అన్వేషించండి

Renault Triber Facelift: మారుతి ఎర్టిగా ప్రత్యామ్నాయంగా కొత్త 7 సీటర్‌ కారు - ధర కేవలం రూ.6.30 లక్షలే!

Changes In Renault Triber Facelift: దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారులో చాలా మార్పులు వచ్చాయి, ఇది మునుపటితో పోలిస్తే చాలా ప్రీమియం లుక్స్‌లోకి మారింది.

Renault Triber Facelift Price, Mileage And Features In Telugu: రెనాల్ట్, కొత్త ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో ఇటీవల లాంచ్‌ చేసింది. మునుపటితో పోలిస్తే, ఈ కొత్త వాహనం ఇంటీయరియర్‌ & ఎక్స్‌టీరియర్‌లో పెద్ద మార్పులు జరిగాయి. అయితే, ఫేస్‌లిఫ్ట్‌ కాబట్టి దాని ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర
హైదరాబాద్‌ లేదా విజయవాడలో, 2025 Renault Triber Facelift ధర రూ. 6.30 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.17 లక్షల వరకు ఉంది. అన్ని పన్నులు &ఖర్చులతో కలుపుకుని, తెలుగు రాష్ట్రాల్లో దీని ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 7.55 లక్షల నుంచి రూ. 10.94 లక్షలు అవుతుంది. ఇది ఇప్పటికీ భారతదేశంలో అత్యంత తక్కువ ధర కాంపాక్ట్ MPVగా చెలామణీ అవుతోంది. Maruti Suzuki Ertiga కు పోటీగా/ ప్రత్యామ్నాయంగా రెనాల్ట్ ట్రైబర్‌ మార్కెట్‌లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో, మారుతి సుజుకి ఎర్టిగా ఆన్‌-రోడ్‌ ధర దాదాపు రూ. 10.94 నుంచి రూ. 16.52 లక్షల వరకు ఉంటుంది.

2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో మరిన్ని భద్రత సాంకేతికతలు, ఇంటీయరియర్‌ & ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లను యాడ్‌ చేశారు. దీనికి కొత్త బంపర్, కొత్త హుడ్ & LED DRLలతో కొత్త గ్రిల్‌ ఏర్పాటు చేశారు. కొత్త స్లాట్‌లతో కూడిన గ్రిల్ & కొత్త రెనాల్ట్ లోగో కూడా జోడించారు. దీంతో, ఈ కారు మునుపటి మోడల్ కంటే ఇప్పుడు మరింత ప్రీమియం లుక్‌లోకి మారింది. 

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే... క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్ (వెల్‌కమ్‌ & గుడ్‌బై సీక్వెన్స్‌తో), స్టాండర్డ్ 6 ఎయిర్‌ బ్యాగ్‌లు & ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కూడా ఇందులో చేర్చారు. ఈ పార్కింగ్‌ సెన్సార్లు గతంలో వెనుక భాగంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త లక్షణాలతో, ట్రైబర్ ఇప్పుడు లుక్స్ పరంగానే కాకుండా భద్రత & సాంకేతికత పరంగా కూడా చాలా మెరుగ్గా మారింది.

మరింత ఆకర్షణీయంగా ఫేస్ లిఫ్ట్

ఇంటీరియర్‌ దగ్గరకు వస్తే.. 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ క్యాబిన్‌లో చాలా మార్పులు జరిగాయి. ఇది మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా మారింది. ఇప్పుడు, 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో అమర్చారు, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. ఇంకా.. కొత్త డాష్‌బోర్డ్ డిజైన్ & సీట్‌ కవర్ల ప్రత్యేకమైన కలర్ థీమ్ క్యాబిన్‌కు ప్రీమియం టచ్‌ ఇస్తాయి.

ట్రైబర్‌ ఫేస్‌లిఫ్ట్‌లో మునుపటి లాగే 5, 6 & 7 సీట్ల లేఅవుట్ ఆప్షన్‌ ఉంది, మీ అవసరానికి అనువైనది ఎంచుకోవచ్చు. ఈ కారుకు రియర్‌ AC వెంట్ ఇచ్చారు. 5-సీటర్ వెర్షన్‌లో 600 లీటర్ల కంటే ఎక్కువ బూట్ స్పేస్‌ ఉంటుంది. 

పాత మోడల్‌తో పోలిస్తే, 2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌ ఎక్కువ భద్రత, ఆధునిక ఫీచర్లు & మెరుగైన డిజైన్‌తో లాంచ్‌ అయింది, కానీ ఇంజిన్ అలాగే ఉంది (ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ కాబట్టి).

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
Champion Box Office Collection Day 2: 'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Embed widget