అన్వేషించండి

Affordable 7 seater SUVs: ఈ 7-సీటర్ కార్లు 5-సీటర్ ధరకే వస్తాయి - పెద్ద ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో జర్నీ చేయొచ్చు!

Low cost 7 seater cars India: మీ పెద్ద కుటుంబంతో కలిసి శుభకార్యాలు, విహార యాత్రలకు హాజరవ్వాలంటే, ఆర్థికంగా & మైలేజీ పరంగా పనికొచ్చే 7-సీటర్ కార్లు ఈ కథనంలో.

Affordable 7 seater cars in low budget 2025: మీ ఇంట్లో ఎక్కువ మంది ఉండి, మీకు పెద్ద కారు కావాలంటే, 7-సీటర్ MPV అవసరం అవుతుంది. అయితే, 7-సీటర్‌ కారు కొనేంత స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. 7-సీటర్‌ కారుపై ఆశ చంపుకోలేక, ఎక్కువ ధర పెట్టలేక కారు కొనడాన్ని వాయిదా వేస్తూ ఉండవచ్చు. ఇకపై వాయిదాల అవసరం రాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా బడ్జెట్‌ MPVలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ ధరలోనే ఎక్కువ స్పేస్‌, మెరుగైన మైలేజ్‌ & ఆధునిక ఫీచర్లను అందిస్తాయి. ఈ విభాగంలో, పాపులర్‌ అయిన 3 అత్యంత తక్కువ ధర 7-సీటర్ MPVల (రెనాల్ట్ ట్రైబర్, మారుతి ఎర్టిగా & టయోటా రూమియన్) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్
Renault Triber Facelift రీసెంట్‌గా లాంచ్‌ అయింది, ఇది మన దేశంలోనే అత్యంత తక్కువ ధర 7-సీట్ల MPV. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 6.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, వేరియంట్‌ను బట్టి రూ. 9.17 లక్షల వరకు ఉంటుంది. దీనికి 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది 71 bhp పవర్ & 96 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, ట్రైబర్ మైలేజ్ లీటరుకు 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. 40-లీటర్ ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపితే దాదాపు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని చెబుతున్నారు. 

రెనాల్ట్ ట్రైబర్‌ను కొన్ని డీలర్‌షిప్‌లలో CNG కిట్‌తో కొనుగోలు చేసే ఆప్షన్‌ కూడా ఉంది, ఇది ఇంకా ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది. ఈ MPVలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, రియర్‌ పార్కింగ్ సెన్సార్ & కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా 
Maruti Suzuki Ertiga భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే 7-సీటర్ MPV. తెలుగు రాష్ట్రాల్లో దీని ధర రూ. 9.11 లక్షల నుంచి రూ. 13.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్‌ 103 bhp పవర్ & 138 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది & CNG వెర్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ డేటా ప్రకారం, ఎర్టిగా పెట్రోల్ మోడల్ లీటరుకు 20.51 కి.మీ. మైలేజీని ఇస్తుంది, CNG వెర్షన్ కిలోగ్రాముకు 26.08 కి.మీ. మైలేజీని ఇవ్వగలదు. ఈ MPVలో 4 ఎయిర్‌ బ్యాగులు, ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మరికొన్ని ఆధునిక లక్షణాలు ఉన్నాయి. 

టయోటా రూమియన్
Toyota Rumion అనేది మారుతి ఎర్టిగాకు రీ-బ్యాడ్జ్‌డ్‌ వెర్షన్. ఈ కారు ఎర్టిగా డిజైన్, ప్లాట్‌ఫామ్ & ఇంటీరియర్‌తోనే రూపొందింది, కంపెనీ లోగో మాత్రం టయోటా అని ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షల వరకు ఉంటుంది, ఇది ఎర్టిగా కంటే కొంచెం ఎక్కువ. రూమియన్ 1.5-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 102 bhp శక్తిని & 137 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొనుగోలు చేయవచ్చు & CNG వెర్షన్‌లోనూ కొనే ఛాయిస్‌ ఉంది.

రూమియన్‌ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది & CNG వెర్షన్ కిలోగ్రాముకు 26.08 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా మాదిరిగానే ఇంజన్‌ & ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ టయోటా బ్యాడ్జ్ దీనికి ప్రీమియం టచ్ ఇస్తుంది. టయోటా బలమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనిని ప్లస్‌ పాయింట్‌.

టాప్ హెడ్ లైన్స్

కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు
ఈ EV డిమాండ్‌ మామూలుగా లేదుగా! ఒక్కరోజులో 150.. ఇది నేషనల్‌ రికార్డ్‌
KTM 390 Duke వర్సెస్‌ RE Guerrilla 450 Apex.. ధర, పవర్‌, ఫీచర్లలో ఏది బెస్ట్‌?
KTM 390 Duke వర్సెస్‌ Guerrilla 450.. పెద్ద ఇంజిన్‌ ఉన్నా తక్కువ ధరలో RE బైక్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!
2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌.. కొత్త ఫీచర్లతో అదరగొడుతున్న సెడాన్! బుకింగ్స్‌ ప్రారంభం
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష చెల్లించి Renault Kwid కొంటే, ప్రతినెలా EMI ఎంత కట్టాలి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget