అన్వేషించండి

Best Selling Tata Car: రూ.5 లక్షలకే టాటా కారు - హాట్‌కేకులా అమ్ముడుబోతోంది, ఫుల్‌ట్యాంక్ తో 900 km జర్నీ

Tata Tiago Sales: టాటా టియాగో పెట్రోల్ & CNG ఆప్షన్స్‌లో మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. ఈ కారులో 1199cc 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది.

Tata Tiago Price, Mileage And Features In Telugu: టాటా మోటార్స్, ఇటీవల, జులై 2025 అమ్మకాల నివేదికను విడుదల చేసింది, ఓవరాల్స్‌ సేల్స్‌లో మంచి పొజిషన్‌లో నిలిచింది. వాస్తవానికి మన దేశంలో టాటా బ్రాండ్‌ కార్లకు మంచి డిమాండ్ ఉంది. బలమైన బాడీ, ప్రయాణీకులకు భద్రత, మేలైన మైలేజీ దీనికి కారణం. టాటా బ్రాండ్‌లో, CNG ఇంజిన్‌తో అత్యధికంగా అమ్ముడైన మూడో కారు టాటా టియాగో. గత నెలలో 5,575 మంది కొత్త కస్టమర్లు టియాగోను కొనుగోలు చేశారు. దేశీయ మార్కెట్లో, ఇది Maruti Wagon R & Hyundai Grand i10 Nios తో పోటీ పడుతుంది.

టాటా టియాగో లుక్స్‌ చాలా ఆకర్షణీయంగా ఉండి, స్పోర్టీ & ప్రీమియం ఫీలింగ్‌ ఇస్తాయి. ముందు భాగంలో షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ & సిగ్నేచర్‌ గ్రిల్‌ కారును స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో క్లీన్‌ లైన్స్‌, డ్యూయల్‌-టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌ మరింత యువత పడిపోవాల్సిందే. కారు వెనుక భాగంలో ఇచ్చిన బోల్డ్‌ టెయిల్‌ ల్యాంప్స్‌ టియాగోకు ఒక అదనపు ఆకర్షణగా, ఆధునిక డిజైన్‌ ఫినిషింగ్‌గా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు కొనవచ్చు?
టాటా కంపెనీ కార్లలో.. Tata Punch, Tata Nexon తర్వాత టాటా టియాగో మూడో బెస్ట్ సెల్లింగ్ కారు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్‌ ధర రూ. 5 లక్షలు (Tata Tiago ex-showroom price, Hyderabad Vijayawada) , టాప్ వేరియంట్‌ రేటు రూ. 8.55 లక్షల వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌, విజయవాడలో (Tata Tiago on-road price, Hyderabad Vijayawada) ఈ కారును దాదాపు రూ. 6.05 లక్షల ఆన్‌-రోడ్‌ ధరతో ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ కారులో ఉన్న ఫీచర్లతో పోలిస్తే, ఈ విభాగంలో ఈ కారు మీ డబ్బుకు తగిన విలువ అందించగల ఆప్షన్‌.

టాటా టియాగో ఫీచర్లు
టాటా టియాగో 12 వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో పెట్రోల్ & CNG ఎంపికలు రెండూ ఉన్నాయి. టియాగోలో 1199 సిసి 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 86 PS పవర్‌ & 3,300 rpm వద్ద 113 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది, పవర్‌ఫుల్‌ డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. Tata Tiago CNG వేరియంట్‌లోని ఇంజిన్ 6,000 rpm వద్ద 75.5 PS శక్తిని & 3,500 rpm వద్ద 96.5 Nm టార్క్‌ను ఇస్తుంది. 

టాటా టియాగోలో 242 లీటర్ల బూట్ స్పేస్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. బండి ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

ఎంత మైలేజ్ ఇస్తుంది? 
టాటా టియాగో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్ లీటర్‌కు 20.09 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లీటర్‌కు 19 కి.మీ. దూరం ప్రయాణించగలదు. టాటా టియాగో CNG మోడ్‌లో వాడితే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 26.49 km/kg, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 28.06 km/kg ఇవ్వగలదని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.

మీరు టాటా టియాగో CNG వేరియంట్‌ రెండు ట్యాంక్‌లను పూర్తిగా నింపితే, ARAI సర్టిఫై చేసిన ప్రకారం, 900 కి.మీ. వరకు సులభంగా ప్రయాణించవచ్చు. అంటే, హైదరాబాద్‌-విజయవాడ మధ్య దాదాపుగా రెండు ట్రిప్పులు కొట్టి రావచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
Tamil Nadu Vijay: తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
Steve Smith Records: 96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Embed widget