Royal Enfield Classic 350 డైలీ అప్-డౌన్‌కు అనుకూలమేనా?, లోన్ తీసుకుంటే EMI లెక్కింపు ఎలా?
Royal Enfield Classic 350 EMI Calculation: మీ క్రెడిట్ స్కోర్‌పై బ్యాంక్ సంతృప్తి చెందితే మీకు వెంటనే లోన్ మంజూరు చేస్తుంది. మీరు నెలనెలా EMI చెల్లిస్తే కొంతకాలానికి ఆ లోన్ తీరిపోతుంది.

Royal Enfield Classic 350 Price, Down Payment, Loan EMI: ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు క్రేజే వేరబ్బా. ముఖ్యంగా, యువతకు ఈ బ్రాండ్ మోటార్ సైకిళ్లంటే పిచ్చి. ఈ రాయల్ బైకుల్లో... క్లాసిక్ 350 లుక్ నిజంగా రాజసంగా కనిపిస్తుంది, రోడ్డుపైకి వెళ్తే అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. క్రోమ్ ఫినిషింగ్, పెద్ద ట్యాంక్, గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ ఈ బైక్‌కు క్లాసిక్ మోడ్‌లో ఉంచుతాయి. రెట్రో స్టైల్‌తో పాటు ఆధునిక టచ్ కలిపి ఉండటంతో ఈ బైక్ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 రైడింగ్ పొజిషన్ కంఫర్ట్‌గా ఉండటం వల్ల లాంగ్ రైడ్స్‌కి కూడా ఇది అద్భుతంగా సరిపోతుంది. డైలీ యూజ్ విషయానికి వస్తే... మీరు రోజూ ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, క్లాసిక్ 350 ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
హైదరాబాద్, విజయవాడలో ఆన్-రోడ్ ధర
వాస్తవానికి, యూత్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్స్ గురించి మాట్లాడేటప్పుడల్లా, క్లాసిక్ 350 పేరే మొదట వస్తుంది. భారత మార్కెట్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 7 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. క్లాసిక్ 350లో అత్యంత చౌకైనది Redditch వేరియంట్. తెలుగు రాష్ట్రాల్లో ఈ బేస్ వేరియంట్‌ను దాదాపు 1.97 లక్షల ఎక్స్-షోరూమ్ రేటుకు (Royal Enfield Classic 350 ex-showroom price, Hyderabad Vijayawada) అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో ఈ మోటార్ సైకిల్‌ను కొనాలంటే, రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 25,000, ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 12,000, ఇతర ఖర్చులు చెల్లించాలి. ఈ మొత్తం కలుపుకుని, హైదరాబాద్‌లో ఆన్-రోడ్ రేటు దాదాపు రూ. 2.35 లక్షలు (Royal Enfield Classic 350 on-road price, Hyderabad) అవుతుంది. విజయవాడలో కూడా దాదాపుగా ఇదే ఆన్-రోడ్ ధర (Royal Enfield Classic 350 on-road price, Vijayawada) ఉంది.
మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనాలనుకుంటే, ఈ మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, ఈ రాయల్ మోటార్ సైకిల్ కొనడానికి బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. ఆ డబ్బును ప్రతి నెలా నిర్ణీత EMI గా చెల్లిస్తే చాలు. మీ మీద పెద్దగా ఆర్థిక భారం లేకుండానే ఈ మోటార్‌సైకిల్ మీ పేరుతో రిజిస్ట్రర్ అవుతుంది.
ఎంత డౌన్ పేమెంట్ చేయాలి?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొనడానికి డౌన్ పేమెంట్‌గా రూ. 25,000 డిపాజిట్ చేయాలి. మిగిలిన 2.10 లక్షలను బ్యాంక్ నుంచి లోన్‌గా తీసుకోవాలి. ఈ లోన్ పై బ్యాంక్ 9 శాతం వడ్డీని వసూలు చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు బెస్ట్ EMI ఆప్షన్ ఏదో తెలుసుకుందాం.
4 సంవత్సరాల కోసం లోన్ తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 5,934 EMI డిపాజిట్ చేయాలి.
3 సంవత్సరాల్లో మొత్తం రుణం తీర్చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 7,388 EMI బ్యాంక్‌కు చెల్లించాలి.
2 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేసే ప్లాన్‌లో ఉంటే, మీరు ప్రతి నెలా రూ. 10,297 EMI కేటాయించాలి.
మీ ఆర్థిక శక్తికి అనుగుణంగా, ఈ 3 EMI ఆప్షన్స్‌లో బెస్ట్ అనుకున్న ఒక ఆప్షన్‌ను మీరు ఎంచుకోవచ్చు.
వివిధ బ్యాంకులు, వాటి పాలసీల ప్రకారం వార్షిక వడ్డీ రేటులో తేడా ఉండవచ్చు. దీంతోపాటు, లోన్ మొత్తం, వడ్డీ రేటు వంటివి మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి మారతాయి. రుణం తీసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవడం ముఖ్యం.





















