అన్వేషించండి

కేవలం రూ.7.5 లక్షల నుంచే ఎలక్ట్రిక్‌ కార్లు - మీ ఊర్లో దర్జాగా తిరగడానికి చవకైన EVలు!

తక్కువ రన్నింగ్ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న 5 అత్యంత తక్కువ ధర EVల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Cheapest EV Cars 2026: ఇండియాలో ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు రెండో కారు కోసం మాత్రమే EVలను చూసేవారు. కానీ ఇప్పుడు మొదటిసారి కారు కొనేవాళ్లు కూడా ఎలక్ట్రిక్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో రోజువారీ ప్రయాణం ఎక్కువగా ఉండే వారికి తక్కువ రన్నింగ్ ఖర్చు పెద్ద ప్లస్ పాయింట్. ఇంట్లో లేదా ఆఫీస్‌లో చార్జింగ్ సౌకర్యం ఉంటే EV మరింత ప్రయోజనకరం.

ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడవుతున్న అత్యంత తక్కువ ఎక్స్‌-షోరూమ్‌ ధర కలిగిన 5 ఎలక్ట్రిక్‌ కార్ల వివరాలు ఇవే.

1) ఎంజీ కామెట్ EV (MG Comet EV)

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ. 7.50 లక్షలు - రూ. 10 లక్షలు

బ్యాటరీ సైజ్‌ - 17.3kWh
కంపెనీ చెబుతున్న రేంజ్‌ (MIDC)  - 230km
పవర్‌/టార్క్‌ - 42hp/110Nm

ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న ఎలక్ట్రిక్‌ కారు ఎంజీ కామెట్ EV. చిన్న సైజ్‌ కారణంగా సిటీ ట్రాఫిక్‌లో చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు, సులభంగా మలుపులు తీసుకోవచ్చు. కేవలం రెండే తలుపులు ఉన్నా నలుగురు పెద్దలకు సరిపడా స్పేస్ ఉంటుంది. అయితే చిన్న బ్యాటరీ ప్యాక్ ఉండటంతో రేంజ్ పరిమితంగా ఉంటుంది. 12 అంగుళాల చిన్న వీల్స్ కారణంగా రోడ్ గుంతలపై రైడ్ కంఫర్ట్ అంత గొప్పగా అనిపించకపోవచ్చు. అయినా నగర వినియోగానికి ఇది సరైన ఎంపిక.

2) టాటా టియాగో EV (Tata Tiago EV)

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ. 7.99 లక్షలు - రూ. 11.14 లక్షలు
బ్యాటరీ సైజ్‌ - 19.2kWh, 24kWh
కంపెనీ చెబుతున్న రేంజ్‌ (MIDC)  - 221km, 275km
పవర్‌/టార్క్‌ - 61hp/110Nm, 74hp/114Nm

నాలుగు తలుపుల ప్రాక్టికల్ హ్యాచ్‌బ్యాక్‌గా టియాగో EV మంచి ఆప్షన్. ఎలక్ట్రిక్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టే వారికి ఇది సరైన ఎంట్రీ లెవల్ ఎంపిక. స్మూత్ పవర్ డెలివరీ, మంచి రైడ్ కంఫర్ట్ దీని ప్రత్యేకత. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు సరిపడే పనితీరు ఇస్తుంది. అయితే స్పోర్టీ పనితీరు ఆశించే వారికి ఇది కొంచెం సాదాసీదాగా అనిపించవచ్చు.

3) టాటా పంచ్ EV (Tata Punch EV)

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ. 9.69 లక్షలు - రూ. 12.59 లక్షలు
బ్యాటరీ సైజ్‌ - 30kWh, 40kWh
కంపెనీ చెబుతున్న రేంజ్‌ (MIDC)  - 375km, 468km
పవర్‌/టార్క్‌ - 88hp/154Nm, 129hp/154Nm

టాటా బ్రాండ్‌లో అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్‌ SUV పంచ్ EV. రెండు LFP బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ వేరియంట్‌లో గరిష్టంగా 468 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తున్నారు. చిన్న బ్యాటరీ వేరియంట్‌లో సుమారు 375 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 3.3 కిలోవాట్ AC చార్జర్‌తో 10 నుంచి 100 శాతం చార్జ్ కావడానికి చిన్న బ్యాటరీకి సుమారు 11.9 గంటలు, పెద్ద బ్యాటరీకి 14.8 గంటలు పడుతుంది. మంచి కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లు, సరిపడా పనితీరు ఈ కారును ఫ్యామిలీ యూజ్‌కు అనుకూలంగా మారుస్తాయి.

4) టాటా టిగోర్ EV (Tata Tigor EV)

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ. 12.49 లక్షలు - రూ. 13.75 లక్షలు
బ్యాటరీ సైజ్‌ - 26kWh
కంపెనీ చెబుతున్న రేంజ్‌ (MIDC)  - 315km
పవర్‌/టార్క్‌ - 75hp/170Nm

ఈ జాబితాలో ఉన్న ఏకైక సెడాన్ టిగోర్ EV. టియాగో EVతో పోలిస్తే పెద్ద బూట్ స్పేస్ ఇస్తుంది. కొంచెం పెద్ద బ్యాటరీ కారణంగా రేంజ్ కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే ధరలో టియాగో EV కంటే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. అయినా మంచి రైడ్ కంఫర్ట్, ఫీచర్ ప్యాక్ కేబిన్, స్మూత్ పవర్‌ట్రైన్ దీని బలాలు.

5) సిట్రోయెన్ eC3 (Citroen eC3)

ఎక్స్‌-షోరూమ్‌ ధర: రూ. 12.90 లక్షలు - రూ. 13.53 లక్షలు
బ్యాటరీ సైజ్‌ - 29.2kWh
కంపెనీ చెబుతున్న రేంజ్‌ (MIDC)  - 320km
పవర్‌/టార్క్‌ - 57hp/143Nm

C3 హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్‌ వేరియంట్ eC3. బాక్సీ డిజైన్ కారణంగా లోపల విస్తృతమైన స్పేస్ ఉంటుంది. సిట్రోయెన్ కార్లకు పేరున్న రైడ్ కంఫర్ట్ ఇందులో కూడా కనిపిస్తుంది. ఫీచర్ల పరంగా కొంచెం పరిమితంగానే ఉన్నా, నిజ జీవిత రేంజ్ మాత్రం పంచ్ EVతో పోలిస్తే దగ్గరగా ఉంటుంది. మంచి డిస్కౌంట్లు ఉన్నప్పుడు కొంటే ఇది కూడా ఒక సరైన ఎంపికగా మారుతుంది.

తక్కువ రన్నింగ్ ఖర్చు, సైలెంట్ డ్రైవ్ అనుభవం, పర్యావరణానికి మేలు - ఇవన్నీ కలిపి చూస్తే ఎలక్ట్రిక్‌ కార్లు నగర జీవనశైలికి బాగా సరిపోతాయి. ఇంటి చార్జింగ్ సదుపాయం ఉంటే ఈ మోడళ్లలో ఏదైనా ఒకటి మీ బడ్జెట్‌కు తగ్గట్టు ఎంపిక చేసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget