అన్వేషించండి

కామన్‌మ్యాన్‌ బడ్జెట్‌కు సరిపోయే మోడ్రన్‌ MPV - నిస్సాన్‌ గ్రావైట్‌ రూ.5.65 లక్షల నుంచి, 5,000 యూనిట్లకే ఈ స్పెషల్‌ రేటు

నిస్సాన్‌ గ్రావైట్‌ 7 సీటర్‌ MPV రూ.5.65 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. 10ఏళ్ల వారంటీ ఇస్తున్నారు, మైలేజ్‌ లీటరుకు 19.6 కిలోమీటర్లు. హైదరాబాద్‌-విజయవాడ ధరల వివరాలు తెలుసుకోండి.

Nissan Gravite Price And Specifications: సామాన్య కుటుంబాలు కూడా సులభంగా కొనగలిగే ధరలో నిస్సాన్‌ తన కొత్త 7 సీటర్‌ MPV ‘గ్రావైట్‌’ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ప్రారంభ ధర రూ.5.65 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర). అయితే ఈ ధర మొదటి 5,000 యూనిట్లకే వర్తిస్తుంది. మొత్తం ధర శ్రేణి రూ.5.65 లక్షల నుంచి రూ.8.93 లక్షల వరకు ఉంటుంది.

రెనాల్ట్‌ ట్రైబర్‌ ఆధారంగా రూపొందించిన గ్రావైట్‌ కోసం అదే CMF-A+ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. అయితే డిజైన్‌, కొన్ని ఫీచర్లలో కొంత ప్రత్యేకత చూపించారు. ప్రస్తుతం బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

వారంటీ - ప్రత్యేక ఆఫర్లు

గ్రావైట్‌కు 3 సంవత్సరాలు లేదా 1,00,000 కి.మీ. స్టాండర్డ్‌ వారంటీ ఇస్తున్నారు. దీనిని 10 సంవత్సరాలు లేదా 2,00,000 కి.మీ. వరకు పొడిగించుకోవచ్చు. మొదటి 5,000 బుకింగ్స్‌కు 5 సంవత్సరాల వరకు జీరో సర్వీస్‌ ఖర్చు, ఫైనాన్స్‌ & అప్‌గ్రేడ్‌ బెనిఫిట్స్‌ కూడా అందిస్తున్నారు.

డిజైన్‌లో ప్రత్యేకత

కాస్త దూరం నుంచి చూస్తే ట్రైబర్‌ పోలిక ఉన్నప్పటికీ, దగ్గరగా చూసినప్పుడు గ్రావైట్‌ కొంత ప్రత్యేకమైన లుక్‌తో కనిపిస్తుంది. కొత్త DRL సిగ్నేచర్‌, హనీకాంబ్‌ గ్రిల్‌, C-షేప్‌ సిల్వర్‌ ఇన్‌సర్ట్స్‌తో రీడిజైన్‌ చేసిన బంపర్లు, ‘GRAVITE’ లెటరింగ్‌ బోనెట్‌, టెయిల్‌గేట్‌పై ఉంటాయి. కొత్త వీల్‌ డిజైన్‌ కూడా అందంగా ఉంటుంది.

ఫారెస్ట్‌ గ్రీన్‌, ఓనిక్స్‌ బ్లాక్‌, బ్లేడ్‌ సిల్వర్‌, స్నో వైట్‌, మెటాలిక్‌ గ్రే కలర్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. లిమిటెడ్‌ Launch Edition (1,001 యూనిట్లు)లో ఆరెంజ్‌ యాక్సెంట్స్‌, JBL సౌండ్‌ సిస్టమ్‌, డ్యుయల్‌ ఛానల్‌ డాష్‌క్యామ్‌, అంబియంట్‌ లైటింగ్‌ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.

ఇంటీరియర్‌ - ఫీచర్లు

5+2 సీటింగ్‌ సెటప్‌తో ఫ్యామిలీకి సరిపోయేలా డిజైన్‌ చేశారు. డ్యాష్‌బోర్డ్‌లో 3-స్పోక్‌ ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ నాబ్స్‌, పెద్ద స్టోరేజ్‌ స్పేస్‌ ఉంటుంది. పై వేరియంట్లలో 8 ఇంచుల టచ్‌స్క్రీన్‌, 7 ఇంచుల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్ప్లే లభిస్తుంది.

వైర్‌లెస్‌ Apple CarPlay, Android Auto, పుష్‌ బటన్‌ స్టార్ట్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, ఆటోమేటిక్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, రైన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్‌ AC వెంట్స్‌, TPMS, రివర్స్‌ కెమెరా, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఆధునిక ఫీచర్లు అందిస్తున్నారు.

ఇంజిన్‌ - మైలేజ్‌

1.0 లీటర్‌ 3-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఇస్తున్నారు. ఇది 72hp పవర్‌, 96Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉన్నాయి.

మైలేజ్‌ విషయానికి వస్తే (కంపెనీ డేటా ప్రకారం)

మాన్యువల్‌ వెర్షన్‌ - 19.3 kmpl

AMT వెర్షన్‌ - 19.6 kmpl

త్వరలో డీలర్‌-ఫిట్‌ డ్యుయల్‌ సిలిండర్‌ CNG కిట్‌ను కూడా అందించనున్నారు, ఈ వెర్షన్‌ను మాన్యువల్‌ గేర్‌బాక్స్‌లో మాత్రమే అందుబాటులోకి తెస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు

హైదరాబాద్‌, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నిస్సాన్‌ గ్రావైట్‌ ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.5.65 లక్షలు. ఆన్‌రోడ్‌ ధర.. రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌పై ఆధారపడి సుమారు రూ.6.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

తక్కువ బడ్జెట్‌లో లేటెస్ట్‌ 7 సీటర్‌ ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి నిస్సాన్‌ గ్రావైట్‌ మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. అందుబాటు ధర, ఫీచర్లు, దీర్ఘకాల వారంటీ కలయికతో మార్కెట్‌లో మంచి పోటీ ఇచ్చే సూచనలు ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget