అన్వేషించండి

Most Selling 7-Seater Car: 1100 km రేంజ్‌, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 7-సీటర్‌ MPV – దీని ధర ఇంతే!

Best Selling MPV India: మారుతి సుజుకి ఎర్టిగా మరోసారి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ MPVగా నిలిచింది. దాని ధర, ఫీచర్లు, ఇంజిన్ & మైలేజ్ గురించి వివరంగా తెలుసుకుందాం.

7 Seater Family Car Under Rs 12 Lakhs In India: జులై 2025లో, Maruti Suzuki Ertiga 16,604 మంది కొత్త కొనుగోలుదారులను సంపాదించుకుంది, దీంతో ఇది మరోసారి దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ MPVగా నిలిచింది. తక్కువ ధర, ఎక్కువ స్థలం, గొప్ప మైలేజ్ & బ్రాండ్ విలువ దీనిని భారతీయ కుటుంబానికి సరైన కారుగా నిలబెట్టాయి.

మారుతి ఎర్టిగా ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో, ఎర్టిగా యొక్క ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 9.11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది,  వేరియంట్‌ను బట్టి మారుతుంది. దీని బేస్ "LXi పెట్రోల్‌ మ్యాన్యువల్‌" వేరియంట్‌ హైదరాబాద్‌ & విజయవాడలో దాదాపు రూ. 10.95 లక్షల ఆన్-రోడ్‌ రేటులో లభిస్తుంది. CNG వేరియంట్ ధర రూ. 11.15 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. CNG బేస్‌ వేరియంట్‌ను వేరియంట్‌ హైదరాబాద్‌ & విజయవాడలో 13.77 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. పెద్ద ఫ్యామిలీ కారులో బెటర్‌ మైలేజ్‌ కోరుకునే కస్టమర్లకు ఇది బడ్జెట్ ధర అవుతుంది.

ఎర్టిగా - నిజంగా పరిపూర్ణ కుటుంబ MPVనా?
మారుతి ఎర్టిగా, దాని బడ్జెట్‌ ధర లేదా 7-సీటర్ కావడం వల్ల మాత్రమే ఫ్యామిలీ కారు కాలేదు, ఫ్యామిలీకి ఉపయోగకరమైన & స్మార్ట్ ఫీచర్ల ఇంకా చాలా ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే పెద్ద 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఈ కారులో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & వెనుక AC వెంట్స్ వంటి కూలింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ కలిసి వెళ్లేప్పుడు రైడింగ్‌ను ఆహ్లాదభరితంగా మారుస్తాయి. డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేసే క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ & పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ కారు స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ & అలెక్సా సపోర్ట్‌ కూడా అందిస్తుంది.

కుటుంబ సభ్యులకు అదనపు భద్రతలు
మారుతి సుజుకీ, ఎర్టిగా ప్రయాణీకుల భద్రతపై పూర్తి శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు ఈ MPV అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉన్నాయి, ఏదైనా అత్యవసర పరిస్థితిలో కారులోని ప్రయాణీకులకు మరింత భద్రతను అందిస్తాయి. దీంతో పాటు, ఇందులో EBDతో కూడిన ABS & బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) & హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి ప్రతి డ్రైవ్‌ను మరింత సురక్షితంగా ఉంచుతాయి.

ఇంజిన్ & పనితీరు
మారుతి ఎర్టిగా 1.5-లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 101.65 bhp శక్తిని & 136.8 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్ & CNG వేరియంట్‌లలో లభిస్తుంది. CNG వేరియంట్‌లో, ఈ ఇంజిన్ 88 PS పవర్‌ను & 121.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్‌ పరంగా... పెట్రోల్ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. CNG వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వచ్చింది. ఈ పవర్‌ట్రెయిన్ సెటప్ నగరం & హైవే పరిస్థితులలో చాలా మృదువైన & మెరుగైన పనితీరును అందించడానికి వీలు కల్పిస్తుంది.

మైలేజీలో ఛాంపియన్
ఎర్టిగా భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన 7-సీట్ల MPVలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీని పెట్రోల్ & CNG వేరియంట్‌లు అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి. ఎర్టిగాలో 45 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ & 60 లీటర్ల CNG ట్యాంక్ ఉన్నాయి. ఎర్టిగా VXi వేరియంట్‌లో.. పెట్రోల్ & CNG రెండింటినీ ఫుల్‌ ట్యాంక్‌ చేస్తే, ఈ MPV 1000 నుంచి 1100 కిలోమీటర్ల దూరాన్ని సులభంగా కవర్‌ చేయగలదు, పదే పదే ట్యాంక్ నింపాల్సిన అవసరం లేకుండా ప్రయాణాన్ని పూర్తి చేయగలదు.

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget