అన్వేషించండి

Kia India March 2026 Offers: కియా కార్లపై మార్చి ధమాకా ఆఫర్లు: సెల్టోస్, సోనెట్, కార్నివాల్‌పై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్!

Kia India March 2026 Offers: ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ కియా ఇండియా తన ఎస్‌యూవీ (SUV), ఎమ్‌పీవీ (MPV) మోడళ్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా లక్ష రూపాయల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కియా ఇండియా మార్చి 2026 వరకు కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది.
  • కియా కార్నివాల్‌పై రూ. 1 లక్ష వరకు, క్యారెన్స్ క్లావిస్ ఈవీపై రూ. 90,000 వరకు బెనిఫిట్స్.
  • సైరోస్, సెల్టోస్, క్యారెన్స్ మోడల్స్‌పై రూ. 40,000 నుంచి రూ. 60,000 వరకు తగ్గింపులు.
  • సోనెట్ ఎస్‌యూవీపై రూ. 35,000 వరకు ఆఫర్లు, మార్చి నెలాఖరు వరకు మాత్రమే.

Kia India March 2026 Offers: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా, మార్చి 2026 నెలకు సంబంధించి తన కార్ల లైనప్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను విడుదల చేసింది. ఎస్‌యూవీలు, ఎమ్‌పీవీల అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా ఈ లిమిటెడ్ పీరియడ్ డీల్స్ తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. డీలర్ల వద్ద ఉన్న స్టాక్, నగరం, కస్టమర్ అర్హతను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు.

కియా కార్నివాల్ (Kia Carnival)

కియా ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన కార్నివాల్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో నేరుగా క్యాష్ డిస్కౌంట్ లేకపోయినా, పాత కారు మార్పిడిపై వచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ స్కీమ్స్ ద్వారా భారీగా పొదుపు చేయవచ్చు. లగ్జరీ ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.

కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ (Carens Clavis EV)

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన పట్టును పెంచుకునేందుకు కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీపై రూ. 90,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రయాణం కోరుకునే ఈవీ ప్రియులకు ఇది మంచి ఆప్షన్. దీని ఐసీఈ (ICE) వెర్షన్ అయిన క్యారెన్స్ క్లావిస్‌పై కూడా రూ. 80,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.

కియా సైరోస్ (Kia Syros), సెల్టోస్ (Seltos)

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కియా సైరోస్ మోడల్‌పై రూ. 60,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. పాపులర్ మోడల్ కియా సెల్టోస్‌పై రూ. 40,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. సెల్టోస్ విషయంలో నేరుగా ధర తగ్గించకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీల వంటి వాల్యూ-యాడెడ్ ఆఫర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. సాధారణ కియా క్యారెన్స్ మోడల్‌పై కూడా రూ. 40,000 వరకు తగ్గింపు లభిస్తోంది.

కియా సోనెట్ (Kia Sonet) 

చిన్న ఎస్‌యూవీ విభాగంలో క్రేజ్ ఉన్న కియా సోనెట్‌పై మొత్తం రూ. 35,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో పాటు అర్హతను బట్టి స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్లు కేవలం మార్చి నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాల కోసం దగ్గరలోని కియా షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

మార్చి 2026లో కియా కార్లపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి?

మార్చి 2026 నెలకు గాను కియా ఇండియా తన కార్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

కియా కార్నివాల్‌పై ఎంతవరకు ప్రయోజనం పొందవచ్చు?

కియా ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన కార్నివాల్‌పై ఈ నెలలో రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్ లేకపోయినా, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ స్కీమ్స్ ద్వారా ఆదా చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలలో కియా ఏ మోడల్‌పై ఆఫర్లు అందిస్తోంది?

కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీపై రూ. 90,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి.

కియా సెల్టోస్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

పాపులర్ మోడల్ కియా సెల్టోస్‌పై రూ. 40,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నేరుగా ధర తగ్గింపు కాకుండా, ఎక్స్ఛేంజ్ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి ఆఫర్లు ఉన్నాయి.

కియా సోనెట్‌పై ప్రయోజనాలు ఎలా ఉంటాయి?

చిన్న ఎస్‌యూవీ అయిన కియా సోనెట్‌పై రూ. 35,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా అర్హతను బట్టి పొందవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget