Ola ADAS Scooter: ADAS టెక్నాలజీతో భారత మార్కెట్లో తొలి స్కూటర్, స్మార్ట్ ఫీచర్ల హంగామా - కేవలం రూ.999 కే!
Ola Electric Smart Features: దేశంలో మొట్టమొదటిగా, ADAS ఫీచర్లు & వ్లాగర్ల కోసం ప్రత్యేక డాష్‌క్యామ్ దీనిలో ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ తెలుసుకుందాం.

Ola S1 Pro Sport ADAS Scooter Price, Range And Features: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ ఒక కీలక మైలురాయిని దాటింది. ఓలా ఎలక్ట్రిక్, తన కొత్త స్కూటర్ ఓలా S1 ప్రో స్పోర్ట్‌ను శుక్రవారం (ఆగస్టు 15, 2025) సాయంత్రం లాంచ్ చేసింది. ఇది, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కూటర్ల కంటే ఇది ప్రత్యేకం & అడ్వాన్స్‌డ్ ఫీచర్లలో సరికొత్త శకం. Ola S1 Pro Sport Ola S1 Pro Sport అనేది Ola S1 Pro+ లో స్పోర్టియర్ వెర్షన్. దీని ధర ఎక్స్-షోరూమ్ ధర ₹1,49,999, ఇది పరిచయ ధర, తర్వాత రేటు పెంచవచ్చు. ఈ బండిని కేవలం ₹999 చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు జనవరి 2026లో ప్రారంభమవుతాయి.
భారతదేశపు మొట్టమొదటి ADAS స్కూటర్
దేశంలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ ఉన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 Pro Sport అవుతుంది. ఇది చాలా అడ్వాన్స్‌డ్ & ఖరీదైన టెక్నాలజీ. ఇప్పటివరకు ఈ టెక్నాలజీ కార్లలో మాత్రమే కనిపించేది. కానీ, మొట్టమొదటిసారిగా, Ola ఎలక్ట్రిక్, దీనిని ద్విచక్ర వాహనాలోనూ తీసుకువచ్చింది. సిటీ ట్రాఫిక్‌లో రైడ్‌ను సురక్షితంగా మార్చడానికి ADAS వ్యవస్థ రియల్-టైమ్ అలెర్ట్స్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్, ప్రమాదం జరగబోయే అవకాశం గురించి రైడర్‌ను ముందుగానే హెచ్చరిస్తుంది, తద్వారా ప్రమాదాల రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఇంకా, బ్లైండ్ స్పాట్ హెచ్చరికలు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ADASలో భాగంగా ఉన్నాయి.
ముందు భాగంలో డాష్‌క్యామ్ కూడా
Ola S1 Pro Sport ముందు భాగంలో డాష్‌క్యామ్ ఉంటుంది, ఇది అనేక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. దీనిని, మీ ప్రయాణాన్ని రికార్డ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఏదైనా ప్రమాదం లేదా వివాదం జరిగితే, రికార్డయిన వీడియో పోలీసుల వద్ద లేదా కోర్టులో సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. బీమా క్లెయిమ్ సమయంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొఫెషనల్ క్వాలిటీ రైడింగ్ వీడియోలను దీనితో తయారు చేయవచ్చు. అంటే, ఈ ఫీచర్‌ను వ్లాగర్లు కూడా ఉపయోగించుకోవచ్చు.
స్పోర్టీ డిజైన్ & శక్తివంతమైన లుక్
Ola S1 Pro Sport డిజైన్ ప్రస్తుతం ఉన్న ఓలా స్కూటర్ల కంటే మరింత డైనమిక్‌గా ఉంది. దీనికి స్ట్రీట్-స్టైల్ ఫెయిరింగ్, వర్టికల్ రేసింగ్ స్ట్రిప్స్ & స్పోర్టీ స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. ప్యానెల్స్ మెరుగైన ఏరోడైనమిక్స్‌ను అందిస్తాయి, అధిక వేగంలోనూ స్థిరత్వాన్ని పెంచుతాయి. ఫ్రంట్ ఫెండర్ & గ్రాబ్ హ్యాండిల్‌ను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు, ఇవి బలంగానూ & తేలికగానూ ఉంటాయి. తేలికైన పదార్థం కారణంగా రైడింగ్ రేంజ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అలాగే, కొత్త రియర్-వ్యూ మిర్రర్లు, సీట్ కవర్లు, స్వింగ్ ఆర్మ్ కవర్లు, ఫ్లోర్‌మ్యాట్‌లు & బాడీ డెకాల్స్ వంటివి ఈ స్కూటర్‌కు ప్రీమియం అప్పీల్ ఇస్తాయి.
పనితీరు & పరిధి
Ola S1 ప్రో స్పోర్ట్ 16 kW (21.45bhp) గరిష్ట ఔట్‌పుట్ & 71 Nm గరిష్ట టార్క్‌ను అందించే మిడ్-మౌంటెడ్ మోటార్‌పై నడుస్తుంది. S1 ప్రో స్పోర్ట్ కేవలం రెండు సెకన్లలో 0 నుంచి 40 km/h వేగాన్ని అందుకుంటుంది. ఓలా S1 ప్రో స్పోర్ట్ గరిష్ట వేగం గంటకు 152 కిమీ.
ఓలా S1 ప్రో స్పోర్ట్ బ్యాటరీ ప్యాక్ 5.2 kWh యూనిట్, ఇది ఫుల్ ఛార్జ్‌తో 320 km క్లెయిమ్డ్ IDC రేంజ్‌ను అందిస్తుంది. S1 ప్రో స్పోర్ట్ బ్యాటరీ ప్యాక్‌ను ఓలా ఇన్-హౌస్ 4680 సెల్స్‌తో తయారు చేసారు.





















