అన్వేషించండి

Royal Enfield Classic 350 Updated: క్లాసిక్ 350లో కొత్త మోడల్ తెచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఎలా ఉందో తెలుసా?

New Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ సెప్టెంబర్ 1న రివీల్ చేయనుంది.

2024 Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వెర్షన్‌ను కంపెనీ అప్‌డేట్ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత కంపెనీ ఈ బైక్‌ను కొత్త జే-ప్లాట్‌ఫారమ్‌తో తీసుకొచ్చింది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో అనేక కొత్త ఫీచర్లు చేర్చారు. దీంతో పాటు బైక్‌లో కొత్త కలర్ వేరియంట్‌లు కూడా అందించారు.

క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ బైక్ ధర గురించి సమాచారం సెప్టెంబర్ 1వ తేదీన రివీల్ చేయనున్నారు. కంపెనీ ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన డెలివరీ కూడా అదే రోజు నుంచి ప్రారంభించనుంది.

కొత్త క్లాసిక్ 350 డిజైన్ ఎలా ఉంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కూల్ లుక్‌తో వచ్చింది. ఈ బైక్‌కు పెద్ద మడ్‌గార్డ్‌ను అమర్చారు. ఈ బైక్ డిజైన్‌ను మరింత మెరుగుపరచడానికి కంపెనీ కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించింది. ఈ బైక్‌లో అన్నిచోట్లా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. ఇందులో అడ్జస్టబుల్ లివర్‌ను కూడా చూడవచ్చు. ఈ బైక్‌లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పాయింట్‌ను కూడా కంపెనీ అందించింది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇంజిన్ ఎలా ఉంది?
అప్‌డేట్ చేసిన క్లాసిక్ 350 కొన్ని వేరియంట్లలో, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉపయోగిస్తున్నారు. ఇవి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోడర్న్ టచ్‌కు రెట్రో రూపాన్ని ఇస్తున్నాయి. ఈ బైక్ పవర్‌ట్రెయిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో ఎయిర్/ఆయిల్ కూల్డ్, 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 20.2 బీహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

కొత్త కలర్ వేరియంట్‌తో...
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఐదు థీమ్‌ల్లో 11 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లో ఐదు రంగుల థీమ్‌లను అందించింది. అవే క్రోమ్, హాల్సియాన్, మాటే, సిగ్నల్స్, రెడ్ డిచ్. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్ ఆరు కలర్ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో ఎమరాల్డ్, జోధ్‌పూర్ బ్లూ, మద్రాస్ రెడ్, మెడలియన్ బ్రౌన్, కమాండో సాండ్, స్టెల్త్ బ్లాక్ ఉన్నాయి.

2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అంచనా ధర...
2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్ ధర ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ కంటే ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది. 

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget