అన్వేషించండి

Renault Kiger Facelift vs Old Model: రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ - పాత మోడల్ కంటే బాగుందా, కొత్తగా వచ్చిన ఫీచర్లేంటి?

Renault Kiger Facelift 2025: కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ గతంలో కంటే స్మార్ట్‌గా మారింది. పాత మోడల్ & కొత్త మోడల్ డిజైన్, ఇంటీరియర్ & ఫీచర్లలో గట్టి మార్పులు జరిగాయి.

Renault Kiger Facelift Features Comparison: కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్‌ను చూస్తే, మన దృష్టిని ఆకర్షించే మొదటి విషయం దాని ఫ్రంట్‌ డిజైన్. ఇప్పుడు, ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌కు కొత్త ఫ్రంట్ బంపర్, కంపెనీ కొత్త లోగోతో నయా గ్రిల్ & సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్‌లు కారు దిగువ భాగంలో ఉన్నాయి, పైభాగంలో సన్నని DRLs (డేటైమ్ రన్నింగ్ లైట్లు) & మధ్యలో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. గ్రిల్ పైభాగంలో DRLతో కూడిన బ్లాక్‌ కలర్‌ ట్రిమ్ ఉంది, ఇది మునుపటి కంటే మోడ్రన్‌గా కనిపిస్తోంది.

సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంది?
పక్క నుండి చూస్తే, కిగర్ ఫేస్‌లిఫ్ట్ మరింత స్పోర్టీగా & ప్రీమియంగా కనిపిస్తుంది. దీనికి డ్యూయల్-టోన్ డిజైన్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ & కొత్త 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్పోర్టీ టచ్ కోసం ఎరుపు బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ డోర్ హ్యాండిల్స్ & మిర్రర్లు ఇచ్చారు. ఇవి ఈ కారుకు యంగ్ & డైనమిక్ లుక్స్‌ ఆపాదించాయి.

రియర్‌ డిజైన్‌లో మార్పులు
నిజానికి, రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్‌ వెనుక భాగంలో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, ఇప్పుడు దీనికి C-ఆకారపు LED టెయిల్-ల్యాంప్‌తో స్మోక్డ్ ఫినిషింగ్ వచ్చింది. దీనితో పాటు, కొత్త స్కిడ్ ప్లేట్ & కొత్త కిగర్ బ్యాడ్జ్ జోడించారు, ఇది ఈ కారుకు స్టైలిష్‌గా కనిపిస్తోంది.

కొత్త ఫీచర్లు మునుపటి కంటే మరింత ఆధునికం
కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ గతంలో కంటే మరింత ప్రీమియం & హైటెక్‌గా మారింది. దీని అతి పెద్ద మార్పు కలర్ థీమ్‌లో కనిపిస్తుంది, గతంలో బ్లాక్ థీమ్ మాత్రమే ఇచ్చారు, ఇప్పుడు దానిలో తెల్లటి డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఉపయోగించారు. ఎయిర్ కండిషనింగ్ కోసం రోటరీ కంట్రోల్స్, పైభాగంలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్ & అప్‌డేటెడ్‌ రెనాల్ట్ లోగో ఉన్నాయి. సీట్లపై సెమీ-లెదరింగ్‌ అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటి కారణంగా క్యాబిన్ మునుపటి కంటే ఎక్కువ ఖరీదైన & సౌకర్యవంతమైన కారు అనే ఫీల్‌ వస్తుంది.

కొత్త రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ గతంలో కంటే స్మార్ట్‌ & సేఫ్టీ ఫీచర్లు యాడ్‌ అయ్యాయి. 360-డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, 6-స్పీకర్ అర్కామిస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్ & స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ అప్‌డేట్స్‌తో, ఈ SUV, తన విభాగంలో మరింత శక్తిమంతమైన, అధునాతనమైన & సురక్షితమైన కారుగా మారింది.

పవర్‌ట్రెయిన్
కొత్త కిగర్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఇంజిన్ ఎంపికలు మారలేదు, పాత మోడల్ మాదిరిగానే ఉంచారు. ఈ కారు AMT & మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్‌తో, 1.0L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega PTM: ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
ఇష్టపడి చదివితే విజయం మీదే - మెగా పీటీఎంలో విద్యార్థులకు చంద్రబాబు సలహా
Hydra Ranganath: చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
చెరువుల కబ్జాకు సహకరించిన అధికారులకు హైడ్రా దెబ్బ -రంగనాథ్ ఫిర్యాదులతోనే ఏసీబీ దాడులు
IndiGo Flights Cancelled: ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
ఇండిగో విమానం రద్దుతో పెళ్లి జంట లేకుండానే రిసెప్షన్, ఆన్‌లైన్‌లో పాల్గొన్న న్యూ కపుల్!
IndiGo Flight Cancellation: ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనలలో సడలింపు!
ఇండిగో సంక్షోభంతో డిజిసిఎ అలర్ట్‌! సిబ్బంది సర్దుబాటులో పెద్ద మినహాయింపు , నైట్-డ్యూటీ నిబంధనల‌లో సడలింపు!
Akhanda 2 Postponed : డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
డబ్బుల గోల ఎందుకు? - 'అఖండ 2' వాయిదాపై ప్రొడ్యూసర్ సురేష్ బాబు రియాక్షన్
India vs SA 3rd ODI : విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
విశాఖలో భారత జట్టు గణాంకాలు ఎలా ఉన్నాయి? ఎవరి పేరున ఎక్కువ రికార్డులు ఉన్నాయి?
Balakrishna Nandamuri: బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్‌ ఫీలింగ్ ఏమిటి?
బాలయ్యకు జరిగింది అవమానమా? అన్యాయమా? 'అఖండ 2' వాయిదాపై ఫ్యాన్స్‌ ఫీలింగ్ ఏమిటి?
Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
Embed widget