అన్వేషించండి

టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ TVS Orbiter లాంచ్ - డిజైన్‌, స్పెక్స్‌ అదిరాయి - రేటు రూ.లక్ష కూడా లేదు!

TVS new electric scooter Orbiter: టీవీఎస్, కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్‌ను ఆగస్టు 28న విడుదల చేసింది. కంపెనీ దీనిలో అనేక అధునాతన ఫీచర్లను అందించింది.

TVS Orbiter Price, Range And Features In Telugu: టీవీఎస్ మోటార్‌, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్‌ను గురువారం నాడు (ఆగస్టు 28, 2025) లాంచ్‌ (TVS launch Orbiter electric scooter) చేసింది. ఈ స్కూటర్‌ లుక్‌ చాలా బాగుంది, దీని డిజైన్‌ అక్కినేని కీలుగుర్రాన్ని తలపిస్తోంది. టీవీఎస్‌ కంపెనీ, కొత్త ఆర్బిటర్‌లో అనేక ఆధునిక ఫీచర్లను అందించింది, మంచి రేంజ్‌ & బలమైన పనితీరును ప్రకటించింది. ఈ ఈ-స్కూటర్ ధర రూ. 99,900, ఇది కామన్‌ మ్యాన్‌ కొనుగోలు చేయగలిగిన రేంజ్‌లోనే ఉంది.

ఎంట్రీ లెవల్ ఈ-స్కూటర్
కంపెనీ ఇంకా పూర్తి స్థాయిలో అధికారిక సమాచారాన్ని పంచుకోలేదు, కానీ ఈ మోడల్ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుందని భావిస్తున్నారు. అంటే.. ఫీచర్లు & ధర పరంగా ఇది TVS iQube కంటే కాస్త తక్కువ రేంజ్‌లో ఉంటుంది.  మొదటిసారి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వాళ్లకు తక్కువ ధరలో & ప్రాక్టికల్ ఆప్షన్‌గా ఇది ఉంటుంది.

కొత్త TVS ఆర్బిటర్, అటు యువతకు & ఇటు ఫ్యామిలీలకు మంచి అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఉంటుందని కంపెనీ విడుదల చేసిన ఇమేజ్‌లను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. స్కూటర్‌ మొత్తం స్టైలింగ్ చాలా బాగుంది. పెద్ద LED లైట్లు, మంచి సైజ్‌లో విండ్‌స్క్రీన్, పెద్ద & కొంచెం వంపు తిరిగిన బాడీ ప్యానెల్స్‌ వంటి ఆధునిక డిజైనింగ్‌ కనిపిస్తోంది.

డిజైన్ iQube లాగానే ఉంది
డిజైన్ ప్రకారం, కొత్త స్కూటర్‌లోని చాలా ఎమిమెంట్స్‌ TVS iQube నుండి తీసుకున్ారు. లుక్ సన్నగా & సొగసైనదిగా ఉంది. ముందు భాగంలోని LED హెడ్‌ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో (DRLs)తో అనుసంధానమై ఉంటుంది. దీని లుక్ ఫ్యామిలీ స్కూటర్ లాగా ఉంటుంది కానీ iQube కంటే మరింత స్టైలిష్ & ఏరోడైనమిక్ డిజైన్‌తో వచ్చింది, యంగ్‌స్టర్స్‌ను ఆకర్షిస్తుంది.

ఈ స్కూటర్ బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌కు సపోర్ట్‌ చేసే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ ఫంక్షన్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వంటి కొన్ని ఫ్యాన్సీ ఫీచర్లను కూడా టీవీఎస్ ఈ స్కూటర్‌లో అమర్చింది. USB ఛార్జింగ్, OTA అప్‌డేట్స్‌ & స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ప్రామాణికంగా వస్తాయి.

రైడింగ్ రేంజ్‌
సింగిల్‌ ఛార్జ్‌లో ఈ స్కూటర్‌ 158 km రైడింగ్ రేంజ్‌ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇది, ఎక్కువ బ్యాటరీ వేరియంట్‌లు కలిగి ఉన్న iQube వలె కాకుండా, 3.1kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం ఛార్జింగ్ సమయం & ఫాస్ట్‌ ఛార్జింగ్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 

టీవీఎస్ ఆర్బిటర్ కోసం బుకింగ్స్‌ ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ బండిని ఆరు కలర్‌ స్కీమ్‌లలో విక్రయిస్తారు - నియాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం & మార్టిన్ కాపర్. 

మార్కెట్‌లో, ఇది Ather Rizta తో పోటీ పడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget