Maruti E Vitara Safety Test: భారత్ NCAP సేఫ్టీ టెస్టులో దుమ్మురేపిన మారుతి ఈ విటారా.. సేఫ్టీ ఫీచర్లు చూశారా
E-Vitara Safety Test:మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా సేఫ్టీ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించింది. ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

Maruti E-Vitara Bharat NCAP Safety Test: మారుతి సుజుకి భారత మార్కెట్లో తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఈ EV జనవరి 2026లో భారత మార్కెట్లో విడుదల అవుతుంది. యూరప్ లో దాదాపు 12 దేశాలలో ఈ ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉందని తెలిసిందే. ఈ క్రమంలో మారుతి సుజుకి EV జనవరి 2026లో భారత మార్కెట్లోకి వస్తుంది. దీనికి ముందు, మారుతి కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ NCAP భద్రతా పరీక్షలో పాసైంది. మారుతి E-Vitara 5 స్టార్ భద్రతా రేటింగ్ సాధించింది. ఈ కారు సేఫ్టీ టెస్టులో పూర్తిగా మంచి ఫలితాలు ఇచ్చింది. మారుతి E-Vitara (Maruti E-VITARA) యూరో NCAP నుండి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.
మారుతి E-Vitara సేఫ్టీ స్కోరు
భారతదేశం క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌లో మారుతి కంపెనీకి చెందిన E-Vitara ఎలక్ట్రిక్ వెహికల్ 5 స్టార్ రేటింగ్, అత్యుత్తమ స్కోరును సాధించిన కారుగా అవతరించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో, E-Vitara 32కిగానూ ఏకంగా 31.49 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్ సెట్ క్రాష్ టెస్ట్ సమయంలో, కారు 64 kmph వేగంతో నడపగా, డ్రైవర్, ముందు ప్రయాణీకుల తల, మెడకు 'గుడ్' రేటింగ్ లభించింది. అదే సమయంలో డ్రైవర్ ఛాతీకి 'సాధారణం', ప్రయాణీకుల ఛాతీ రక్షణకు గుడ్ రేటింగ్ లభించింది.
చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో E-Vitara 49 పాయింట్లకుగానూ 43 పాయింట్లు వచ్చాయి. ఇందులో డైనమిక్ టెస్టింగ్‌లో 24కి 24 పాయింట్లు, చైల్డ్ రెస్ట్రయింట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌లో 12కి మొత్తం 12 పాయింట్లు లభించాయి. మిగిలిన 7 పాయింట్లు వాహన వాల్యుయేషన్ భాగాలకు ఇచ్చారు.
Maruti E-Vitara సేఫ్టీ ఫీచర్లు
మారుతి E-Vitaraలో ప్రయాణీకుల భద్రతపై పూర్తి ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. దీని ప్రామాణిక భద్రతా చర్యలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్ ఉన్నాయి. మారుతి SUVలో లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందించారు. దీనితో పాటు 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
గత కొంతకాలం నుంచి మారుతి కంపెనీ తమ తొలి ఎలక్ట్రిక్ కారుపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే సేఫ్టీ చెకింగ్ టెస్టులో 5 స్టార్ రేటింగ్‌తో భారత మార్కెట్లోకి ఈ విటారా వస్తున్నందుకు మారుతి కంపెనీ హర్షం వ్యక్తం చేసింది. కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతూ విక్రయాల్లో దూసుకెళ్తామని దీమాగా ఉంది.






















