అన్వేషించండి

Kia Sonet : కియా సోనెట్ ధమాకా: తక్కువ ధరకే ఆటోమేటిక్ వేరియంట్లు.. కొత్త కలర్ కూడా వచ్చేసింది!

Kia Sonet:కియా పాపులర్ మోడల్ సోనెట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని ఇప్పుడు తక్కువ ధర కలిగిన బేస్ వేరియంట్లలో కూడా ప్రవేశపెట్టింది. డీజిల్ ఆటోమేటిక్ ధరలు రూ. 9.77 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కియా సోనెట్ ఆటోమేటిక్ టెక్నాలజీని తక్కువ ధర వేరియంట్లలో అందిస్తోంది.
  • డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లు రూ. 9.77 లక్షల నుండి ప్రారంభమవుతాయి.
  • కొత్త డీజిల్, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు, మ్యాగ్మా రెడ్ రంగు అందుబాటులోకి వచ్చాయి.
  • 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.

Kia Sonet : కియా సోనెట్ కొత్త వేరియంట్లతో సామాన్యులకు మ‌రింత‌ చేరువ‌య్యేలా ఆటోమేటిక్ టెక్నాలజీని అందిస్తోంది. భారతీయ వాహన రంగంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కియా సోనెట్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు సోనెట్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలంటే కేవలం హెచ్‌టీఎక్స్, జీటీఎక్స్ వంటి ఖరీదైన టాప్ ఎండ్ వేరియంట్లను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండేది. వినియోగదారుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని, కియా సంస్థ ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తక్కువ ధర వేరియంట్లలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కార్ మార్కెట్లో విప్ల‌వాత్మ‌క మార్పు అని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే చాలా పోటీ ఉన్న కార్ల రంగంలో కియా వేసిన ఎత్తుల‌తో మార్కెట్ మ‌రింత కాంపిటీటివ్ గా మారింద‌ని అంటున్నారు. 

ధరల వివరాలు

కొత్తగా ప్రవేశపెట్టిన సోనెట్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు రూ. 9.77 లక్షల (ఎక్స్ షోరూమ్) నుండి ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 9.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ మార్పు వల్ల డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్లు గతంతో పోలిస్తే సుమారు రూ. 2.25 లక్షలు, పెట్రోల్ వెర్షన్లు రూ. 1.7 లక్షల వరకు తక్కువ ధరకే లభిస్తున్నాయి. మార్కెట్లోని ఇతర పోటీదారులైన హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో పోలిస్తే, సోనెట్ ఇప్పుడు అత్యంత సరసమైన ధరలో డీజిల్ ఆటోమేటిక్ కాంబినేషన్‌ను అందిస్తోందని, దీని ద్వారా వినియోగ‌దారుల‌కు మ‌రింత స‌ర‌స‌మైన ధ‌ర‌లోనే అద్భుతైమ‌న కార్లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

కొత్త వేరియంట్లు ,రంగులు

కియా సంస్థ డీజిల్ ఆటోమేటిక్ విభాగంలో హెచ్‌టీఈ (ఓ), హెచ్‌టీకే (ఓ), హెచ్‌టీకే ప్లస్ మరియు హెచ్‌టీకే ప్లస్ (ఓ) అనే నాలుగు కొత్త ట్రిమ్‌లను పరిచయం చేసింది. టర్బో పెట్రోల్ విభాగంలో హెచ్‌టీకే (ఓ) ,హెచ్‌టీకే ప్లస్ (ఓ) అనే రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. వేరియంట్లతో పాటు, కియా ఇప్పుడు సోనెట్‌లో సరికొత్త మ్యాగ్మా రెడ్ రంగును కూడా ప్రవేశపెట్టింది. ఇది కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ల వ‌ల్ల కార్ మార్కెట్లో త‌న స్థానాన్ని మ‌రింత మెరుగు ప‌ర్చుకునే అవ‌కాశం కియాను ల‌భిస్తుంద‌ని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్య‌క్తం చేశాయి. 

ఇంజిన్ సామర్థ్యం

సోనెట్‌లో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పి శక్తిని, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పి శక్తిని, 250 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తూ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. సాధారణ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తానికి ఆటోమేటిక్ కార్లను ఇష్టపడే మధ్యతరగతి వినియోగదారులకు కియా తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని, మ‌రిన్ని కార్ల వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయ‌ని పేర్కొంటున్నారు.               

Frequently Asked Questions

కియా సోనెట్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు ఎంత?

కొత్త సోనెట్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లు రూ. 9.77 లక్షల నుండి, టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లు రూ. 9.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి.

కియా సోనెట్ కొత్త వేరియంట్లలో ఏయే రంగులు అందుబాటులో ఉన్నాయి?

కొత్త వేరియంట్లతో పాటు, కియా సోనెట్ లో సరికొత్త మ్యాగ్మా రెడ్ రంగును కూడా ప్రవేశపెట్టింది.

కియా సోనెట్ లో ఇంజిన్ సామర్థ్యం ఎంత?

సోనెట్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పి, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పి శక్తిని అందిస్తాయి.

కియా సోనెట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఏ వేరియంట్లలో అందుబాటులో ఉంది?

గతంలో ఖరీదైన టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇప్పుడు తక్కువ ధర వేరియంట్లలో కూడా లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Top 10 Best Selling SUVs: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌
గత 6 నెలల్లో జనం ఎక్కువగా కొన్న టాప్‌ 10 కార్లు.. వీటికి ఫుల్‌ డిమాండ్‌, మీ బడ్జెట్‌లోనే!
కేటీఎం డ్యూక్, టీవీఎస్ అపాచీకి గట్టి పోటీ.. Kawasaki Z300 లాంచ్‌.. ఈ బండి ప్రత్యేకతలు ఇవే!
యూత్‌ చేతికి కొత్త బండి.. స్పోర్టీ 296cc ఇంజిన్, 39hp పవర్‌తో Kawasaki Z300 ఎంట్రీ

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Teja Sajja : US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
US అమ్మాయితో పెళ్లి - కన్ఫర్మ్ చేసిన తేజ సజ్జా... డెస్టినేషన్ వెడ్డింగ్ ఎప్పుడంటే?
IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
Embed widget