News
News
X

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

ఎలక్ట్రిక్ టూవీలర్స్ రంగంలో సరికొత్త ముందడుగు పడింది. దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ అయ్యింది. స్టార్టప్ కంపెనీ మేటర్ ఈ సరికొత్త బైక్ ను రూపొందించింది.

FOLLOW US: 
Share:

టెక్నాలజీ స్టార్టప్  కంపెనీ మేటర్ సరికొత్త ఆవిష్కరణ రెడీ అవుతోంది. దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందించింది. తాజాగా తన ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దేశంలోనే తొలి గేర్డ్ బైక్ ను రూపొందించిన ఘనత తమకే దక్కుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ ఇంటిగ్రేటెడ్, హై-ఎనర్జీ డెన్సిటీ, 5 kWh పవర్ ప్యాక్‌ని కలిగి ఉంటుందని తెలిపింది. ఈ బైక్ ఇంట్లోనే రూపొందించడం విశేషం. అంతేకాదు, మొదటి లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.

ఒక్క చార్జ్ తో 150 కిలో మీటర్లు ప్రయాణించే అవకాశం

హైపర్‌ షిఫ్ట్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఈ బైక్ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. 10.5kW ఎలక్ట్రిక్ మోటార్ సీక్వెన్షియల్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. టోర్క్, ఒబెన్‌తో సహా ప్రస్తుత ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్ల కంటే బ్యాటరీ ప్యాక్ పెద్దది. దాదాపు 150 కిలో మీటర్ల పరిధిని అందిస్తోంది. మోటార్‌ సైకిల్ స్టాండర్డ్,  ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. స్టాండర్డ్ ఆన్‌ బోర్డ్ 1kW ఇంటెలిజెంట్ ఛార్జర్‌ తో ప్రామాణికంగా వస్తుంది. ఆన్‌ బోర్డ్ ఛార్జర్ 5 గంటలలోపు వాహనాన్ని ఛార్జ్ చేయగలదు.

ఉపయోగకరమైన ఫీచర్లు

డిజైన్ ఎడ్జీగా ఉంటుంది. నేక్డ్ మోటార్‌ సైకిల్‌ ను పోలి ఉంటుంది. బై-ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్, స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్స్, బాడీ-ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్స్,  ష్రౌడ్,  మోటారుకు జోడించబడిన  ఎక్స్‌ పోజ్డ్ స్పిన్నర్ ఉన్నాయి. బోర్డులో సాంకేతికత పరంగా, 4G ఆండ్రాయిడ్ కనెక్టివిటీతో టచ్-ఎనేబుల్డ్ 7-అంగుళాల వెహికల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిమోట్ కమాండ్‌ లతో కనెక్ట్ చేయబడిన మొబైల్ అప్లికేషన్ ఉన్నాయి. ఇతర ఫీచర్లు లైవ్ లొకేషన్ ట్రాకింగ్,  వెహికల్ హెల్త్ మానీటరింగ్, రైడర్‌కు పర్సనలైజ్డ్ రైడ్ స్టార్టిస్టిక్స్ అందిస్తుంది.  ఛార్జింగ్ స్థితి, పుష్ నావిగేషన్ అలర్ట్ ఉంటుంది. రివర్స్ ఫీచర్‌ తో పాటు కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. భద్రత పరంగా, ABS తో ముందు/వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

బైక్ పేరు, ధర వెల్లడించని కంపెనీ

అయితే, ఈ మోటార్‌సైకిల్ పేరును వెల్లడించలేదు. ధర వివరాలను కూడా బయకు వెల్లడించలేదు. ప్రారంభ ధరలతో పాటు బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ముగుస్తాయి. మొత్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కు మార్కెట్లో మంచి స్పేస్ ఉంది. అందులో భాగంగానే ఈ బైక్ సైతం మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రెడీ అయిన ఈ ఎలక్ట్రిక్  మోటార్ సైకిల్, వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. ఈ కొత్త మోటార్‌ సైకిల్ గురించి మరింత సమాచారం త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. 

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ - ఓలా ఎస్1 ఎయిర్, వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ అంటే?

Published at : 29 Nov 2022 03:26 PM (IST) Tags: India’s First Geared Electric Motorbike Geared Electric Motorbike Check Specs Expected Launch Timeline

సంబంధిత కథనాలు

Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?

Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?

Union Budget 2023: మరింత తగ్గనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధర - ఆటోమొబైల్స్ హైలెట్స్ ఇవే!

Union Budget 2023: మరింత తగ్గనున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధర - ఆటోమొబైల్స్ హైలెట్స్ ఇవే!

CAEV Expo 2023: ఇండియాలో మరో ఆటో ఎక్స్‌పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

CAEV Expo 2023: ఇండియాలో మరో ఆటో ఎక్స్‌పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Maruti Suzuki: గ్రాండ్‌ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్‌

Maruti Suzuki: గ్రాండ్‌ విటారా కొన్నారా? - తక్షణం కంపెనీకి తిరిగి పంపండి, లేదంటే డేంజర్‌

టాప్ స్టోరీస్

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్‌ టూర్ పూర్తి షెడ్యూల్‌ ఇదీ

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా