బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో Mahindra BE6 - లాంచ్ చేసిన బాలీవుడ్ హీరో, పరిమిత యూనిట్లే!
Mahindra BE6 Batman Edition: జాన్ అబ్రహం, మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌ను విడుదల చేశారు. ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ SUV మ్యాట్ బ్లాక్ పెయింట్, గోల్డ్ డిటెయిలింగ్ & బ్యాట్‌మ్యాన్ లోగోతో వచ్చింది.

Mahindra BE6 Batman Edition Price, Range, Features In Telugu: ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం మహీంద్రా ఎలక్ట్రిక్ SUV BE6 లో ప్రత్యేక వేరియంట్‌ను (John Abraham Mahindra BE6 Batman Edition) లాంచ్ చేశారు, దీనికి మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అని పేరు పెట్టారు. ఈ పరిమిత ఎడిషన్‌లో కేవలం 300 యూనిట్లు (కార్లు) మాత్రమే తయారు చేస్తారు.
ఆల్-బ్లాక్ & బ్యాట్‌మ్యాన్ థీమ్
Mahindra BE6 Batman Edition లుక్స్ ఏ కారు ప్రియుడినైనా మొదటి చూపులోనే ఆకర్షిస్తుంది. దీనికి బంగారు వర్ణంతో కూడిన మ్యాట్ బ్లాక్ కలర్ (Matte black color) పెయింట్ జాబ్ ఉంది. ఈ కలర్ కాంబినేషన్ ఈ ఎలక్ట్రిక్ కారుకు ప్రీమియం & శక్తిమంతమైన అప్పీల్ ఇస్తుంది. కారు బయటి భాగంలో.. డోర్, బోనెట్, టెయిల్ ల్యాంప్ వంటి కొన్ని ప్రదేశాలలో బ్యాట్‌మ్యాన్ లోగోలను అమర్చారు. గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్స్ & బ్యాట్‌మ్యాన్-థీమ్డ్ డెకాల్స్ కారు స్టైల్‌ను గొప్పగా చూపిస్తాయి. చక్రాలు, ఫెండర్లు, కిటికీలు & విండ్‌షీల్డ్‌లపై కూడా బంగారు రంగులు ఉన్నాయి.
లగ్జరీ ఇంటీరియర్స్ & ప్రీమియం డీటెయిలింగ్
ఈ ఎడిషన్ లోపలి భాగం పూర్తిగా నలుపు రంగు థీమ్‌లో ఉంచారు, దీనిపై గోల్డ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ ఉపయోగించారు. డాష్‌బోర్డ్‌పై ప్రత్యేక బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్ ఉంది, ఇది ఇతర వేరియంట్‌ల నుంచి దీనిని భిన్నంగా చూపుతుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ప్రత్యేక బ్యాట్‌మ్యాన్ యానిమేషన్ ఉంది, కారు ప్రారంభమైన వెంటనే మీరే సూపర్ హీరో (బ్యాట్‌మ్యాన్) అనే అనుభూతిని ఇది ఇస్తుంది.
పవర్ & పెర్ఫార్మెన్స్
మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ టాప్-ఎండ్ ప్యాక్ 3 వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది 79 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది, ఇది రియర్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ మోటార్ 286 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది, అంటే ఈ ఎలక్ట్రిక్ SUV బలమైన పనితీరును అందించగలదు. ఫుల్ ఛార్జ్‌తో ఈ ఎలక్ట్రిక్ కారు 682 కి.మీ. (ARAI సర్టిఫైడ్) రేంజ్ ఇవ్వగలదు. అంటే లాంగ్ డ్రైవ్‌లలో కూడా ఛార్జింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం రాదు.
కామిక్ అభిమానులకు ప్రత్యేక బహుమతి
మహీంద్రా, ఈ వేరియంట్‌ను DC కామిక్స్‌తో కలిసి అభివృద్ధి చేసింది. అంటే ఇది కేవలం కారు మాత్రమే కాదు, బ్యాట్‌మ్యాన్ అభిమానుల కోసం సేకరించదగిన వస్తువు. దీని ధర ప్రామాణిక BE6 కంటే దాదాపు రూ. 89,000 ఎక్కువ. కానీ ఈ SUV ప్రత్యేకమైన రూపం & పరిమిత ఉత్పత్తి దీనిని ప్రత్యేకతను ఆపాదిస్తాయి. మహీంద్రా, XEV 9e వంటి ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లలో కూడా ఇలాంటి సూపర్ హీరో-థీమ్డ్ ఎడిషన్‌లను ప్రవేశపెడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతానికి, మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ భారతీయ EV మార్కెట్లో స్టైల్‌ను & పనితీరులో కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశించినట్లే.
ఈ పరిమిత ఎడిషన్‌లో కేవలం 300 యూనిట్లు (కార్లు) మాత్రమే తయారు చేస్తారు కాబట్టి, కార్లను కలెక్ట్ చేసేవాళ్లకు ఇది చాలా ప్రత్యేకమైనదిగా & అపురూపమైన జ్ఞాపకంగా ఇది ఉంటుంది.





















