అన్వేషించండి

Renault Kwid vs Maruti Alto K10: రెనో క్విడ్ వర్సెస్ ఆల్టో కే10 - రూ.ఐదు లక్షల్లో ఏది బెస్ట్?

Best Car Under Rs 5 Lakh: రూ.ఐదు లక్షల్లోపు మనదేశంలో మారుతి సుజుకి ఆల్టో, రెనో క్విడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది కొనుగోలు చేయడం బెస్ట్?

Renault Kwid vs Maruti Alto K10 Comparison: భారతదేశంలో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌ అంటే రూ.ఐదు లక్షల్లోపు ప్రముఖంగా రెండు కార్ల పేర్లే వినిపిస్తాయి. అవే రెనో క్విడ్, మారుతి ఆల్టో కే10. బడ్జెట్, ఫీచర్ల పరంగా చూసుకుంటే ఈ కార్లు ఒకదానికొకటి గట్టి పోటీని ఇచ్చుకుంటాయి. అటువంటి పరిస్థితిలో రూ. ఐదు లక్షల బడ్జెట్‌లో ఏది కొనుగోలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో తెలియక వినియోగదారులు అయోమయంలో పడే అవకాశం ఉంది.

భారతీయ మార్కెట్లో కొత్త రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, మారుతి సుజుకి ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 3.99 లక్షలుగా ఉంది. కొత్త క్విడ్ ఆర్ఎక్సఈ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్ఎల్ (వో), ఆర్ఎక్స్‌టీ, క్లైంబర్ అనే నాలుగు వేరియంట్లలో వస్తుంది.

మారుతి ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్ స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ+ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే సీఎన్‌జీ ఇంజన్ కేవలం వీఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రెండు కార్లు అనేక ఆకర్షణీయమైన రంగులలో వస్తాయి.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

రెండిట్లో దేని ఫీచర్లు బాగున్నాయి?
ఆల్టో కే10 యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను పొందుతుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు సెక్యూరిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

క్విడ్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 14 అంగుళాల చక్రాలను పొందుతుంది. ఇది కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసీ, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.

ఇంజిన్లు ఎలా ఉన్నాయి?
రెనో క్విడ్ వన్ లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బీహెచ్‌పీ పవర్, 91 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్‌లో అమర్చిన ఇంజన్ గరిష్టంగా 65 బీహెచ్‌పీ పవర్‌ని, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్టో కే10లో పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే రెనో క్విడ్‌లో సీఎన్‌జీ ఇంజన్ అందుబాటులో లేదు.

మైలేజీ గురించి చెప్పాలంటే మారుతి ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 24.39 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ ఇంజిన్‌తో ఈ కారు కిలోగ్రాముకు 33 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. రెనో క్విడ్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
రీసేల్ విలువలో Hyundai Verna నంబర్ 1 - Honda City కి భారీ డిప్రెషియేషన్
సెకండ్‌హ్యాండ్‌ కార్ల మార్కెట్లో Hyundai Verna హవా - ఐదేళ్ల తర్వాత కూడా టాప్ వాల్యూ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Embed widget