New EV Cars: త్వరలో రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేయనున్న టాటా, మహీంద్రా - అవేంటంటే?
Upcoming EV Cars: టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ కార్లు త్వరలో లాంచ్ కానున్నాయి.
Upcoming EV Cars in India: స్వదేశీ వాహన తయారీదారులు టాటా మోటార్స్, మహీంద్రా రాబోయే కొద్ది సంవత్సరాలలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రూపొందించి మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వారి ప్రస్తుత ప్రణాళిక గురించి చెప్పాలంటే టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. 2024 జూన్ నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీని లాంచ్ చేయనుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు సంబంధించిన కొన్ని కీలక వివరాల గురించి తెలుసుకుందాం.
టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)
పంచ్.ఈవీని డెవలప్ చేసిన యాక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై టాటా కర్వ్ ఈవీని కూడా తయారు చేయనున్నారు. టాటా తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్ వాహనాల సైజులు, డ్రైవ్‌ట్రెయిన్ సెటప్‌లకు (ఎఫ్‌డబ్ల్యూడీ, ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ) మద్దతు ఇస్తుంది. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కర్వ్ ఈవీ సుమారు 500 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుందని ఆశించవచ్చు. అయితే దీని ఇంజిన్ స్పెసిఫికేషన్ల వివరాలు ఇంకా వెల్లడించలేదు.
టాటా కర్వ్ ఇప్పటికే దాని ఫైనల్ ప్రొడక్షన్ మోడల్‌లో కనిపించింది. ఇది దాని కాన్సెప్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటర్నల్‌గా ఫ్రీ స్టాండింగ్ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లను పొందే అవకాశం ఉంది. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పని చేస్తుంది. టాటా కార్ల కొత్త మోడల్‌ల మాదిరిగానే ఇది బ్యాక్‌లిట్ లోగోతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, డ్రైవ్ మోడ్‌ల కోసం రోటరీ నాబ్‌ను కలిగి ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ (Mahindra XUV300 EV)
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ నేరుగా టాటా నెక్సాన్ ఈవీతో పోటీపడుతుంది. ఇది 2024 జూన్ నాటికి విడుదల కానుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ300 ఈవీ లాగా కాకుండా ఇది నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది. దీని డిజైన్ త్వరలో రానున్న మహీంద్రా బీఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి దగ్గరగా ఉండనుంది. అంటే ఇది దాని ఐసీఈ వెర్షన్ నుంచి కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. క్యాబిన్ లోపల కూడా కొన్ని మార్పులు చేయనున్నారు.
ఎక్స్‌యూవీ300 ఈవీలో అప్‌డేట్ చేసిన డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఈవీ పవర్‌ట్రెయిన్ సెటప్‌లో 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ధర గురించి చెప్పాలంటే మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ దాని పాత మోడల్ కంటే చవకగా ఉండవచ్చు. దీని బేస్ వెర్షన్ ధర సుమారు రూ. 15 లక్షలు, టాప్ ఎండ్ ట్రిమ్ ధర రూ. 17 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.
మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న న్యూయార్క్ మోటార్ షోలో కియా ఈవీ9 కారుకు 2024 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. కియా లాంచ్ చేసిన ఈ ఈవీ వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. 2023 మార్చిలో ఈవీ9 గ్లోబల్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది.