Maruti Jimny: ఐదు డోర్లతో సరికొత్త డిజైన్‌తో రానున్న మారుతి జిమ్నీ - లుక్ ఎలా ఉందో చూశారా?
ప్రముఖ కార్ల బ్రాండ్ మారుతి తన డిఫరెంట్ కారు జిమ్నీని త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎప్పట్నుంచో వార్తల్లో ఉంటూ ఇప్పటికీ లాంచ్ కాని మిస్టరీ కారు ఏదైనా ఉందా అంటే అది మారుతి జిమ్నీనే. ఈ ఆఫ్‌రోడర్ కారు మొత్తానికి సేల్‌కు రానుంది. కానీ దీని రూపు మారిపోనుంది. కొన్ని ఎంపిక చేసిన విదేశీ మార్కెట్లలో జిమ్నీ ఇప్పటికే అందుబాటులోనే ఉంది. అందులో మూడు డోర్లు, పెట్రోల్ ఇంజిన్ పాత 4-స్పీడ్ ఆటోమేటిక్/5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మోడళ్లు ఉన్నాయి.
మనదేశంలో జిమ్నీ ఐదు డోర్లతో లాంచ్ కానుంది. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండనుంది. ఇది ఇప్పటికే మారుతి కార్లలో అందుబాటులో ఉంది. ఈ ఐదు తలుపుల జిమ్నీ కారులో పొడవైన వీల్ బేస్, డిఫరెంట్ డిజైన్ ఉండనుంది. ముందువైపు, వెనకవైపు డోర్లు ఉండటంతో దీని లుక్ కొత్తగా ఉంది. ఈ కారులో స్పేస్ కూడా ఎక్కువగా ఉండనుంది.
జిమ్నీ ఇప్పటికే మనదేశంలో ఆటో ఎక్స్‌పోలో కనిపించింది. కానీ అది గ్లోబల్ స్పెసిఫికేషన్లతో కనిపించింది. మనదేశంలో దీనికి పలు మార్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో ఉన్న ఐదు డోర్ల సెటప్‌నే ఈ కారుకు అతిపెద్ద ఆకర్షణ. బ్రెజా తరహాలో పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఈ కారులో ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇందులో ఉండనుంది. బ్రెజా తరహాలోనే ఇందులో కూడా మైల్డ్ హైబ్రిడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించే అవకాశం ఉంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. అలాగే ప్రాపర్ 4x4 సిస్టంను కూడా ఇందులో అందించారు.
ఇది ఐదు డోర్ల జిమ్నీ కాబట్టి సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉండనున్నాయి. దీని ప్రైసింగ్ కూడా ప్రీమియం స్థాయిలోనే ఉండనుంది. ఈ కారులో అందించనున్న 1.5 లీటర్ ఇంజినే దీనికి కారణం.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram