Nissan Magnite AMT లో CNG ఆప్షన్ ధర రూ. 71,999. ఈ కిట్ మూడు సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.
CNG ఆప్షన్‌తో వచ్చిన Nissan Magnite AMT - రూ.71,999 కిట్ ధర, మూడేళ్ల వారంటీ
Nissan Magnite AMT ఇప్పుడు CNG ఆప్షన్‌తో లభిస్తోంది. రూ.71,999 కిట్ ధరతో 3 ఏళ్ల వారంటీతో వస్తోంది. కొత్త ఫ్యూయల్ లిడ్ సిస్టమ్‌తో రీఫిల్లింగ్ మరింత సులభం అయింది.

Nissan Magnite AMT With CNG Option Launched: భారతీయ కాంపాక్ట్ SUV మార్కెట్లో మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. నిస్సాన్ మోటార్ ఇండియా, తన పాపులర్ Magnite SUVలో ఇప్పుడు CNG ఆప్షన్‌ను AMT వేరియంట్‌లోనూ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త రెట్రోఫిట్‌మెంట్ కిట్ ధర రూ. 71,999. ఇది మూడు సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తోంది.
కొత్త ఫ్యూయల్ సిస్టమ్ & మెరుగైన సౌకర్యం
ఇప్పటి వరకు CNG రీఫిల్ చేయాలంటే బోనెట్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ, ఈ కొత్త అప్‌డేట్‌తో ఫ్యూయల్ లిడ్ ఇన్‌ట్రిగ్రేషన్ వచ్చింది. అంటే, పెట్రోల్ పోయించడానికి ఉపయోగించే అదే తరహా లిడ్ ద్వారా CNG ని కూడా రీఫిల్ చేసుకోవచ్చు. ఇది చాలా సమయం ఆదా చేస్తుంది & రోజువారీ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభం చేస్తుంది.
రెట్రోఫిట్ కిట్ & వారంటీ వివరాలు
Nissan Magnite AMT CNG కిట్‌ను Motozen Fuel Systems డెవలప్ చేసింది. ఇది, కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన కిట్. కాబట్టి, భద్రత పరంగా ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సి అవసరం లేదు. అలాగే, ఇటీవలి GST తగ్గింపును (28% నుంచి 18%) ప్రతిబింబిస్తూ, Nissan, రెట్రోఫిట్‌మెంట్ కిట్ ధరను రూ. 71,999గా నిర్ణయించింది. అదనపు ఇంజినీరింగ్ అప్‌డేట్స్ నవీకరణలు & మెరుగైన ఇంటిగ్రేషన్ ఉన్నప్పటికీ, కంపెనీ అదే MRP తో అందిస్తోంది. GST ప్రయోజనాన్ని కస్టమర్‌కే ఇస్తోంది.
ఎక్కడ లభిస్తోంది?
ఈ రెట్రోఫిట్‌మెంట్ కిట్ 2025 సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నిస్సాన్ అధీకృత CNG సెంటర్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది - వీటిలో దిల్లీ-NCR, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి.
ఇంజిన్ & ట్రాన్స్మిషన్ ఆప్షన్స్
CNG ఆప్షన్ కేవలం 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌కే పరిమితం. అయితే, ఇది ఇప్పుడు మాన్యువల్ & AMT ట్రాన్స్మిషన్ రెండింటికీ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ కలిగిన SUVలు భారత మార్కెట్లో చాలా తక్కువ.
సేఫ్టీ & రేటింగ్స్
నిస్సాన్ మాగ్నైట్ సేఫ్టీ పరంగా కూడా అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ NCAP 5-స్టార్ రేటింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా, హిల్ హోల్డ్, ESP వంటి ఆధునిక ఫీచర్లు అందిస్తోంది.
భవిష్యత్ ప్రణాళికలు
తాజాగా, ఈ కంపెనీ Magnite Kuro Special Edition ను కూడా విడుదల చేసింది. ఇది బ్లాక్ థీమ్‌లో జపనీస్ డిజైన్ ఇన్‌స్పిరేషన్‌తో వచ్చింది. ఇక నిస్సాన్ త్వరలో మిడ్సైజ్ SUV, 7 సీటర్ SUV & చిన్న ఎలక్ట్రిక్ కార్ (A-సెగ్మెంట్ EV) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
అందుబాటు ధరలో CNG సౌకర్యం, ఆటోమేటిక్ డ్రైవింగ్ అనుభవం, మెరుగైన మైలేజ్ కలిపిన ఈ కొత్త మాగ్నైట్ AMT CNG వెర్షన్ యువతకు ఆకర్షణీయంగా మారనుంది. పర్యావరణ హితాన్ని కోరుకునే డ్రైవర్స్ కోసం ఇది నిజంగా ఒక స్మార్ట్ ఆప్షన్.
Frequently Asked Questions
Nissan Magnite AMT లో CNG ఆప్షన్ ధర ఎంత?
Nissan Magnite AMT CNG కిట్‌ను ఎవరు అభివృద్ధి చేశారు?
Nissan Magnite AMT CNG కిట్‌ను Motozen Fuel Systems అభివృద్ధి చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన కిట్.
Nissan Magnite AMT CNG కిట్ ఎక్కడ లభిస్తుంది?
ఈ రెట్రోఫిట్‌మెంట్ కిట్ దేశవ్యాప్తంగా అన్ని నిస్సాన్ అధీకృత CNG సెంటర్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది.
Nissan Magnite AMT లో CNG ఆప్షన్ ఏ ఇంజిన్‌తో వస్తుంది?
CNG ఆప్షన్ కేవలం 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌కే పరిమితం. ఇది మాన్యువల్ & AMT ట్రాన్స్మిషన్ రెండింటికీ అందుబాటులో ఉంది.





















