అన్వేషించండి

Scorpio Classic Price Drop: మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌పై భారీ డిస్కౌంట్‌ - ఇప్పుడు కొంటే మీకే లాభం!

Mahindra Scorpio Classic Discount: మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.77 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. డిస్కౌంట్‌ పోను తక్కువలో వస్తుంది.

Mahindra Scorpio Classic Deal August 2025: మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌, బలంగా వంపు తిరిగిన బాడీ లైన్స్‌, అగ్రెసివ్‌ గ్రిల్‌ డిజైన్‌తో రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త LED డే టైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌ (DRLs) & షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌ దీని ఫ్రంట్‌ లుక్‌కి మరింత స్టైలిష్‌ టచ్‌ ఇస్తాయి. సైడ్‌ ప్రొఫైల్‌లో ఉన్న బోల్డ్‌ స్క్వేర్‌-ఆఫ్‌ వీల్‌ ఆర్చెస్‌, 17-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఈ SUV రగ్డ్‌ ఫీల్‌ను మరో స్టేజ్‌కు తీసుకువెళతాయి. రియర్‌ డిజైన్‌లో ఉన్న కొత్త LED టెయిల్‌ల్యాంప్స్‌, స్కార్పియో బ్రాండింగ్‌ దీనిని ఒక క్లాసిక్‌గా, అదే సమయంలో ఆధునికంగానూ చూపిస్తాయి.

మీరు మహీంద్రా స్కార్పియో కొనాలని ప్లాన్ చేస్తుంటే, వెంటనే కొనేయడం మీకు మంచి అవకాశం కావచ్చు. ఈ నెల అంటే ఆగస్టు 2025లో, మహీంద్రా కంపెనీ, స్కార్పియో క్లాసిక్‌ మోడల్‌పై మొత్తం రూ. 70,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో క్యాష్‌ డిస్కౌంట్‌, అదనపు హంగులు (ఉపకరణాలు), ఎక్స్ఛేంజ్ బోనస్ & స్క్రాపేజ్ బోనస్ కలిసి ఉన్నాయి. 

మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.77 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.72 లక్షల వరకు ఉంది. ఈ నెల (ఆగస్టు 2025)లో రూ. 70,000 తగ్గింపుతో, ఈ SUV మరింత అందుబాటులోకి వస్తుంది. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్ వేరియంట్ & స్థానాన్ని బట్టి మారవచ్చు.

హైదరాబాద్‌లో, మహీంద్రా స్కార్పియో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17.18 లక్షలు. ఇందులో, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు దాదాపు రూ. 2.42 లక్షలు, ఇన్సూరెన్స్‌ దాదాపు రూ. 85,000, ఇతర ఖర్చులు కలిసి ఉన్నాయి. విజయవాడలో ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 17.29 లక్షలు. 

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫీచర్లు
క్యాబిన్‌లో 9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌తో పాటు డ్యూయల్-టోన్ బ్లాక్ థీమ్‌ ఉంది. స్కార్పియో క్లాసిక్‌లో ఆడియో కంట్రోల్స్‌తో పాటు లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, ఎత్తును సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పార్ట్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి. 

మహీంద్రా స్కార్పియో పవర్‌ట్రెయిన్ 
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 132hp పవర్‌, 300Nm టార్క్‌ ఇచ్చే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై పని చేస్తుంది. పూర్తిగా అల్యూమినియంతో తయారైన తేలికపాటి GEN-2 mHawk ఇంజిన్‌ దీనిలో ఉంది. 

భద్రతలు
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUVలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, రియర్‌ పార్కింగ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్, ABS, LED DRLsతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు & స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్‌, 60 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్‌ అందుబాటులో ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget