Car Modifications: కారుకు ఇలాంటి మార్పులు చేయిస్తున్నారా? చట్టపరంగా వచ్చే చిక్కులేమిటీ? ఈ జాగ్రత్తలు పాటించకపోతే కష్టమే!
కొత్తగా కారు కొనుగోలు చేసినా, లేదంటే సెకెండ్ హ్యాండ్ కారు తీసుకున్నా, చాలా మంది తమకు నచ్చినట్టుగా మార్పులు, చేర్పులు చేయించుకుంటారు. అయితే, కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
Car Modifications: కారు కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది తమకు అనుకూలంగా ఉండేలా మార్పులు చేయించుకుంటారు. ఎవరి డ్రైవింగ్ స్టైల్‌కు అనుకూలంగా వాళ్లు మోడిఫికేషన్స్ చేసుకుంటారు. ఉన్న డిజైన్ కు మెరుగులు అద్దుతారు. మరికొంత మంది ఇంటీరియన్ అనుకూలంగా మార్పించుకుంటారు. ఇంకొంత మంది ఇంజిన్ పనితీరును పెంచే ప్రయత్నం చేస్తారు. కొంత మంది ఆకర్షణీయమైన లైట్లు ఏర్పాటు చేయించుకుంటారు. అయితే. కారు మోడిఫికేషన్ కు సంబంధించి కొన్ని చట్టబద్దమైన అంశాలతో పాటు మరికొన్ని చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చట్టపరమైన కారు సవరణలు
1. బాడీ కిట్ ఇన్‌స్టాలేషన్: కారు లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చేందకు క్లాడింగ్, సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ స్ప్లిటర్లను బింగించుకోవచ్చు. వాహనానికి సంబంధించి ప్రాపర్ లుక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు.
2. కలర్ ఛేంజ్: కారుకు కొత్త రంగు వేయించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ముందుకు ఆర్టీవో నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆర్మీ గ్రీన్ లాంటి కొన్ని కలర్స్ సైనిక వాహనాల కోసం ప్రత్యేకించబడ్డాయి. అవి మినహా, కొత్త పెయింట్ వివరాలతో మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. బాడీ ర్యాపింగ్: కారు ప్రొటెక్షన్, అందం కోసం కారు మీద వినైల్ ర్యాప్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, ర్యాప్ మీ కారు అసలు రంగుతో మ్యాచ్ అయితే ఆర్టీవో ఆమోదం అవసరం లేదు. కానీ, పూర్తిగా రంగు మార్చితే మాత్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
4. ఆఫ్టర్ మార్కెట్ CNG కిట్లు: కారును కొనుగోలు చేసిన తర్వాత CNG కిట్లను ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్థానిక ఆర్టీవోతో ఆర్సీని అప్ డేట్ చేయించుకోవాలి. అందులో CNG కిట్‌ను మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
5. సస్పెన్షన్ ఛేంజెస్: చక్కటి సౌకర్యం కోసం సస్పెన్షన్ ను మార్చుకునే అవకాశం టుంది. అయితే, వెహికల్ కు సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో పెద్ద మార్పులు చేయకూడదు.
చట్టవిరుద్ధమైన కారు సవరణలు
1. అదనపు లైట్ల ఏర్పాటు: కారుకు నచ్చినట్టుగా లైట్లను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధం. హెడ్ లైట్ల సంఖ్యకు మించి ఉండకూడదు. ఎదుటి వాహనాలకు ఇబ్బంది కలిగించేలా లైట్లు ఏర్పాటు చేయడాన్ని అధికారులు నిషేధించారు.
2. ఆఫ్టర్‌మార్కెట్ ఎగ్జాస్ట్ లు: కారుకు రావాల్సిన శబ్దం కంటే మించి ఉండేలా మార్పులు చేయడం చట్ట విరుద్ధం. కారుకు పెద్ద శబ్దాలు వచ్చేలా ఆఫ్టర్‌మార్కెట్ ఎగ్జాస్ట్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ బిగించకూడదు.
3. పారదర్శకం కాని స్క్రీన్లు: కారుకు సంబంధించి ముందు, వెనుక స్క్రీన్లు కనీసం 70 శాతం కనిపించేలా ఉండాలి. కొంత మంది తమ కార్లకు ముదురు రంగులో ఉండే అద్దాలను ఉపయోగిస్తారు. అలా చేయడం చట్టవిరుద్ధం. ముదురు రంగు అద్దాలు డ్రైవర్ దృష్టికి ఆటంకం కలిగిస్తాయి.
4. బుల్ బార్లు: బుల్ బార్లు కారు భద్రతను పెంచుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. వాస్తవానికి, క్రాష్ అయినప్పుడు, బుల్ బార్ కారుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇంజిన్‌పై కూడా ప్రభావం చూపిస్తాయి. ఎయిర్‌బ్యాగ్‌ల పనితీరును కూడా అడ్డుకుంటాయి. కారు లోపల ఉన్నవారికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాటిని ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం.
5. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు: ప్రతి కారు తప్పకుండా హై-సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను కలిగి ఉండాలి. వాటి మీద 3D హాల్ మార్క్ చేయబడిన IND అక్షరాలు ఉంటాయి. వీటికి బదులుగా ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లను ఉపయోగించడం చట్టవిరుద్ధం.
6. శరీర రకాన్ని మార్చడం: సెడాన్లను లిమోసిన్లు , కన్వర్టిబుల్లుగా మార్చడం చట్టవిరుద్దం.
7. ఇంజిన్ మార్పు: సరైన అనుమతి లేకుండా ఇంజిన్లను మార్చుకోవడం కూడా చట్ట విరుద్ధం. ఒకవేళ మార్చుకోవాలని అనుకుంటే స్థానిక RTOను సంప్రదించడం మంచిది.
Read Also: మోస్ట్ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్న మెర్సిడెస్ - లాంచ్ ఎప్పుడంటే?