అన్వేషించండి

ఇన్నాళ్లకు రేటెంతో చెప్పారు.. మారుతి ఎలక్ట్రిక్‌ SUV ఇ విటారా ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభం

మారుతి తొలి ఎలక్ట్రిక్‌ SUV ఇ విటారా ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ రెంటల్‌ మోడల్‌, 543 కి.మీ. రేంజ్‌, 8ఏళ్ల వారంటీ, హైదరాబాద్‌-విజయవాడ ధరల వివరాలు తెలుసుకోండి.

Maruti e Vitara Price And Specifications: జనాన్ని చాలా కాలం వెయిట్‌ చేయించిన మారుతి సుజుకి, తన తొలి ఎలక్ట్రిక్‌ SUV e Vitaraను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా ప్రకటించింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ధరలో బ్యాటరీ ధర కలపలేదు. కంపెనీ బ్యాటరీని రెంటల్‌ మోడల్‌లో అందిస్తోంది.

బ్యాటరీ రెంటల్‌ ఎలా ఉంటుంది?

ఇ విటారా కోసం కస్టమర్లు బ్యాటరీని విడిగా అద్దెకు తీసుకోవాలి. ప్రతి కిలోమీటర్‌కు రూ.3.99 చెల్లించాలి. ప్రస్తుతం రూ.21,000తో బుకింగ్స్‌ ఓపెన్‌ చేశారు. మార్చి 31, 2026 వరకు ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు కూడా అందిస్తున్నారు.

బ్యాటరీ ఆప్షన్లు - రేంజ్‌ ఎంత?

ఈ SUV రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.

49kWh బ్యాటరీ - 144hp పవర్‌, 440 కి.మీ. ARAI రేంజ్‌

61kWh బ్యాటరీ - 174hp పవర్‌, 543 కి.మీ. ARAI రేంజ్‌

రెండు వేరియంట్లలో కూడా 189Nm టార్క్‌ ఉంటుంది. ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ సెటప్‌తో అందిస్తున్నారు. Delta, Zeta, Alpha ట్రిమ్‌లలో లభిస్తుంది. Delta ట్రిమ్‌లో 49kWh బ్యాటరీ మాత్రమే ఉండగా, Zeta & Alphaలో 61kWh బ్యాటరీ ఉంటుంది.

ఛార్జింగ్‌ టైమ్‌ ఎంత?

7.4kW AC ఛార్జర్‌తో 10% నుంచి 80% వరకు

49kWh వెర్షన్‌ - 6.5 గంటలు

61kWh వెర్షన్‌ - 9 గంటలు

ఫాస్ట్‌ DC ఛార్జర్‌ (70kW వరకు సపోర్ట్‌) ఉపయోగిస్తే కేవలం 45 నిమిషాల్లోనే 10% నుంచి 80% వరకు ఛార్జ్‌ అవుతుంది. కంపెనీ 7.4kW AC ఛార్జర్‌ను ఉచిత ఇన్‌స్టాలేషన్‌తో ఇస్తోంది.

వారంటీ - బైబ్యాక్‌ ప్లాన్‌

బ్యాటరీపై 8 ఏళ్ల లేదా 1,60,000 కి.మీ. వారంటీ ఇస్తున్నారు. వాహనంపై 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. అదనపు ఖర్చుతో 5 ఏళ్ల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ తీసుకోవచ్చు. 3 ఏళ్లు/45,000 కి.మీ. ప్లాన్‌లో 60% బైబ్యాక్‌ విలువ, 4 ఏళ్లు/60,000 కి.మీ. ప్లాన్‌లో 50% బైబ్యాక్‌ విలువ హామీ ఇస్తున్నారు.

డిజైన్‌ - ఫీచర్లు

Auto Expo 2023లో చూపించిన eVX కాన్సెప్ట్‌ ఆధారంగా ఇ విటారాను SUVని రూపొందించారు. ముందుభాగంలో LED హెడ్‌ల్యాంప్స్‌, బ్యాటరీ కూలింగ్‌ కోసం ఓపెన్‌-క్లోజ్‌ అయ్యే గ్రిల్‌ షట్టర్లు ఉన్నాయి. పక్కన 18 ఇంచుల అలాయ్‌ వీల్స్‌, వెనుక LED టెయిల్‌ల్యాంప్స్‌ కనెక్టెడ్‌ డిజైన్‌తో కనిపిస్తాయి.

ఇంటీరియర్‌లో బ్రౌన్‌-బ్లాక్‌ డ్యూయల్‌ టోన్‌ థీమ్‌, 10.25 ఇంచుల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్ప్లే, 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్‌, Apple CarPlay, Android Auto, Infinity సౌండ్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, గ్లాస్‌ సన్‌రూఫ్‌, అంబియంట్‌ లైటింగ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, 10-వే పవర్డ్‌ డ్రైవర్‌ సీట్‌, Level 2 ADAS వంటి ఆధునిక ఫీచర్లు అందిస్తున్నారు.

భద్రత పరంగా 7 ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీ కెమెరా, TPMS, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ ఉన్నాయి. BNCAP నుంచి 5-స్టార్‌ రేటింగ్‌ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు

హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.10.99 లక్షలు. ఆన్‌రోడ్‌ ధర రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, ఇతర ఛార్జీలపై ఆధారపడి సుమారు రూ.12.50 లక్షల వరకు ఉండొచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం సమీప మారుతి నెక్సా డీలర్‌ను సంప్రదించండి.

పోటీ కార్లు ఏవి?

ఇ విటారా, ఇప్పుడు, Toyota Ebella, Hyundai Creta Electric, MG ZS EV, Tata Curvv EV, Mahindra BE 6 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

మారుతి సుజుకీ, ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టినా, బ్యాటరీ రెంటల్‌ మోడల్‌తో కొత్త ప్రయోగం చేసింది. యూజర్లు ఈ కొత్త ప్లాన్‌ను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget