అన్వేషించండి

Maruti Suzuki: లిథియం-అయాన్ సెల్ ఉత్పత్తి ప్రారంభించిన మారుతి - ఇకపై వచ్చే హైబ్రిడ్‌ కార్లన్నీ బడ్జెట్-ఫ్రెండ్లీనే!

Maruti Suzuki lithium-ion cell: మారుతి సుజుకి, లిథియం-అయాన్ సెల్ & ఎలక్ట్రోడ్ ఉత్పత్తి ద్వారా బడ్జెట్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ కార్లను లాంచ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Maruti Suzuki Hybrid Cars: మారుతి సుజుకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) మాత్రమే కాకుండా హైబ్రిడ్ కార్లపై కూడా దృష్టి పెట్టింది. ఇంధన సామర్థ్యం & బడ్జెట్‌కు అతి పెద్ద ప్రాధాన్యం ఇచ్చే భారత్‌ వంటి మార్కెట్‌లో, చీప్‌ అండ్‌ బెస్ట్‌ హైబ్రిడ్ కార్లు గేమ్ ఛేంజర్‌గా మారతాయని కంపెనీ విశ్వసిస్తోంది. ఇప్పటివరకు గ్రాండ్ విటారా & ఇన్విక్టో వంటి ప్రీమియం హైబ్రిడ్ కార్లకే పరిమితమైన ఈ టెక్నాలజీని, రాబోయే కాలంలో, ఫ్రాంక్స్‌ వంటి కాంపాక్ట్ & బడ్జెట్ ఫ్రెండ్లీ SUVలలో కూడా చూడవచ్చు. దీని అర్ధం.. భవిష్యత్‌లో, మారుతి సుజుకీ  హైబ్రిడ్ కార్లు కూడా కామన్‌ మ్యాన్‌ బడ్జెట్‌ దాటవు.         

లిథియం-అయాన్ కణాలు & ఎలక్ట్రోడ్ల స్థానిక ఉత్పత్తి
ప్రస్తుతం, హైబ్రిడ్ కార్ల ఖరీదు ఎక్కువ కావడానికి అతి పెద్ద కారణం వాటి విడిభాగాలు & బ్యాటరీ ప్యాక్‌లు. మారుతి సుజుకి, స్థానికీకరణ ద్వారా ఈ ధరను గణనీయంగా తగ్గించవచ్చని నమ్ముతోంది. అంటే, ఆ టెక్నాలజీని ఇండియాలోనే తయారు చేసి, ఆకాశంలోని రేట్లను భూమ్మీదకు దించాలని ప్రయత్నిస్తోంది. భారతదేశంలో లిథియం-అయాన్ సెల్ & ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ ప్రకటించడానికి ఇదే కారణం. లిథియం-అయాన్ సెల్ & ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభించిన మారుతి, తొలుత వీటిని గ్రాండ్ విటారా హైబ్రిడ్ కోసం ఉపయోగిస్తుంది. తర్వాత, రాబోయే కొత్త SUVలలోనూ వాటిని వాడుతుంది. అంటే, కామన్‌ మ్యాన్‌ కోరుకునే రేటులోనే మంచి హైబ్రిడ్ కార్లను ప్రవేశపెట్టే అవకాశం ఇప్పుడు మారుతి చేతిలో ఉంది.       

బడ్జెట్‌-ఫ్రెండ్లీ హైబ్రిడ్ కార్ల భవిష్యత్తు
భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీని ఖరీదైన కార్లకు మాత్రమే పరిమితం చేయబోమని మారుతి సుజుకి ఇప్పటికే చెప్పింది. ఈ ప్రకటన ప్రకారం, ఇండియన్‌ కస్టమర్లు త్వరలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో బడ్జెట్‌-ఫ్రెండ్లీ SUVలను చూడగలరు. సెప్టెంబర్ 3, 2025న విడుదల కానున్న ఫోర్డ్స్ & కొత్త మారుతి SUV దీనికి ప్రారంభ ఉదాహరణలు కావచ్చు. స్ట్రాంగ్‌ హైబ్రిడ్ కార్లు మైల్డ్ హైబ్రిడ్‌ మోడళ్ల కంటే భిన్నంగా ఉంటాయి. వాటికి EV మోడ్ కూడా ఉంటుంది. వాటి మైలేజ్ డీజిల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా మారుతి దీనిని పరిగణించడానికి ఇదే కారణం.       

పెట్టుబడులు & భవిష్యత్తు ప్రణాళికలు
మారుతి సుజుకి, 2031 నాటికి భారతదేశంలో రూ. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ పెట్టుబడి బ్యాటరీలు, సెల్స్, హైబ్రిడ్ టెక్నాలజీ & ఎలక్ట్రిక్ వాహనాల స్థానికీకరణ కోసం ఉపయోగిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో, ఈ కంపెనీ, ప్రీమియం కార్లతో పాటు బడ్జెట్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ కార్లను కూడా ఇండియన్‌ రోడ్లపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందనడానికి ఇది ప్రత్యక్ష సూచన.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget