MG Windsor Car Loan: దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ కార్ - రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో కొంటే ఎంత EMI కట్టాలి?
MG Windsor EV EMI Plan: మీరు MG Windsor EV బేస్ వేరియంట్‌ను కార్ లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా మీరు EMI ఆప్షన్స్ గురించి తెలుసుకోండి.

MG Windsor EV Price, Down Payment, Loan and EMI Details: ఎంజీ విండ్సర్ EV డిజైన్ స్లీక్ LED ఫ్రంట్ లైటింగ్ కాంబోను అందిస్తుంది, ఇది ఫ్యూచరిస్టిక్ లుక్స్‌కు ప్రత్యేకంగా సరిపోతుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ ఎలక్ట్రిక్ కారుకు అదనపు ఆకర్షణ. పెనోరమిక్ గ్లాస్ రూఫ్ ఇంటీరియర్‌ను ప్రకాశవంతంగా మార్చి ఎయిర్-ఫ్రేష్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఐకానిక్ 18-అలాయ్ వీల్స్ ఈ కారుకు మరో లెవెల్ స్టేట్‌మెంట్‌గా నిలుస్తాయి, వాహనం బాహ్య రూపాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే. గత 10 నెలలుగా, ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. అందుబాటు ధర & ఆధునిక లక్షణాలు ఉన్న ఈ కారు, ప్రీమియం EV విభాగంలో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆఫర్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఇదొక ప్రత్యేక అవకాశం.
తెలుగు నగరాల్లో MG విండ్సర్ EV ఆన్-రోడ్ ధర
MG Windsor EV బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 14 లక్షలుగా నిర్ణయించింది. హైదరాబాద్‌లో దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ.14.94 లక్షలు. ఇందులో, కారు రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 8,000, బీమా కోసం దాదాపు రూ. 88,000, ఇతర అవసరమైన ఖర్చులు దాదాపు రూ. 15,000 ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుని, హైదరాబాద్‌లో ఈ కారుకు ఓనర్ కావడానికి ఒక కస్టమర్ దాదాపు రూ. 15.10 లక్షలు (MG Windsor EV on-road price, Hyderabad) ఖర్చు చేయాలి. విజయవాడలో MG Windsor EV ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 15.05 లక్షలు (MG Windsor EV on-road price, Vijayawada).
2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే EMI ఎంత కట్టాలి?
మీరు, హైదరాబాద్‌లో MG Windsor EV బేస్ వేరియంట్ కొనడానికి రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మిగిలిన రూ. 13.10 లక్షలను కార్ లోన్ రూపంలో బ్యాంక్ అందిస్తుంది. మీరు ఈ కారు రుణాన్ని 7 సంవత్సరాల (84 నెలలు) కాలానికి 9% వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. ఈ లెక్కలను బట్టి, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 21,075 EMI చెల్లించాలి.
6 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే నెలకు రూ. 23,612 EMI కట్టాలి.
5 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే నెలకు రూ. 27,191 EMI కట్టాలి.
4 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే నెలకు రూ. 32,597 EMI కట్టాలి.
మొత్తం ఖర్చు ఎంత అవుతుంది?
7 సంవత్సరాల EMI ప్లాన్ ఎంచుకుని నెలకు రూ. 21,075 EMI చొప్పు చెల్లిస్తే, ఏడేళ్లలో (84 నెలలు), అసలు కాకుండా, దాదాపు రూ. 4.60 లక్షల వడ్డీ చెల్లిస్తారు. కారు ఆన్-రోడ్ ధరకు ఈ వడ్డీని కూడా కలిపితే, ఈ కారు మొత్తం ఖర్చు మీకు దాదాపు రూ. 19.70 లక్షలు అవుతుంది.
MG విండ్సర్ EV డ్రైవింగ్ రేంజ్
38-kWh బ్యాటరీ ప్యాక్‌తో, MG విండ్సర్ EV 331 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రో వేరియంట్‌లో 52.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది 449 కిలోమీటర్ల ARAI-సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది.
MG విండ్సర్ EV కి ప్రత్యామ్నాయ కార్లు
భారత మార్కెట్లో, MG విండ్సర్ EV కి ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. Tata Curvv EV, Mahindra BE6 & Hyundai Creta EV వాటిలో ప్రధానమైనవి. స్టైలిష్ డిజైన్, బలమైన రేంజ్ & అందుబాటు EMI ఆప్షన్స్ MG విండ్సర్ EV కి పాపులారిటీ పెంచాయి.





















