అన్వేషించండి

GST కటింగ్‌ తర్వాత Maruti Brezza మరింత చౌక, రూ. 65,000 వరకు మిగులు, కొత్త ధర ఇదే!

Maruti Brezza Features: మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది, ఇది గరిష్టంగా 101.6 bhp శక్తిని & 136.8 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది.

Maruti Brezza Price After GST Cut: ఈ దీపావళికి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, కార్లతో సహా అనేక వస్తువులపై GST తగ్గించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి, మన దేశంలోని చిన్న కార్లపై 28% GST & 1% సెస్, అంటే మొత్తం 29% పన్ను విధిస్తున్నారు. దీనిని 18% కు తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే, కస్టమర్లకు 10% ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది. మారుతి బ్రెజ్జాపై GST తగ్గిస్తే, ఈ కారు మునుపటి కంటే చాలా చౌకగా మారుతుంది.

మారుతి బ్రెజ్జాపై ఎంత మిగులుతుంది?
ఇప్పుడు అందుబాటులో ఉన్న మారుతి Vitara Brezza 2025 ఫేస్‌లిఫ్ట్ మోడల్... స్టైలిష్ లుక్‌, కొత్త ఫ్రంట్ గ్రిల్‌లో గ్లామర్, స్లీక్ LED ల్యాంప్స్, స్పోర్టీ డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్‌తో చాలా ఆధునికంగా కనిపిస్తోంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో (Maruti Brezza ex-showroom price, Hyderabad Vijayawada) రూ. 8,69,000. దీనిని 28% నుంచి 18% GST పరిధిలోకి తగ్గించిన తర్వాత, 1% సెస్‌తో కలుపుకుని (28% - 18% GST + 1% సెస్) 19% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ఒకేసారి 10% పన్ను తగ్గుతుంది, కస్టమర్‌ రూ. 64,900 వరకు ప్రయోజనం పొందుతారు.

మారుతి బ్రెజ్జాలో చాలా మోడ్రన్‌ ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ & 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు. ఈ SUVలో రియర్‌ AC వెంట్స్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫాస్ట్-ఛార్జింగ్ USB పోర్టులు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా భద్రత పరంగా కూడా చాలా బలమైన ఎంపిక. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ వంటి అధునిక లక్షణాలు ఉన్నాయి. ఇంకా.. EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ & ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా  ఎంజాయ్‌ చేయవచ్చు.

మారుతి బ్రెజ్జా ఇంజిన్ & పెర్ఫార్మెన్స్‌
మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 101.6 bhp పవర్‌ & 136.8 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. అదే ఇంజిన్ CNG వేరియంట్‌లో కూడా ఉపయోగించారు, కానీ దీని పవర్ అవుట్‌పుట్ 86.6 bhp & 121.5 Nm వరకు ఉంటుంది.

మారుతి బ్రెజ్జా SUV స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ & ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి సాంకేతికతలతో వచ్చింది, ఇవి దాని ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మారుతి బ్రెజ్జా, తన విభాగంలో, అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన SUVలలో ఒకటి. దీని పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ 19.89 నుంచి 20.15 kmpl మైలేజీని ఇస్తుంది, పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ 19.80 kmpl మైలేజీని ఇవ్వగలదు & CNG వెర్షన్ 25.51 km/kg వరకు మైలేజీని ఇవ్వగలదు. 

టాప్ హెడ్ లైన్స్

RE Hunter 350 ఫైనాన్స్‌ ఆప్షన్లు - తెలుగు రాష్ట్రాల్లో హంటర్ 350 ధర, బెస్ట్‌ EMI ప్లాన్స్ ఇవే!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 350 EMI ఆప్షన్లు - తక్కువ EMI కోసం ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి?
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
సుజుకి e-యాక్సెస్ రోడ్ టెస్ట్: రేంజ్, స్పీడ్, స్టోరేజ్‌ వంటివన్నీ రూ.1.92 లక్షల ధరకు తగ్గట్లుగానే ఉన్నాయా?
సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.92 లక్షల పెట్టి కొనడం సరైన నిర్ణయమేనా?
ఫాసినో 125 కొనబోతున్నారా? రూ.78,000-రూ.99,000 రేంజ్‌లో మారే ఫీచర్లు ఏంటో తెలుసా?
యమహా ఫాసినో 125లో 3 వేరియంట్లు - కేవలం రూ.21,000 వ్యత్యాసంలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Brydon Carse Arrest: నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
నైట్‌క్లబ్‌లో రచ్చతో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండ‌ర్ అరెస్ట్.. చేతులకు బేడీలతో దొరికిన ప్లేయర్
Embed widget