MINI Countryman SE All4 : ఒకసారి ఛార్జ్ చేస్తే 440 km ఆగకుండా దూసుకెళ్లే సామర్థ్యంతో వచ్చిన MINI Countryman SE All4; ఫీచర్లు, ధర గురించి తెలుసుకోండి
MINI Countryman SE All4 : మిని కంట్రీమన్ SE All4 భారత్ లో విడుదలైంది. 440కిమీ పరిధి, 4-వీల్ డ్రైవ్ తో వస్తుంది. ధర, ఫీచర్లు, బ్యాటరీ వివరాలు చూడండి.

MINI Countryman SE All4 : బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MINI భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ SUV Countryman SE All4 ని విడుదల చేసింది. కంపెనీ దీని ప్రారంభ ధరను రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ SUV ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సాంకేతికతతో వస్తుంది. భారతదేశంలో పూర్తిగా నిర్మించిన యూనిట్ (CBU)గా తీసుకొచ్చారు. MINI తన అన్ని డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లను ప్రారంభించింది డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.
డిజైన్ ఎలా ఉంది?
కొత్త MINI Countryman SE All4 డిజైన్ కంపెనీ క్లాసిక్ గుర్తింపును నిలుపుకుంటూ ఆధునిక అంశాలతో అలంకరించారు. దీని రూపాన్ని సాధారణంగా ఉంచినప్పటికీ, ప్రీమియం, స్పోర్టీగా ఉంది. వెడల్పాటి బాడీ స్టాన్స్, పెద్ద హెగ్సాగోనల్ గ్రిల్ యాంగిల్డ్ LED హెడ్‌లైట్‌లు దీనికి శక్తివంతమైన రూపాన్ని ఇస్తాయి. SUV రెండు రంగులలో అందిస్తున్నారు. లెజెండ్ గ్రే - మిడ్‌నైట్ బ్లాక్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. కారులో 19-అంగుళాల JCW రన్‌వే స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.
విలాసవంతమైన ఇంటీరియర్- హై-టెక్ ఫీచర్లు
లోపలి భాగానికి వస్తే, MINI Countryman SE All4, ఇంటీరియర్‌ను చాలా ప్రీమియం, స్థిరంగా చేసింది. ఇది లెదర్-ఫ్రీ మెటీరియల్‌ను ఉపయోగిస్తుంది, ఇది పర్యావరణ అనుకూలంగా చేస్తుంది. క్యాబిన్‌లో JCW డిటైలింగ్, బ్లాక్ స్పోర్ట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. కారులో 360° కెమెరా సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెన్స్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC) వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే ABS, బ్రేక్ అసిస్ట్, రియర్-వ్యూ కెమెరా వంటి భద్రతా సాంకేతికతలు కూడా ఉన్నాయి.
శక్తివంతమైన పనితీరు, ఎక్కువ దూరం
MINI Countryman SE All4 రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంది, ఇవి 66.45 kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతాయి. ఈ SUV 313 bhp శక్తిని, 494 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ కారు కేవలం 5.6 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకోగలదు. రేంజ్ పరంగా కూడా ఇది తగ్గేదేలే అన్నట్టు ఉంది. WLTP చక్రం ప్రకారం, ఈ SUV 440 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహాయంతో, దీనిని కేవలం 29 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.
భద్రత -డ్రైవ్ అసిస్టెన్స్
Countryman SE All4 భద్రతపరంగా కూడా చాలా బలంగా తయారు చేశారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ ట్రాక్షన్, స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, పార్కింగ్ అసిస్టెన్స్, 360° వ్యూ వంటి మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్ల కారణంగా, ఈ కారు నగరం, హైవే రెండింటిలోనూ సురక్షితమైన, మృదువైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
వారంటీ -సర్వీస్ ప్యాకేజీ
MINI తన కస్టమర్‌లకు మెరుగైన అమ్మకాల తర్వాత సేవను కూడా అందిస్తోంది. కంపెనీ 5 సంవత్సరాల 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ , 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిమీ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. అదనంగా, 4 సంవత్సరాలు / 2,00,000 కిమీల నుంచి ప్రారంభమయ్యే సర్వీస్ ప్యాకేజీని 10 సంవత్సరాలు / 2,00,000 కిమీ వరకు పొడిగించవచ్చు.





















