Hyundai Verna CSD: రూ.1.71 లక్షలు తగ్గనున్న వెర్నా ధర - కేవలం వీరికి మాత్రమే!
Hyundai Verna CSD Price: హ్యుందాయ్ వెర్నాను సీఎస్‌డీ ద్వారా సైనికులు తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల ఈ కారు ధర రూ.1.71 లక్షల వరకు తగ్గనుంది.
Hyundai Verna Offer: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ సీఎస్‌డీ (క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్) ద్వారా దేశంలోని సైనికులకు వెర్నా సెడాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని కారణంగా ఆర్మీ క్యాంటీన్ నుంచి కార్లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు జీఎస్‌టీలో చాలా తగ్గింపు లభిస్తుంది. కంపెనీ వెర్నా సీఎస్‌డీకి సంబంధించిన పూర్తి ధరల జాబితాను అందించింది. అప్‌డేట్ చేసిన ధరలను విడుదల చేసింది. ఇక్కడ హ్యుందాయ్ వెర్నా క్యాంటీన్ ధరలు, బయట మార్కెట్లో లభించే ఎక్స్-షోరూమ్ ధరలకు ఉన్న తేడాలు చూద్దాం.
హ్యుందాయ్ వెర్నా సెడాన్ భారత మార్కెట్లో హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెర్టాస్, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్‌లకు పోటీగా ఉంది. ఈ కార్లన్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. వెర్నా సీఎస్‌డీ ధరలు ఎక్స్ షోరూమ్ ధరతో పోలిస్తే దాదాపు రూ. 1.26 లక్షల నుంచి రూ. 1.71 లక్షల వరకు తక్కువగా ఉన్నాయి.
ఒక్కో వేరియంట్ ధర ఎంత?
1.5 లీటర్ సాధారణ పెట్రోల్ మాన్యువల్ ఈఎక్స్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.4 లక్షలుగా ఉంది. దీని సీఎస్డీ ధర రూ. 9.72 లక్షలు మాత్రమే. ఈ విధంగా రెండింటికీ రూ. 1.27 లక్షల వరకు తేడా ఉంది. ఇది కాకుండా ఎస్ వేరియంట్ ధర రూ.11.99 లక్షలు కాగా, సీఎస్‌డీ ధర రూ.10.73 లక్షల వరకు ఉంది. ఈ రెండిటికీ ధరల్లో రూ.1.25 లక్షల వరకు తేడా ఉంది.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
ఎస్ఎక్స్ వేరియంట్ గురించి చెప్పాలంటే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.27 లక్షలు కాగా, దీని సీఎస్డీ ధర రూ. 12.93 లక్షలుగా ఉంది. దీంతో పాటు ఎస్ఎక్స్ (వో) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.23 లక్షలుగా నిర్ణయించారు. దీని సీఎస్డీ ధర రూ.14.63 లక్షలు. ఈ రెండు ధరల మధ్య రూ. 1.37 లక్షల వ్యత్యాసం ఉంది.
మీరు పొందే ఫీచర్లు ఇవే...
హ్యుందాయ్ వెర్నా 5 సీటర్ సెడాన్ కారు. ఈ కారులో 26.03 సెంటీ మీటర్ల (10.25 అంగుళాల) హెచ్‌డీ ఆడియో వీడియో నావిగేషన్ సిస్టమ్ ఉంది. ఈ సెడాన్ కారు డ్రైవర్‌కు క్యాబిన్‌లో మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారులో స్విచ్చబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా అందించారు. దీనితో పాటు, కారులో క్లైమేట్ కంట్రోలర్ కూడా ఉంది. హ్యుందాయ్ లాంచ్ చేసిన ఈ మోడల్ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 115 పీఎస్ పవర్‌ని, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Experience next-level safety with the Hyundai VERNA! Equipped with intelligent safety features and a six-airbags , it's designed for ultimate protection.
— Hyundai India (@HyundaiIndia) August 10, 2024
To know more, visit: https://t.co/WfDixUgXKC #Hyundai #HyundaiIndia #AllNewVerna #Futuristic #Ferocious #ILoveHyundai pic.twitter.com/omLgpfU2zu
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి