Skoda Kylaq vs Tata Nexon: రేటు, సేఫ్టీ, సౌకర్యాల్లో ఏది బెస్ట్? - Skoda Kylaq లేదా Tata Nexon?
Tata Nexon vs Skoda Kylaq: టాటా నెక్సన్, మార్కెట్లో ఇప్పటికే బాగా సెట్ అయింది & ప్రజాదరణ పొందింది. స్కోడా కంపెనీ, కైలాక్‌ను 2024 నవంబర్‌లో లాంచ్ చేసింది.

Skoda Kylaq vs Tata Nexon Comparison: భారత కాంపాక్ట్ SUV మార్కెట్‌లో స్కోడా కొత్త మోడల్ కైలాక్ - టాటా నెక్సన్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి బలమైన మోడళ్లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, స్కోడా కైలాక్ - టాటా నెక్సన్‌ను కస్టమర్లు పోల్చి చూసుకుంటున్నారు.
ధర & వేరియంట్లు
స్కోడా కైలాక్ ధర రూ. 8.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్‌కు ఈ రేటు రూ. 13.99 లక్షల వరకు వెళ్తుంది.
టాటా నెక్సన్ ధర సుమారు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది.
నెక్సన్ కాస్త చవకగా మొదలవుతున్నప్పటికీ కైలాక్ కూడా మంచి పోటీ స్థాయిలోనే ఉంది.
ఇంజిన్ & మైలేజ్
కైలాక్‌లో 1.0 లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (115hp, 178Nm) ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, మాన్యువల్‌లో 19.68 kmpl, ఆటోలో 19.05 kmpl ఇస్తుంది.
టాటా నెక్సన్ (1.2 లీటర్ పెట్రోల్) మైలేజ్ 17 నుంచి 24 kmpl మధ్య వస్తుంది.
మైలేజ్ విషయంలో రెండు కార్లు సమానంగానే ఉన్నాయి.
బూట్ స్పేస్ & డైమెన్షన్స్
కైలాక్ బూట్ స్పేస్ 446 లీటర్లు, అంటే లగేజ్ పెట్టుకోవడానికి మంచి స్థలం ఉంటుంది.
నెక్సన్ బూట్ స్పేస్ 382 లీటర్లు.
బూట్ స్పేస్‌లో కైలాక్ ముందంజలో ఉంది.
సేఫ్టీ & NCAP రేటింగ్
స్కోడా కైలాక్ భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ప్రతి వేరియంట్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్,
ABS+EBD, రియర్ పార్కింగ్ సెన్సర్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.
టాటా నెక్సన్ కూడా గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించిన తొలి SUV. ఇప్పుడు అప్‌డేట్ వెర్షన్‌లో అడల్ట్, చైల్డ్ రెండు
కేటగిరీల్లోనూ 5-స్టార్స్ పొందింది.
సేఫ్టీలో రెండు కార్లు అగ్రస్థానంలో ఉన్నాయి.
డ్రైవింగ్ అనుభవం & కంఫర్ట్
కైలాక్ చాసిస్, సస్పెన్షన్ కఠినంగా ఉండటం వల్ల డ్రైవింగ్‌లో ఫన్ ఎక్కువగా ఉంటుంది. కార్నర్స్‌లో స్టేబుల్‌గా ఉంటుంది.
నెక్సన్ మాత్రం మరింత కంఫర్ట్ వైపు మొగ్గు చూపుతుంది. సిటీ డ్రైవింగ్ కోసం ఇది చక్కగా సెట్ అవుతుంది.
డ్రైవింగ్ థ్రిల్ కావాలంటే కైలాక్, ఫ్యామిలీ కంఫర్ట్ కావాలంటే నెక్సన్.
| స్కోడా కైలాక్ | టాటా నెక్సన్ | |
| ప్రారంభ ధర | ₹8.25 లక్షలు | ₹8.00 లక్షలు |
| ఇంజిన్ | 1.0L టర్బో పెట్రోల్ | 1.2L పెట్రోల్ |
| మైలేజ్ | 19 kmpl | 17-24 kmpl |
| బూట్ స్పేస్ | 446 లీటర్లు | 382 లీటర్లు |
| సేఫ్టీ రేటింగ్ | 5 స్టార్ (Bharat NCAP) | 5 స్టార్ (Global NCAP) |
| డ్రైవింగ్ ఫీల్ | స్పోర్టీ, ఫన్ | స్మూత్, కంఫర్ట్ |
తుది మాట
స్కోడా కైలాక్ - బలమైన సేఫ్టీ, యూరోపియన్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, పెద్ద బూట్ స్పేస్ కావాలనుకునే వారికి ఇది సరైన SUV.
టాటా నెక్సన్ - బడ్జెట్‌లో కాస్త చవకగా ఉండి, ఫ్యామిలీ కంఫర్ట్, మంచి మైలేజ్, మార్కెట్ ప్రెజెన్స్ కావాలనుకునే వారికి సరైన ఎంపిక.





















