అన్వేషించండి

Maruti Baleno on Road Price Hyderabad: హైదరాబాద్‌లో మారుతి బలెనో కంప్లీట్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ ఎంత? బ్రేకప్‌, మైలేజ్‌ అండ్‌ ఫీచర్స్‌ ఇవే!

Maruti Baleno on Road Price Hyderabad: మారుతి సుజుకి బలనో ఆన్‌రోడ్‌ ధర హైదరాబాద్ బేసి్ సిగ్మా వేరియంట్‌ 7.18 లక్షల నుంచి ప్రారంభమై, టాప్‌ ఎండ్‌ ఆల్ఫా ఏఎమ్‌టీ వేరియంట్‌కు 11.02 లక్షల వరకు ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఆకర్షణీయ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్.
  • మెరుగైన మైలేజీ, ఆధునిక సాంకేతికత, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రత.
  • హైదరాబాద్‌లో బాలెనో ఆన్‌రోడ్‌ ధరలు, వేరియంట్లు వివరాలు.

Maruti Baleno on Road Price Hyderabad: ప్రీమియం హ్యాచ్‌బ్యాచ్‌ సెగ్మెంట్‌లో ఎవర్‌గ్రీన్ కింగ్‌గా దూసుకుపోతోంది మారుతి సుజుకి బలెనో. అయితే ఈ కారు కొనేటప్పుడు కేవలం ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్ చూసి బడ్జెట్‌ ఫిక్స్ చేసుకుంటే... షోరూమ్‌కి వెళ్లాక ఆర్టీవో ఛార్జీలు, ఎన్సూరెన్స్‌, లైఫ్‌ టాక్స్‌లు చూసి షాక్ అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలోని లేటెస్ట్‌ రోడ్ ట్యాక్స్‌ రూల్స్ ప్రకారం హైదరాబాద్‌లో బలెనో బేస్ మోడల్‌ సిగ్మా నుంచి టాప్‌ ఎండ్‌ ఆల్ఫా ఏఎమ్‌టీ వరకు ప్రతి వేరియంట్‌ కంప్లీట్‌ ఆన్‌రోడ్‌ ప్రైస్‌ బ్రేకప్‌ ఎంత? లీటరుకు ఇది అందించే రియల్‌ టైమ్‌ మైలేజ్‌ ఎంత? మీ హార్డ్‌ ఎర్న్డ్‌మనీకి ఏ వేరియంట్‌ వందశాతం వాల్యూఫర్ మనీ అందిస్తుంది? ఇలాంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

లుక్స్‌ అండ్‌ డిజైన్ లాంగ్వేజ్ 

బలెనో మొదటిసారి చూసినప్పుడు దాని లిక్విడ్‌ ఫ్లో డిజైన్ ఎవరినైనా కట్టిపడేస్తుంది. దీని అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్‌ గార్నిష్‌, ప్రీమియం ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ కారుకు ఒక స్పోర్టీ లుక్ ఇస్తాయి. 16 ఇంచ్‌ డైమండ్‌-కట్‌ అలాయ్ వీల్స్‌, వెనుకు వైపు ఉండే కనెక్టింగ్ తరహా ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్‌ ఈ కారుకు రోడ్డుపై అద్భుతమైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ను అందిస్తాయి. లాంగ్ వీల్స్ బేస్‌ ఉండటం వల్ల కారు లోపల లెగ్‌రూమ్‌, క్యాబిన్ స్పేస్‌, 318లీట్ల బూట్ స్పేస్ ఫ్యామిలీ జర్నీలకు పర్ఫెక్ట్‌ కంఫర్ట్‌ను ఇస్తాయి. 

ఇంజన్ ఫెర్ఫార్మెన్స్- డ్రైవ్ క్వాలిటీ

మారుతి బలెనోలో 1197 సీసీ అడ్వాన్స్‌డ‌ కే సిరీస్‌ డ్యూయల్‌ జెట్‌, డ్యూయల్‌ వీవీటీ ఇంజిన్ అమర్చారు. ఇది 88 బీహెచ్‌పీ పవర్‌, 113Nm టార్క్‌ జనరేట్‌ చేస్తుంది. నగర ట్రాఫిక్‌లో దీని పికప్‌, పవర్‌ డెలివరీ చాలా స్మూత్‌గా ఉంటాయి. 5-స్పీడ్ మాన్యువల్‌, స్మార్ట్‌ ఏఎమ్‌టీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. ఇది బంపర్‌ టు బంపర్‌ ట్రాఫిక్‌ క్లచ్‌ నొక్కే తిప్పలు లేకుండా డ్రైవింగ్‌ను ఎంతో ఈజీగా మారుస్తుంది. 

పెట్రోల్, సీఎన్జీ దంచికొట్టుడే

మైలేజ్‌ విషయంలో మారుతి సుజుకి బ్రాండ్‌ను కొట్టేవాడే లేడు. బలెనో మాన్యువల్‌ వేరియంట్ లీటర్‌కు 22. 35kmpl మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్‌ వేరియంట్‌ ఏకంగా 22.94kmpl మైలేజ్ ఇస్తుంది. ఇక ఇంధన ఖర్చులు భారీగా తగ్గించుకోవాలనుకునే వారి కోసం లభించే బలెనో ఎస్‌-సీఎన్జీ వేరియంట్‌ వేరియంట్‌ కేజీకి ఏకంగా 30.61km/kgమైలేజ్‌ ఇస్తూ మధ్యతరగతి వినియోగదారులకు బెస్ట్ ఎకనామికల్‌ ఛాయిస్‌గా నిలిచింది. 

ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీ

ఇంటీరియర్‌ ఫీచర్స్ పరంగా చూస్తే, బలెనో ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో సరికొత్త బంచ్‌మార్క్‌ క్రియేట్ చేసింది. ఇందులో 9-ఇంచ్‌ స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్‌ టచ్‌ స్క్రీన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉంది. ఇది వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోను సపోర్ట్ చేస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు పై నుంచి దృష్టి మరల్చకుండా  డ్రైవింగ్ స్పీడ్‌, క్లైమేట్‌ కంట్రోల్‌ వివరాలను విండ్‌స్క్రీన్ పైనే చూసుకునేందుకు హెడ్స్ అప్‌ డిస్‌ప్లై టెక్నాలజీ ంది. హైదరాబాద్‌లోని ఇరుకైన గల్లీలు, పార్కింగ్ స్లాట్‌లలో కారును సురక్షితంగా రివర్స్ చేయడానికి 360డిగ్రీల వ్యూ కెమెరా ఫీచర్స్ అమితంగా తోడ్పడుతుంది. 

అల్టిమేట్‌ సేఫ్టీ ప్రమాణాలు 

కొత్త తరం బలనోలో సేఫ్టీ ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీని హయ్యర్‌ వేరియంట్‌లలో మొత్తం 6ఎయిర్‌ బ్యాగ్‌లు లభిస్తాయి. దీంతోపాటు ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, ఏబీఎస్ విత్‌ ఈబీడీ, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌లు వంటి క్రూషియల్‌ సేఫ్టీ ఫీచర్స్‌ ఉండటం వల్ల హైవేలపై ప్రయాణం ఎంత సురక్షితంగా , స్థిరంగా సాగుతుంది. 

హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ప్రైస్‌ బ్రేకప్‌!

తెలంగాణ మార్కెట్‌ో లైఫ్‌ టాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఎక్స్‌ షోరూమ్‌ ధర ఆధారంగా లెక్కిస్తారు. బలెనో బేస్‌ మోడల‌ సిగ్మా ఎక్స్ షోరూమ్‌ ధర 5, 98, 900 నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై దాదాపు 14 శాతం రోడ్‌ ట్యాక్స్‌ ఛార్జ్‌, ఇన్సూరెన్స్‌, ఇతర స్టాట్యూటరీ ఫీజులు అన్నీ కలుపుకొని హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర సుమారు 7.18 లక్షలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఫుల్లీ లోడెడె టాప్‌ మోడల్ ఆల్ఫా ఏఎమ్‌టీ ఎక్స్‌ షోరూమ్‌ ధర 9, 09,900 కగా, హైదరాబాద్‌లో అన్నీ ఛార్జీలతో కలిపి దీని ఫైనల్‌ ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ సుమారు 11.02 లక్షల వరకు ఉంటుంది. లగ్జరీ యాక్సెసరీస్‌, ఇంటీరియర్స్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా వచ్చిన ఆల్ఫా రీగల్‌ ఎడిషన్ ఆన్‌ రోడ్‌ ప్రైస్ సుమారు 11.62 లక్షల బడ్జెట్‌ తాకుతుంది. 

Frequently Asked Questions

మారుతి సుజుకి బలెనో అందించే మైలేజ్ ఎంత?

బలెనో మ్యాన్యువల్ వేరియంట్ 22.35kmpl, ఆటోమేటిక్ వేరియంట్ 22.94kmpl మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ కేజీకి 30.61km/kg మైలేజ్ అందించి, ఆర్థికంగా లాభదాయకమైన ఎంపికగా నిలుస్తుంది.

మారుతి సుజుకి బలెనోలో ఏ భద్రతా ఫీచర్లు ఉన్నాయి?

బలెనో హయ్యర్ వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియర్ పార్కింగ్ సెన్సార్‌లు అదనపు భద్రతను అందిస్తాయి.

హైదరాబాద్‌లో బలెనో ఆన్-రోడ్ ధర ఎంత ఉంటుంది?

హైదరాబాద్‌లో బలెనో బేస్ మోడల్ సిగ్మా ఆన్-రోడ్ ధర సుమారు 7.18 లక్షలు. టాప్ మోడల్ ఆల్ఫా ఏఎమ్‌టీ ఆన్-రోడ్ ధర సుమారు 11.02 లక్షలు. ఇందులో రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటివి కలుపుతారు.

బలెనోలో ఎలాంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి?

బలెనోలో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. డ్రైవింగ్ సమాచారం కోసం హెడ్స్ అప్ డిస్‌ప్లే, పార్కింగ్ కోసం 360-డిగ్రీల వ్యూ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget