Celerio CNG: కొత్త సెలెరియో వచ్చేసింది.. ఈసారి సీఎన్‌జీతో.. ధర రూ.7 లక్షలలోపే.. మైలేజ్ ఎంతంటే?
మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది.
కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో మనదేశంలో నవంబర్‌లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ భారతీయ కార్ల తయారీ సంస్థ కొత్త సెలెరియోలో సీఎన్‌జీ బై ఫ్యూయల్ ఆప్షన్‌ను లాంచ్ చేసింది. ఈ సీఎన్‌జీ వేరియంట్ ధర మనదేశంలో రూ.6.58 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది.
దీని వీఎక్స్ఐ వేరియంట్‌లో మాత్రమే సీఎన్‌జీ మోడల్ అందుబాటులో ఉంది. అంటే సెలెరియో సీఎక్స్ఐ వేరియంట్ కంటే సీఎన్‌జీ మోడల్ ధర కాస్త ఎక్కువ అన్న మాట. కేజీ సీఎన్‌జీ 35.6 కిలోమీటర్ల మైలేజీని సెలెరియో అందించనుంది.
ఈ సీఎన్‌జీ మోడల్‌లో డీట్యూన్డ్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్‌ను అందించనున్నారు. 56 బీహెచ్‌పీ పవర్, 82 ఎన్ఎం టార్క్‌ను ఇది అందించనుంది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఇందులో అందించారు. సెలెరియో పెట్రోల్ వెర్షన్ 66 బీహెచ్‌పీ 89 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. అంటే సీఎన్‌జీ వేరియంట్ కంటే పెట్రోల్ వేరియంటే శక్తివంతమైనది.
కొత్త సెలెరియో సీఎన్‌జీలో ఏసీ, వెనకవైపు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
#MarutiSuzuki has launched the all-new #Celerio CNG in India at Rs 6.58 lakh (ex-showroom). Available in a single VXi variant, the Celerio comes with a factory-fitted 60 litre CNG fuel tank.
— CarTrade.com (@Car_Trade) January 18, 2022
More details on: https://t.co/68bwqviq8I#CarTrade #CTNews #celeriocng pic.twitter.com/t45Xos3tYT
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?