Cheapest CNG Car: దేశంలోనే అత్యంత చౌకైన CNG కారు – కొనే ముందు మీకు ఇవి తెలియాలి
Affordable CNG Cars 2025: ఈ రోజుల్లో, మార్కెట్లో CNG కార్లకు డిమాండ్ ఉంది, ఇవి చౌకగా ఉండటంతో పాటు మంచి మైలేజీని కూడా ఇస్తాయి. అలాంటి చౌకైన CNG కార్ల గురించి తెలుసుకుందాం.

Maruti Suzuki Cheapest CNG Cars: ప్రస్తుతం, ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో టెక్నాలజీ చాలా మారింది. ముఖ్యంగా, కార్లలో ఆశ్చర్యపరిచే & డ్రైవర్ పనిని తగ్గించే చాలా ఫీచర్లు బడ్జెట్ రేటులోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు, ఇండియన్ మార్కెట్లో రోజువారీ ప్రయాణానికి చాలా బెస్ట్ కార్లు అమ్మకానికి ఉన్నాయి. ముఖ్యంగా, డైలీ అప్&డౌన్ కోసం CNG కార్లను వినియోగించేవాళ్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ ప్రయాణించేవాళ్లు ఈ కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెట్రోల్ & డీజిల్ కార్ల కంటే CNG కార్లను చౌకవగా నడపవచ్చు.
ప్రస్తుతం, దేశంలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న బెస్ట్ CNG కార్లు ఇవి:
మారుతి సుజుకి ఆల్టో K10
ఈ లిస్ట్‌లో మొదటి కారు పేరు Maruti Suzuki Alto K10 CNG. ఆల్టో K10 ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చవకగా, వేగంగా అమ్ముడవుతున్న CNG కారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.90 లక్షలు. అన్ని ఖర్చులు కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 7.03 లక్షలు అవుతుంది. ఈ చిన్న కారు భారీ ట్రాఫిక్‌లోనూ సులభంగా కదులుతుంది. ఒక చిన్న కుటుంబానికి సరైనది, 4 మంది హాయిగా కూర్చోవచ్చు. ARIA సర్టిఫై చేసిన ప్రకారం, ఈ కారు కిలోకు 33.85 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. మారుతి సుజుకి ఆల్టోలో AC, ఫ్రంట్ పవర్ విండో, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, అడ్జస్టబుల్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకి సెలరియో బ్రెజ్జా
రెండో ఉత్తమ ఎంపిక Maruti Suzuki Celerio CNG. మారుతి సుజుకి సెలెరియో, దేశంలోని CNG కార్లలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు, కంపెనీ డేటా ప్రకారం ఇది కిలోకు 34.43 కి.మీ. మైలేజీని ఇస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. రూ. 5.90 లక్షలు. తెలుగు నగరాల్లో దాదాపు రూ. 8.22 లక్షల ఆన్-రోడ్ ధరకు కొనవచ్చు. దీని రన్నింగ్ ఖర్చు మోటార్ సైకిల్ నడపడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ కాబట్టి, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ కారులో ఐదుగురు సులభంగా కూర్చోవచ్చు. భద్రత కోసం, ఈ కారులో EBD & యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యాన్ని పొందుతారు.
టాటా టియాగో iCNG
మూడో ఉత్తమ ఎంపిక Tata Tiago iCNG. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షలు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఈ కారును దాదాపు రూ. 7.22 లక్షల ఆన్-రోడ్ ధరకు వస్తుంది. డేటా ప్రకారం, ఇది కిలోగ్రాముకు 27 కి.మీ. మైలేజీ అందిస్తుంది. ఈ కారులో ఐదుగురు హాయిగా కూర్చోవచ్చు. ఈ టాటా బ్రాండ్ కారులో 1.2 లీటర్ ఇంజిన్ ఉంది, ఇది CNG మోడ్‌లో 73hp పవర్ & 95nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్మూత్ డ్రైవింగ్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఉంది.





















