Maruti Grand Vitara CNG ని కార్ లోన్‌పై కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ సరిపోతుంది? EMI ఎంతవుతుంది?
Grand Vitara EMI calculator: మారుతి గ్రాండ్ విటారా CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 13 లక్షల 48 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15 లక్షల 62 వేల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. EMI వివరాలు తెలుసుకుందాం.

Maruti Grand Vitara CNG Price, Down Payment, EMI Calculator: మారుతి సుజుకి, ఇటీవలే తన ప్రసిద్ధ 'గ్రాండ్ విటారా'లో CNG వెర్షన్‌లను తిరిగి విడుదల చేసింది. CNG వెర్షన్‌లో అద్భుతమైన మైలేజ్ & భద్రత రేటింగ్స్ ఉన్నాయి. ఈ కారు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. షార్ప్ హెడ్‌ల్యాంప్స్, అగ్రెసివ్ గ్రిల్ డిజైన్ ఈ SUVకి ప్రీమియం టచ్ ఇచ్చాయి. అలాయ్ వీల్స్, బాడీ లైన్స్ స్పోర్టీ ఫీల్‌ను కలిగిస్తూ రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. మోడర్న్ SUV డిజైన్‌తో పాటు డబ్బు ఆదా పరంగానూ పనికొచ్చే CNG వేరియంట్ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
మారుతి గ్రాండ్ విటారా CNG కారును మీరు ఓన్ చేసుకోవాలంటే, ఒకేసారి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారును ఫైనాన్స్‌లో కూడా తీసుకోవచ్చు.
మారుతి గ్రాండ్ విటారా CNG ధర ఎంత?
విజయవాడలో, మారుతి గ్రాండ్ విటారా CNG ఎక్స్-షోరూమ్ ధర (Maruti Grand Vitara ex-showroom price, Vijayawada) రూ. 13,48 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.62 లక్షల వరకు పలుకుతోంది. దాని బేస్ వేరియంట్ డెల్టా CNG వేరియంట్ ఆన్-రోడ్ ధర విజయవాడలో (Maruti Grand Vitara on-road price, Vijayawada) దాదాపు రూ. 16.62 లక్షలు. ఇందులో RTO ఛార్జీలు దాదాపు రూ. 2.37 లక్షలు & బీమా మొత్తం దాదాపు రూ. 63,000, ఇతర ఖర్చులు కలిసి ఉన్నాయి.
హైదరాబాద్‌లో కూడా మారుతి గ్రాండ్ విటారా CNG ఎక్స్-షోరూమ్ ధర ( Maruti Grand Vitaraex-showroom price, Hyderabad) రూ. 13,48 లక్షలు. ఆన్-రోడ్ ధర (Maruti Grand Vitara on-road price, Hyderabad) దాదాపు రూ. 16.63 లక్షలు.
ఈ కారును ఎంత డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయొచ్చు?
హైదరాబాద్‌లో, మారుతి గ్రాండ్ విటారా CNG కోసం మీరు కనీసం 3.15 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలిన రూ. 13.48 లక్షలకు కార్ లోన్ తీసుకోవాలి. మీరు ఈ మొత్తాన్ని 9 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే...
7 సంవత్సరాల పాటు నెలకు రూ. 21,684 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే నెలనెలా రూ. 24,294 EMI చెల్లించాలి.
5 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే ప్రతి నెలా రూ. 27,977 EMI చెల్లించాలి.
4 సంవత్సరాల రుణ కాలపరిమితి కోసం నెలకు రూ. 33,539 EMI చెల్లించాలి.
మారుతి గ్రాండ్ విటారాలో ప్రీమియం ఫీచర్లు
మారుతి గ్రాండ్ విటారా పెర్ఫార్మెన్స్‌లోనే కాదు, ఫీచర్ల పరంగానూ ప్రీమియం అనుభవాన్ని ఇస్తుంది. సాధారణంగా లగ్జరీ సెగ్మెంట్ వాహనాల్లో మాత్రమే కనిపించే చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను మారుతి గ్రాండ్ విటారా కోసం కంపెనీ అందించింది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది, ఇది క్యాబిన్‌ను ఓపెన్‌గా & ఆకర్షణీయంగా చేస్తుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది. డ్రైవర్ సౌలభ్యం కోసం 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అందించారు. మారుతి గ్రాండ్ విటారా CNG 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది, దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు. దీని క్లెయిమ్డ్ మైలేజ్ కిలోగ్రాముకు దాదాపు 26.6 కిలోమీటర్లు.



















