్క్రీన్ & మెరిడియన్ 3D సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
బజాజ్ చేతక్ EVని ఇంటికి తెచ్చుకోవడానికి లోన్‌ ఫెసిలిటీ.. కనీస డౌన్‌పేమెంట్‌, EMI పూర్తి వివరాలు
Bajaj Chetak C2501 ఎలక్ట్రిక్ స్కూటర్‌.. నెలకు కేవలం రూ.1500 EMIతో మీ సొంతం!
చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!
ఈ చలికాలంలో కారు డ్రైవింగ్ సేఫ్‌గా సాగాలంటే.. ఈ 5 యాక్సెసరీస్ తప్పనిసరి!
గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!
బైక్‌ స్కీన్‌పైనే గూగుల్‌ మ్యాప్‌ కనిపిస్తుంది.. ధర కేవలం రూ.1 లక్షల నుంచి స్టార్ట్‌!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget