అన్వేషించండి

Kia Hybrid SUVs: అనంతపురం నుంచి సరికొత్త హంగులతో రానున్న సెల్టోస్‌, సోరెంటో! త్వరలోనే కియో హైబ్రిడ్‌ ఎస్‌యూవీ సందడి!

Kia Hybrid SUVs:కియా ఇండియా సరికొత్త హంగులతో రెండు వాహనాలను భారత్ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. మెరుగైన మైలేజ్, అధునాతన ట్రినిడీ డిస్‌ప్లే, గ్లోబల్‌ కే3 ప్లాట్‌ఫామ్‌తో ఈ వాహనాలు అలరించనున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కియా హైబ్రిడ్ వాహనాల వైపు దృష్టి సారిస్తోంది.
  • సోరెంటో 7-సీటర్ హైబ్రిడ్ 2026లో విడుదల కానుంది.
  • సెల్టోస్ హైబ్రిడ్ 2027లో 25 కి.మీ. మైలేజీతో రానుంది.
  • అనంతపురంలో బ్యాటరీల తయారీతో ధరల తగ్గింపు ప్రణాళిక.

Kia Hybrid SUVs:భారత ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రవేసుకున్న కియా ఇప్పుడు గ్రీన్‌ మొబిలిటీ దిశగా భారీగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌, డీజిల్ ఇంజన్లకే పరిమితం కాకుండా, రాబోయే కాలంలో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రధానంగా మార్చుకోవాలని కియా నిర్ణయించుకుంది. ముఖ్యంగా భారత మార్కెట్‌లో అత్యంత ఆదరణ పొందిన సెల్టోస్‌ ఎస్‌యూవీలో హైబ్రిడ్‌ వెర్షన్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

భారత్‌లో ఉద్గారాల నిర్వహణ రూల్స్ కఠింగా మారుతున్నాయి. దీనికి తోడు వినియోగదారులు కూడా తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. డీజిల్‌ ఇంజన్లపై శ్రద్ధను తగ్గించి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. హైబ్రిడ్‌ పవర్ ట్రెయిన్‌ల మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతాయని కియా భావిస్తోంది. వీటి వల్ల మార్కెట్‌లో పోటీలో నిలబడటమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసినట్టు అవుతుందని, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అవసరం లేకుండా ఈవీ అనుభూతి అందిస్తాయని ఆలోచిస్తోంది. 

కియా తన ఇన్వెస్టర్ మీటింగ్‌లో 2030 నాటికి తన విక్రయాల్లో 25 శాతాన్ని హైబ్రిడ్‌ వాహనాల ద్వారా సాధించాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందు కోసం కంపెనీ భారీగా లోకలైజేషన్‌పై దృష్టి పెట్టింది. బ్యాటరీ ప్యాక్‌లు, మోటార్లు, ఎలక్ట్రానిక్‌ భాగాలను భారత్‌లోనే తయారు చేయడం ద్వారా ధరలను అందుబాటులో ఉంచాలని కియా భావిస్తోంది. 

సోరెంటో హైబ్రిడ్‌తో మొదటి అడుగు వేసిన కియా 

భారత్‌లో కియా విడుదల చేయబోయే తొలి హైబ్రిడ్‌ ఎస్‌యూవీ సోరెంటో 7 సీటర్‌ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షలు జరుపుతోంది. సోరెంటో ఒక ప్రీమియం డీ-ఎస్‌యూవీ విభాగంలో వస్తుంది. ఇది బాక్సీ లుక్, టైగర్ నోస్ గ్రిల్, టీ షేప్డ్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో గంభీరంగా కనిపిస్తుంది. దీని లోపల 12.3 అంగుళాల డ్యూయల్ స్క్రీన్‌, బోస్ సౌండ్ సిస్టమ్‌, లెవల్ 2 అడాస్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి.

ఇందులో 1.5 లీటర్ల హైబ్రిడ్‌ ఇంజన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ చిన్న బ్యాటరీ ప్యాక్‌తో కలిసి పని చేస్తుంది. దీనికి సీవీటీ లేదా డీసీటీ గేర్ బాక్స్ జత చేయవచ్చు. సోరెంటో హైబ్రిడ్‌ ధర పాతిక లక్షల నుంచి 35 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. ఇది 2026 పండగ సీజన్ నాటికి మార్కెట్‌లోకి రానుంది. 

నెక్స్ట్‌ జనరేషన్ సెల్టోస్‌ 2027 హైబ్రిడ్‌

కియా ఇండియాకు వెన్నముక వంటి సెల్టోస్ ఇప్పుడు రెండో తరంలోకి అడుగు పెడుతోంది. 2027 మోడ్ సెల్టోస్ ేవలం హైబ్రిడ్‌ ఇంజన్‌కే పరిమితం కాకుండా డిజైన్, టెక్నాలజీ పరంగా పూర్తిగా మారిపోనుంది. ఇది గ్లోబల్‌ కే 3 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది. దీని వల్ల వాహనం పటుత్వం 20 శాతం పెరుగుతుంది. ఇది భద్రతను మెరుగుపరుస్తుంది. దీని పొడవు 4, 460 ఎంఎం ఉంది. 2,690 ఎంఎం వల్ల వెనుక సీట్లో కూర్చొనే ప్రయాణికులకు లెగ్ రూమ్ పెరుగుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్‌ 206 ఎంఎంకు పెరిగింది. ఇది ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. 

సెల్టోస్‌ ఇంటీరియర్‌లో అతి పెద్ద ఆకర్షణ ట్రినిడీ డిస్‌ప్లే. ఇది దాదాపు 30 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. 12.3 అంగుళాల ఇన్‌ఫ్‌టైన్‌మెంట్‌ స్క్రీన్, 123 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లై. ఐదు అంగుళాల ప్రత్యేక క్లైమేట్ కంట్రోల్‌ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో వెనిలేటెడ్‌ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, సాఫ్ట్‌ టచ్‌ మెటీరియల్స్ సౌకర్యాలు ఉన్నాయి. 

హైబ్రిడ్ ఇంజిన్ మైలేజు ఎలా ఉంటుంది?

గ్లోబల్ మార్కెట్‌లో 1.6 లీటర్‌ ఇంజిన్ ఉన్నప్పటికీ భార్త కోసం కియా 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేసే ఛాన్స్ ఉంది. సెల్టోస్ లీటరుకు 0 నుంచి 25 కిలోమీటర్ల మైలేజు ఇవ్వగలదు. సెల్టోస్ మొదటిసారిగా ఎలక్ట్రిక్ అలోవీల్ డ్రైవ్‌ సిస్టమ్ పరిచయం చేయనుంది. ఇందులో వెనుక చక్రాలకు ప్రత్యేక ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తి అందుతుంది. రఫ్‌ రోడ్లలో కూడా వాహనాన్ని అదనపు గ్రిప్ లభిస్తుంది. 

 అనంతపురంలో తయారీ- ధర సంగతి ఏంటీ?

హైబ్రిడ్‌ వాహనాల ధరలు పెరగకుండా ఉండేందుకు కియా ఎక్సైడ్‌  ఎనర్జీ సొల్యూషన్స్‌ో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లోనే లిథియం- ఐరన్‌- పాస్పేట్‌ బ్యాటరీ సెల్స్‌ను తయారు చేయనున్నారు. LFP బ్యాటరీలు భారత వాతావరణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా తక్కువ ధరలో లభిస్తాయి. దీన్ని 2026 చివరి నాటికి విడుదల చేస్తారు. దీని ధర 18 లక్షల నుంచి పాతిక లక్షల మధ్య ఉంటుంది. 

Frequently Asked Questions

భారత మార్కెట్ లో కియా యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

కియా గ్రీన్ మొబిలిటీ వైపు దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రధానంగా మార్చుకోవాలని, 2030 నాటికి తమ అమ్మకాలలో 25% హైబ్రిడ్ వాహనాల ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ లో కియా విడుదల చేయబోయే మొదటి హైబ్రిడ్ SUV ఏది?

భారత్ లో కియా విడుదల చేయబోయే తొలి హైబ్రిడ్ SUV సోరెంటో 7 సీటర్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షలు జరుపుతోంది.

కియా సెల్టోస్ హైబ్రిడ్ ఎప్పుడు మార్కెట్లోకి రానుంది?

కియా సెల్టోస్ యొక్క నెక్స్ట్ జనరేషన్ మోడల్ 2027 నాటికి హైబ్రిడ్ ఇంజిన్ తో రానుంది. ఇది డిజైన్, టెక్నాలజీ పరంగా కూడా మార్పులతో రానుంది.

హైబ్రిడ్ వాహనాల ధరలను అందుబాటులో ఉంచడానికి కియా ఏమి చేస్తోంది?

కియా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా అనంతపురం ప్లాంట్ లోనే లిథియం- ఐరన్- పాస్పేట్ బ్యాటరీ సెల్స్ ను తయారు చేయనుంది.

టాప్ హెడ్ లైన్స్

కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget