అన్వేషించండి

Mahindra Thar Roxx: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!

Mahindra Thar Roxx BNCAP Rating: మహీంద్రా థార్ రోక్స్ కారు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

Mahindra Thar Roxx Safety Features: మహీంద్రా థార్ రోక్స్ ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది. థార్ రోక్స్ మార్కెట్లో లాంచ్ కాకముందే ఈ ఆఫ్ రోడింగ్ కారు గురించి ప్రజలలో ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ కారు సేఫ్టీ టెస్టులో కూడా మంచి స్కోరు సాధించింది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో థార్ రోక్స్‌కి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. క్రాష్ టెస్ట్‌లో ఈ మహీంద్రా కారు అత్యుత్తమ స్కోర్ సాధించింది. అదే సమయంలో మహీంద్రా మరో రెండు వాహనాలు భారత్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి.

మహీంద్రా థార్ రోక్స్ సేఫ్టీ స్కోర్ ఎంత?
మహీంద్రా థార్ రాక్స్ క్రాష్ టెస్ట్‌లలో భారత్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన మొదటి బాడీ ఆన్ ఫ్రేమ్ ఎస్‌యూవీగా నిలిచింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో థార్ రాక్స్ 32 పాయింట్లకు 31.09 స్కోర్ చేసింది. అదే సమయంలో ఈ కారు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో 49 పాయింట్లకు 45 స్కోర్ చేసింది. సాధారణ ల్యాడర్ ఫ్రేమ్‌తో ఏ ఎస్‌యూవీకి అయినా 5-స్టార్ రేటింగ్ పొందడం చాలా పెద్ద విషయం. ఐసీఈ వాహనాల్లో ఒక కారు అందుకున్న అత్యుత్తమ స్కోర్ ఇదేనని మహీంద్రా పేర్కొంది.

Also Read: రూ.ఏడు లక్షల్లోపు ధరలోనే మారుతి కొత్త డిజైర్ - సేఫెస్ట్ మారుతి కారు ఇదే!

థార్ రోక్స్ సెక్యూరిటీ ఫీచర్లు
మహీంద్రా థార్ రాక్స్‌లో అనేక శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లు చేర్చారు. ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీంతో పాటు కారులో ప్రయాణించే ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా అందించారు. ఈ మహీంద్రా కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. థార్ రాక్స్ స్టాండర్డ్ మోడల్‌తో సహా అన్ని వేరియంట్లలో ఈ సెక్యూరిటీ ఫీచర్లు చూడవచ్చు.

మహీంద్రా థార్ రాక్స్‌లో లెవెల్ 2 ఏడీఏఎస్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరాతో బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఉన్నాయి. ఈ కారులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఫీచర్ కూడా ఉన్నాయి.

ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ఇతర మహీంద్రా కార్లు...
మహీంద్రా తన ఇతర వాహనాలను భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ కోసం పంపింది. ఇందులో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, ఎక్స్‌యూవీ400 కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32 మార్కులకు 29.36, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 మార్కులకు 43 మార్కులు పొందింది. అయితే ఎక్స్‌యూవీ400 అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32 మార్కులకు 30.377 మార్కులు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 మార్కులకు 43 మార్కులు సాధించింది. మంచి సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది కాబట్టి భారతదేశంలో థార్ రోక్స్ సేల్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

Also Read: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!

టాప్ హెడ్ లైన్స్

Maruti Dzireకు ప్రత్యామ్నాయంగా Honda Amaze కొనబోతున్నారా? ముందు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోండి
కొత్త Honda Amaze కొనేవాళ్లకు అలెర్ట్‌! ఈ సెడాన్‌లో మీకు తెలియాల్సిన 3 ప్లస్‌లు, 3 మైనస్‌లు!
Ethanol: పెట్రోల్ తర్వాత డీజిల్‌పైనా ప్రయోగం.. ఇథనాల్‌పై కేంద్రం ఎందుకు వెనక్కి తగ్గింది?
డీజిల్‌లో ఇథనాల్ కలపడం కుదరదు.. అసలు కారణం ఇదే!
బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget