Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
Hyundai Exter Waiting Period: హ్యుందాయ్ ఎక్స్‌టర్ వెయిటింగ్ పీరియడ్ కొన్ని నెలల వరకు చేరుకుంది.
![Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది! Hyundai Exter Waiting Period Goes Upto 8 Months Check Details Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/25/71900730269b82bf869231971460d8ec1695649292696456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyundai Exter Waiting Period: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇటీవలే తన ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్‌టర్ నేరుగా టాటా పంచ్‌తో పోటీపడుతుంది. భారతీయ కస్టమర్లలో ఎక్స్‌టర్‌కు మంచి స్పందన ఉంది. కంపెనీ ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. దీన్ని బట్టి ఎక్స్‌టర్ హైప్‌ను అంచనా వేయవచ్చు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సన్‌రూఫ్‌తో కూడిన మొదటి మూడు వేరియంట్‌లు మొత్తం బుకింగ్‌లలో 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీని తర్వాత ఏఎంటీ, సీఎన్‌జీ వేరియంట్‌లను ఇష్టపడుతున్నారు.
భారీ బుకింగ్స్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఎనిమిది నెలలు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ల్లో నాలుగు నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ముంబై, పుణేల్లో కస్టమర్లు మూడు నెలల్లో డెలివరీని ఆశించవచ్చు. కోల్‌కతాలో వారు మూడున్నర నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ వేరియంట్‌లు ఇవే...
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఐదు ట్రిమ్‌లలో వస్తుంది. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (వో), ఎస్ఎక్స్ (వో) కనెక్ట్. మాన్యువల్ వేరియంట్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఏఎంటీ మోడల్ ధర రూ. 7.97 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎస్, ఎస్ఎక్స్(వో) అనే రెండు సీఎన్‌జీ వేరియంట్‌లు కూడా ఉన్నాయి. ఇందులో మొదటి కారు ధర రూ.8.24 లక్షలు కాగా, రెండో మోడల్ ధర రూ.8.97 లక్షలుగా ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 83 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనిలో మీరు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్ 69 బీహెచ్‌పీ శక్తిని, 95.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంది.
ఎక్స్‌టర్‌లోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌తో ఏఎంటీ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు. ఎక్స్‌టర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 19.4 కిలోమీటర్ల మైలేజీని, ఏఎంటీ వేరియంట్ 19.2 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. అయితే ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్‌జీ మోడల్ నుండి 27.10 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందవచ్చు. ఈ సెక్షన్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు టాటా పంచ్ గట్టి పోటీని ఇవ్వనుంది.
Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)