అన్వేషించండి

Mahindra XUV 3XO: మహీంద్రా మాస్ - గంటలో 50 వేల బుకింగ్స్ కొట్టిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో!

Mahindra XUV 3XO Record: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో సేల్స్ కేవలం మొదటి గంటలోనే 50 వేల మార్కును దాటడం విశేషం.

Mahindra XUV 3XO Record Bookings: మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో బుకింగ్స్ నేడు (బుధవారం) ఉదయం 10 గంటలకు  ప్రారంభం అయ్యాయి. మొదలైన మొదటి 60 నిమిషాల్లోనే ఏకంగా 50,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్‌లను మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పొందడం విశేషం.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో దేశవ్యాప్తంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. మొదటి 10 నిమిషాల్లోనే ఏకంగా 27 వేల బుకింగ్‌లను నమోదు చేసింది. ఇది మహీంద్రా కొత్త ఎస్‌యూవీపై కస్టమర్ల అద్భుతమైన ఉత్సాహాన్ని చూపుతుంది. ఈ విజయం ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన రైడ్, అధునాతన సాంకేతికత, థ్రిల్లింగ్ పనితీరు, సాటిలేని భద్రతను ప్రతిబింబిస్తుంది.

కలర్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి?
ఈ ఎస్‌యూవీ గెలాక్సీ గ్రే, రెడ్, డూన్ బీజ్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ ప్లస్ గాల్వనో గ్రే, ఎవరెస్ట్ వైట్ ప్లస్ స్టెల్త్ బ్లాక్, గెలాక్సీ గ్రే ప్లస్ స్టెల్త్ బ్లాక్, స్టెల్త్ బ్లాక్ ప్లస్ గాల్వనో గ్రే, టాంగో రెడ్ ప్లస్ వంటి 16 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లాక్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, నెబ్యులా బ్లూ, డీప్ ఫారెస్ట్ ప్లస్ గాల్వనో గ్రే, డూన్ బీజ్ ప్లస్ స్టెల్త్ బ్లాక్, సిట్రిన్ ఎల్లో, సిట్రిన్ ఎల్లో ప్లస్ స్టెల్త్ బ్లాక్ రంగుల్లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

ఇంజిన్, మైలేజీ ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఇప్పటికే ఉన్న పెట్రోల్ ఇంజన్ (130 పీఎస్/230 ఎన్ఎం) లాగా అదే పెట్రోల్, డీజిల్ ఆప్షన్లను పొందుతుంది. అన్ని ఇంజన్లు ప్రామాణికంగా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మార్కెట్లోకి రానున్నాయి. రెండు పెట్రోల్ ఇంజన్లు ఆప్షనల్‌గా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ని పొందుతాయి. అయితే డీజిల్ యూనిట్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్ లీటరుకు 18.89 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 17.96 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ టీజీడీఐ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 20.1 కిలోమీటర్ల మైలేజీని, 1.2 లీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్-8 పెట్రోల్‌, 1.2 లీటర్ టీజీ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు 20.6 కిలోమీటర్ల మైలేజీని, 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 21.2 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నాయి.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్, మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం), క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి కొన్ని అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి.

Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!

టాప్ హెడ్ లైన్స్

Renault Kiger, Triber, Kwidపై అద్భుతమైన ఆఫర్లు - వేల రూపాయలు ఆదా, ఇది పరిమిత కాల ఆఫర్‌
కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్‌ - రూ.68,000 వరకు డిస్కౌంట్లు ప్రకటించిన రెనాల్ట్‌
Maruti Suzuki Celerio EMI Calculator: 50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
50వేల రూపాయల డౌన్‌పేమెంట్‌తో మారుతి సెలెరియో సొంతం చేసుకునే EMI ప్లాన్ ఇదే! 
రేస్‌ బైక్‌ తరహాలో Yamaha R15 V4, MT-15 MotoGP ఎడిషన్లు లాంచ్‌ - FZ-S సిరీస్‌కు కొత్త రంగులు
యమహా R15 V4, MT-15 మోటోజీపీ ఎడిషన్లు లాంచ్‌.. అచ్చం 'రేస్‌ బైక్‌'ను చూసినట్లే ఉంది
TVS స్కూటర్ల ధరలు పెంపు.. పాపులర్‌ మోడళ్ల రేట్లు ఏకంగా రూ.11,000 వరకు హైక్‌, ఇదిగో లిస్ట్‌
TVS స్కూటర్‌ కొనేవాళ్లకు షాక్‌! iQube నుంచి Jupiter వరకు వేలల్లో పెరిగిన ధరలు - కొత్త రేట్లు ఇవే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget