అన్వేషించండి

Tata Safari Adventure: అగ్రెసివ్‌ లుక్స్‌, లగ్జరీ ఫీచర్లతో టాటా సఫారీ అడ్వెంచర్ వచ్చింది – రేటు ఎంతంటే?

Tata New SUV Launched: టాటా మోటార్స్, భారతదేశంలో కొత్త సఫారీ అడ్వెంచర్ X+ SUVని లాంచ్‌ చేసింది, దీని ప్రారంభ ధర రూ. 19.99 లక్షలు. ఈ బండిలోని మోడరన్‌ ఫీచర్లు & ఇంజిన్ శక్తి గురించి తెలుసుకుందాం.

Tata Safari Adventure Price, Mileage And Features In Telugu: టాటా మోటార్స్, తన పాపులర్‌ SUV 'సఫారీ'లో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. "అడ్వెంచర్ X+" ‍‌(Adventure X+) పేరిట ఆ వేరియంట్‌ను భారతదేశ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అగ్రెసివ్‌ లుక్స్‌లో కనిపిస్తున్న అడ్వెంచర్ X ప్లస్‌ ప్రారంభ ధర (Tata Safari Adventure Price) ను రూ. 19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఇది, పరిచయ ధర & 31 అక్టోబర్ 2025 వరకే ఈ రేటు చెల్లుబాటు అవుతుంది, ఆ తర్వాత మారుతుంది. ఈ వేరియంట్ టాటా సఫారీ Pure X & Accomplished X ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది. అయితే, లక్షణాల పరంగా టాప్ వేరియంట్‌లతో కూడా పోటీ పడుతుంది.

టాటా సఫారీ అడ్వెంచర్ X+ ఫీచర్లు
టాటా సఫారీ అడ్వెంచర్ X+ కంపెనీ ఇచ్చిన గొప్ప & ఆధునిక లక్షణాల కారణంగా దీనిని లగ్జరీ SUVగా చెప్పాలి. సాధారణంగా, చాలా ఖరీదైన వాహనాల్లో కనిపించే అనేక ఫీచర్లు టాటా కొత్త SUVలో కనిపిస్తాయి. ఇందులో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) & 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి, ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా & స్మార్ట్‌గా మారుస్తాయి. ఇంకా, ట్రైల్ హోల్డ్ EPB వంటి చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను సఫారీ అడ్వెంచర్ X+ లో చూడవచ్చు. ఈ SUVలో నార్మల్, రఫ్ & వెట్ విత్ ఆటో హోల్డ్ వంటి మూడు డ్రైవింగ్ మోడ్స్‌ ఉన్నాయి, అవసరాన్ని బట్టి ఒక డ్రైవింగ్‌ మోడ్‌లోకి మారవచ్చు. ఈ కారులో ఎర్గోమాక్స్ డ్రైవర్ సీటును కూడా ఉంది, ఇది మెమరీ & వెల్‌కమ్‌ ఫంక్షన్‌తో వస్తుంది.

పవర్‌ & పనితీరు 
టాటా సఫారీ అడ్వెంచర్ X+ ఇంజిన్ విషయానికి వస్తే.. సఫారీ & హారియర్‌లో ఇప్పటికే ఉపయోగిస్తున్న అదే నమ్మకమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఈ SUVలోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 168 bhp పవర్‌ను & 350 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ SUVని రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో (6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) కొనవచ్చు. ఈ ఫోర్‌వీలర్‌ నగర రోడ్లపైనే కాకుండా ఆఫ్-రోడింగ్ వంటి క్లిష్టమైన రోడ్లపై కూడా శక్తిమంతమైన & మృదువైన పనితీరును అందిస్తుంది.

అడ్వెంచర్ & స్టైల్ కలిసిన కారును కోరుకునే కస్టమర్ల కోసం సఫారీ అడ్వెంచర్ X+ ను ప్రత్యేకంగా రూపొందించామని టాటా మోటార్స్ తెలిపింది. టాప్-స్పెక్‌ వేరియంట్ల స్థాయిలో భారీ ధర చెల్లించకుండానే, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో ప్రత్యేకంగా నిలబడాలనుకునే కస్టమర్లకు ఈ SUV ఒక అద్భుతమైన ఎంపిక. దీని అద్భుతమైన లుక్స్, అధునాతన సాంకేతికత & శక్తిమంతమైన పనితీరు నగర రోడ్లను దాటి కొండలు, గుట్టలు & కష్టతరమైన రోడ్ల మీద కూడా సాఫీగా సాగుతుంది. ADAS భద్రత సాంకేతికతల వల్ల, కారులో ప్రయాణించే కుటుంబ సభ్యులకు బలమైన భద్రత కూడా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Bonneville T40 తో పాటు ట్రయంఫ్ నుంచి 3 కొత్త బైక్‌లు.. 798cc భారీ ఇంజిన్‌తో స్ట్రీట్ ట్రిపుల్ బైక్‌
798cc ఇంజిన్‌తో కొత్త Triumph Street Triple 798 బైక్‌.. Tiger 900, Tiger 1200 బైకుల్లో రాడార్‌ టెక్నాలజీ!
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget